మరుగున పడిన మతాలు-మతాచార్యులు -33
వైట్ హెడ్
ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్ హెడ్ బ్రిటన్ కు చెందిన దార్శనికుడు 1861 లో ఫిబ్రవరి పది హీను జన్మించాడు ట్రినిటి కాలేజ్ లోయాభై ఏళ్ళకు ఫెలోషిప్ సాధించాడు లండన్ యూని వర్సిటి లో గణిత, యాంత్రిక శాస్త్రాలను బోధించాడు ఇంపీరియల్ కాలేజి ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో గణిత శాస్త్ర ఆచార్యుడు అయ్యాడు .1924 లో ఉద్యోగం విరమించే దాకా హార్వర్డ్ యూని వర్సిటి లో దర్శన శాస్త్ర ఆచార్యుడు గా ఉన్నాడు .గణితానికి ,దర్శన శాస్త్రానికి వైట్ హెడ్ చేసిన సేవ నిరుప మానం క్షేత్ర గణితం భౌతిక శాస్త్రం ,అతి భౌతిక శాస్త్రాలలో ఉన్న అడ్డంకులను తొలగించాడు .ఈయన ప్రభావం అనేక మంది ఆ చార్యులపై పడింది మహా ప్రతిభా సంపన్నుడ ని పించుకొన్నాడు .
![]()
ఒక శాస్త్రం లో విశేషజ్నత ఉన్న వాడు మరొక దాంట్లో నిష్ణాతుడు కావటం అసాధ్యం కాని వైట్ హెడ్ గణిత శాస్త్రాధ్యాపకుడై ఉండి కూడా దార్శనికుడు గా మారి అంత రింద్రియ జ్ఞానానికి తర్కానికి ,భౌతిక శాస్త్రానికి సమాన మైన ప్రాద్దాన్యం ఇచ్చి ఒక కొత్త దర్శన సిద్ధాంతాన్ని ప్రతి పాడించిన మహా మేధావి .అతని దర్శనం లో దృక్పద ఐక్యతా ,సమీక్షా వైశిద్యం అందరి ప్రశంసలు పొందాయి ..
వైట్ హెడ్ ప్రత్యేకత ఏమిటి అంటే పదార్ధాలను గ్రాహించి ప్రపంచాన్ని అవయవ సమూహం గా నిరూపించటం .ప్రకృతి దృశ్యాలన్నీ ఒక సర్వ సామాన్య ప్ర క్రియ చేత శాసింప బడుతాయని సిద్ధాంతీకరించాడు .ఇది సృజనాత్మక ప్రక్రియ .ఈయన దర్శనం లో మూడు భాగాలున్నాయి మొదటిది వాస్తవిక సంభవాలు (ఆక్త్యువాల్ అకేష న్స్ )రెండు నిత్య వస్తుజ్ఞానం (ఎటర్నల్ ఆబ్జేక్త్స్ )మూడవది దేవుడు .,ప్రపంచం
అతని దృక్పధం లో ప్రపంచం ప్రత్యెక వాస్తవ సత్యాల సమాహారం .ఇవి ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి .ప్రాతి వాస్తవికత మిగిలిన శక్తి కేంద్రాలతో సృజనాత్మకం గా ప్రక్రియ లో పాల్గొంటాయి వాస్తవ ప్రక్రియలను విక సింప జేసే ఈ ప్రక్రియనే ‘’కాన్శంస్ ‘’అన్నాడు ఈ ప్రత్యెక సంభవాలు అమూర్త వస్తువులు కావు .ఇందులో ప్రతిదీ నిజమైంది ,ప్రాత్యేక మైంది కూడా .వాస్తవిక సంభవాల ప్రత్యేకత దాని అంతర ఏకత చేత నియమింప బడుతుంది .
వైట్ హెడ్ భావాలలో నిత్య వస్తు భావం చాలా ప్రాధాన్యం పొందింది .వాస్తవిక సంభవాలు ఇంద్రియాలనే కాక బుద్ధిని కూడా తాకుతాయి ఇలాంటి అమూర్తాలనే నిత్య వస్తువు అన్నాడు అమూర్త వస్తువులు ఇంద్రియాలకు అతీతం గా ఉంటాయి నిత్య వస్తువులు అంతర్యామిత్వాన్ని కోరతాయి .నిత్య వస్తు ప్రపంచం కనీ పించే ప్రపంచం కంటే అతీతం గా ఉంటుంది .నిత్య వస్తువులు విశ్వం యొక్క మౌలిక అంశాలు అన్నాడు వైట్ హెడ్ .
అతని ‘’అవయవి ‘’దర్శనం లో ‘’నిరాపేక్ష అతీతత్వాం ,’’నిరపేక్ష అంతర్యామిత్వం ‘’మొదలైన భావాలు లేవు .ఆయన వాస్తవిక సంభావాలకు సాపేక్షతా సూత్రం ఎలా అన్వాయిస్తుందో ఈశ్వరునికి సంబంధించిన దానికీ అలానే వర్తిస్తుంది ఈశ్వరుడు ప్రపంచానికి వాస్తవిక సంభావాలకు అతీతుడు కాదు అన్నాడు దేవుడిని వదిలేసి నిత్య వస్తువులు ఇతర వాస్తవిక సంభావ వికాసానికిమార్గ దర్శనం చేస్తాయి .ఈశ్వరుడు నిత్య వస్తువుల సృష్టి కర్తకాదన్నాడు వైట్ హెడ్ .అయితే వాటి వ్యవస్థ యేర్పడ టానికి దేవుడే కారకుడు తన మౌలిక స్వభావ ప్రభావం చేత ఈశ్వరుడు నిత్య వస్తువులను దర్శిస్తాడు ఆయన గ్రహించి నట్లు ఏ వస్తువు గ్రహించ లేదు ఒక వాస్తవిక సంభవం ఇంకొక దాని చేత విషయీకరింప బడుతుంది .ఇతర వాస్తవ సంబంధాల లాగా ఈశ్వరుడు మూర్తార్ధలను కల్పించడు దృష్టిలో కాని ,ప్రతీకార గుణం లో కాని తీక్ష్ణత లో కాని ఈశ్వరుడి అనుభవం సర్వ సమగ్రం అన్నాడు వైట్ హెడ్1947 డిసెంబర్ ముప్ఫై న మరణించాడు ప్రాసెస్ ఆఫ్ ఫిలాసఫీ ,ప్రాసెస్ ఆఫ్ దియాలజిల సిద్ధాంత కర్త గా గొప్ప గుర్తింపు పొందాడు
సశేషం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -5-10-13 –ఉయ్యూరు

