మరుగున పడిన మతాలు –మతాచార్యులు -31
స్టాయిక్ మతం
గ్రీకు దర్శన శాస్త్రేం లోచివరి యుగానికి చెందినమతమే స్టాయిక్ మతం .క్రీ పూ300 లో ‘’జీనో ‘’స్టాయిక్. మతాన్ని ఎదేన్స్ నగరం లో స్తాపించాడు ఇందులో నైతికం, దార్ర్శనికం అనే రెండు భాగాలున్నాయి …ఎదేన్స్ లో జీనో ఒక సంత దగ్గర బొమ్మలు వేసే ‘’స్టోవా‘’అనే వసారాలో దీన్ని మొదట బోధించటం వల్ల స్స్టాయిక్ మతం అనే పేరొచ్చింది .దీన్ని అనుసరించే వారే స్టాయిక్కులు .
![]()
![]()
సత్య ద్వారం తెరవటం జీనో
సినిక్ దార్శనికుడైన స్టాయిక్ దగ్గర జీనో విద్య నేర్చుకొన్నాడు .ఆ మతం లోని నైతిక సిద్ధాంతాలను తీసుకొని స్టాయిక్ మతం గా వృద్ధి చేశాడు జీనో .ఇతని వారసుడు క్లియాన్తిస్ .ఇతను ఇందులోని హేరా క్లైటాస్ మత భావాలను వ్యాప్తి చేశాడు .హేరా క్లైటాస్ చెప్పిన విశ్వాగ్ని (యూని వరసల్ ఫైర్ ),లాగాన్ చెప్పిన కాలం అనే సిద్దాన్తాలున్తాయి .తరువాత క్రిసప్పాస్ దీన్ని ఇంకా వ్యాపింప జేశాడు .క్రీ.పూ.రెండో శతాబ్దిలో దీన్ని రోమన్ సామ్రాజ్యం లో సేనే టియన్ ప్రవేశ పెట్టాడు .ఇతను చెప్పిన దాన్ని‘’మధ్య స్టోవాఅన్నారు .రోమన్ కుటుంబాలలో ఇది రెండు వందల ఏళ్ళు బాగా వ్యాపించింది .క్రీ.పూ.ఒకటవ శతాబ్దం లో ‘’సేనేకా ‘’,ఎపిక్తాస్ ,మార్కస్ ,ఒరీలియన్ చక్ర వర్తి బాగాఉధృతం గా గా ప్రచారం చేశారు .క్రీ;శ .మూడవ శతాబ్దం వచ్చేసరికి స్టాయిక్ భావాలన్నీ క్రైస్తవ మతం లో చేరిపోయాయి .రోమన్ ధర్మ శాస్త్రం పై సేనేకా, స్టాయిక్ మత ప్రభావం బాగా ఉండేది .
స్టాయిక్ మతం లో మూడు భాగాలున్నాయి తర్కం ,భౌతికం ,నీతి శాస్త్రాలు .తర్క శాస్త్రం లో మనసు బయటి వాటి నుంచి ఇంద్రియాల ద్వారా సంవేదనలు గ్రాహించి హేతు బుద్ధి తో ఒక క్రమంగా మార్చి సామాన్య భావాన్ని సృష్టించు కొంటుంది .మనసుకు దృఢ మైన నమ్మకం కలిగితే కాని సంవేదనలు సత్యం అని అంగీకరించదు .సామాన్య భావాలు –ఏ సంబంధం గుణాల యొక్క సామాన్యలయ్యయో వాటికి ఈ విశ్వం లోని హేతు క్రమం కు అనుగున్ణ్యం గా ఉన్నప్పుడే అవి సత్యాలవుతాయి .గుణాలు ,సంబంధాలు మనం సంకల్పించేవి కావు అంటుంది స్టాయిజం ..నిజం గా ప్రకృతి లో ఉంటె,సామాన్య భావాలు మన మనసులో మాత్రమె ఉంటాయి అంటారు స్టాయిక్కులు సత్యాన్ని చేరాలంటే అనుమానం కూడా ఒక ప్రమాణమే .కనుక తర్కం అనేది వీరిసాధనం .అరిస్టాటిల్ చెప్పిన న్యాయ ప్రయోగ సిద్ధాంతాలకు కొన్ని మార్పులు చేసి ,కొత్తవి చేర్చి దీన్ని రూపొందించారు
భౌతిక శాస్త్రం లో అరిస్టాటిల్ చెప్పిన అతి భౌతిక రూపమే స్టాయిక్కులభౌతిక శాస్త్రం .దీనిలో ఖగోళం ,మతం మనస్తత్వ శాస్త్రాలున్నాయి .ఈ విశ్వానికి మూల కారణం అంతటా వ్యాపించి ఉండే అగ్ని అంటారు స్టాయిక్కులు .అదే ఈశ్వరుడు అన్నారు .సత్తా అనేది రెండు తత్త్వాలలో ఉంటుంది మొదటిది .సచేతన మైనది .ఇది స్వయం చాలక మైనది .ఇదే కార్య కారకం కూడా .ఇతర వస్తువులకు రూప కల్పనా చేస్తుంది .రెండవది జడం ఇది మార్పు చెందుతుంది ,కదలిక ఉంటుంది ఇతరాలు దీన్ని రూప కల్పనా చేస్తాయి ఆలోచన లో మాత్రమె ఈ రెండు తత్వాలను వేరు చేయగలం .నిజం గా చెప్పాలంటే ఈరెండు కలిసే ఉంటాయి అన్నది స్టాయిక్కుల జడ తత్త్వం .
స్టాయిక్కులు నియతి వాదాన్ని సమర్ధించారు .ప్రపంచం లో అన్ని పూ ర్వమే ఈ విశ్వం ఏర్పాటు చేసిందని ,విధిని అంగీకరించటం లోనే మనిషికి స్వేచ్చ ఉందని అంటారు .
స్టాయిక్కులనీతి శాస్త్రం లో సృష్టి నియమాన్ని (లాగోస్ )క్రమాన్ని ,హేతువు ను తెలుసు కొని దాన్ని అనుసరించటమే మానవ కర్తవ్యమ్ అన్నారు స్టాయిక్కులు .అత్యుత్తమ తత్వమైన హేతు బుద్ధిని అనుసరించి జీవించాలి .సుఖం ధర్మాని కంటే భిన్నమైనది ..అదొక రాగం మాత్రమె .రాగాలను లోబర్చుకొన్న వాడే రుషి .ఆరోగ్యం, జీవితం, మర్యాదా, డబ్బు హోదా ,అధికారం స్నేహం విజయం స్వతస్సిద్ధమైనవి .ఇవి శ్రేయస్కరాలు కావు .మృత్యువు వ్యాధి అవమానం దరిద్రం నీచ జన్మ ఇవి స్వయం గా దోషాలు కావు .వీటి ఆచరణ మనకు ఫలితం ఇస్తుంది .ఇవి మన ఆచరణకు లక్ష్యాలు కాదు .ఆనందం సౌఖ్యం సాధించటం మన శక్తి లోనిది కాదు .మన సంకల్పాన్నను సరిం చి దృష్టిని మార్చుకోవాలి .వాటి విలువ మన శీలం గల ప్రభావం మీదనే ఆధార పడి ఉంటాయి .ధర్మమే అన్నిటికన్నా స్వతస్సిద్ధం గా ఉత్తమోత్తమ మైనది .అదే అసలైన అందాన్ని చేకూర్చేది .ధర్మా ధర్మ విచక్షణత తో చేసే పని మాత్రామే ధర్మా చరణ అవుతుంది .వైరాగ్యం స్టాయిక్కులనైతిక లక్ష్యం .కొన్ని సందర్భాలలో స్టాయిక్కులు ఆత్మ హత్యను సమర్ధించారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-13 ఉయ్యూరు

