మరుగున పడిన మతాలు –మతాచార్యులు -30
క్వేకర్ మతం
పది హేడ వ శతాబ్దం లో క్రైస్తవ మతం లో ఏర్పడిన మతోద్యమమే క్వేకర్ మతం క్వేకర్ అంటే స్నేహితుడు అని అర్ధం .ఈ మత స్తాపకుడు జార్జి ఫాక్స్ .పది హేడవ శతాబ్దానికే ఈ మతం అమెరికా లో బాగా వ్యాపించింది .ఇప్పటికి చాలా దేశాలలో వీరి సభ్యులున్నారు .19 వ శతాబ్దం లో ఈ అమతం అమెరికా లో రెండు శాఖలు గా చీలింది .ఒక తెగ వారిని ‘’హైక్వైట్లు ‘’అని రెండవ తెగ వారిని ‘’విల్బ రైట్లు ‘’అని అంటారు క్వేకర్లను” రిలిజియస్ సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ ”అంటారు ముందుగా 1640 లో ఇంగ్లాండ్ లో క్వేకర్ మతం పుట్టింది అమెరికాకు తర్వాతా చేరింది . విలియం పెన్ అమెరికా లోని పెన్సిల్వేనియా లో దీన్ని మొత్తందట వ్యాపింప జేశాడు . ఆఫ్రికాలోనూ సుస్తిరమైన్ది
![]()
![]()
క్వేకర్ మత చిహ్నం విలియం పెన్
ఆంతరంగిక ఆధ్యాత్మిక భావానికి క్వేకర్లు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు .అహింసా పద్ధతిలోనే ప్రభుత్వాన్ని ,మతా దిపతులను లను ఎదిరించారు పీడనాన్ని ఎదుర్కొని నిలిచారు .అవతలి వారు యెంత హింసకు గురి చేసినా సహిమ్చారే కాని హింసా మార్గాన్ని చేబట్టలేదు క్వేకర్లు .మతా చార్యుల పోషణ కోసం ఏర్పడిన ‘’ti thes ‘’ అంటే వ్యక్తీ సంపాదనలో పదవ వంతు మతా చార్యుల పోషణ కు ఇవ్వాలి అనే శాసనాన్ని క్వేకర్లు బాగా ఎదిరించారు ఇది దారుణం అన్నారు .వ్క్వేకర్లు కూడా తమ మతా చార్యులను జీతాలిచ్చి పోషించ కుండా ఆదర్శం గా నిలిచారు .అలాగే న్యాయ స్తానాలలో ప్రమాణం చేయ టాన్ని నిరాకరించారు .


జార్జి ఫాక్స్
యుద్ధాలను వ్యతిరేకించారు .హింసను ఖండించారు .మానవ హక్కుల కోసం వర్ణ విచక్షతకు ఎదురు నిలిచారు .ఆపదలో ఉన్న వారికి తక్షణ సాయం చేశారు .వయోజన విద్యా వ్యాప్తి కి ఎన్నో పాఠ శాలలు నిర్మించి నడిపించారు .ప్రాధమిక మత విశ్వాసాలలో సాధారణ క్రైస్తవులకు క్వేకర్ల కు తేడా ఏమీ లేదు .బైబిల్ పఠనం కోసం అమెరికా లో ఒక విద్యాలయాన్ని నెల కోల్పారు .వీరి సంస్కృతీ ,జీవన విధానం ఇప్పటికి గౌరవింప బడుతున్నాయి ఆదర్శ జీవితాలనుగడి పారు .జైళ్ళ సంస్కరణకు ,శిక్షా స్మృతి సంస్కరణ కు ,ఉన్మాద శరణాలయ సంస్కరణ లో వీరి పాత్ర మరువ లేనిది అన్ని మతాల వారిని సోదర ప్రేమ తో చూసి అసలైన క్రైస్తవులని పించు కొన్నారు .
. క్వేకర్ అనే బిరుదు ఒక ప్యూరిటన్ న్యాయాధికారి వీరికి ఇచ్చాడు .ఆయన అ మాటను వీరిపై అసహ్య భావం తో అన్నప్పటికీ ,వీరి శీలం ప్రవర్తన వల్ల ఆ పదం లో ఆ భావమే లేకుండా పోయింది .’’అంతర్ జ్యోతి ‘’అనే ఆధ్యాత్మిక భావామే క్వేకర్ మతం .ఈ అంతర్ జ్యోతి ననుసరించే క్రీస్తు భూలోకం లో తమ కోసం వచ్చాడని వీరి విశ్వాసం .యేసు క్రీస్తును హృదయం లో నెల కోల్పుకొని జీ వించ టమే క్వేకర్లకు పరమార్ధం .అందుకని క్వేకర్లకు బయటి ఆడంబరాలు నచ్చవు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-10-13- ఉయ్యూరు

