మరుగున పడిన మతాలు –మతాచార్యులు -34
విజ్ఞాన భిక్షువు
సాంఖ్య శాస్త్ర భాష్యం రాసిన వారిలో విజ్ఞాన భిక్షువు సాటి లేని వాడని పించుకొన్నాడు పదహారవ శతాబ్దికి కి చెందిన ఈయన వారణాసి లో జన్మించాడు జీవించాడు . 1560-1600 కాలం వాడని భావిస్తారు .భిక్షు అనేది ఆయన బిరుదు అయితే ఇతను భిక్షువు కాదు సన్యాసి కాదు బౌద్ధమతావాలంబి కాదు సాంఖ్య సూత్రాలకు ‘’సాం ఖ్య ప్రవచనం‘’ను యోగ సూత్రాలకు అంటే వ్యాస మహర్షి రాసిన దానికి ‘’యోగ వావర్తికం ‘’,బ్రహ్మ సూత్రాలకు ‘’విజ్ఞానామ్రుతం ‘’అనే మూడు మహా భాష్యాలను రాసిన ఘనుడు విజ్ఞాన భిక్షువు .
ఈశ్వర గీతా భాష్యం ,సాంఖ్యసారం , యోగ సార సంగ్రహం సాంఖ్య సారం , మొదలైన ఇతర గ్రంధాలు కూడా రాశాడు దురదృష్ట వశాత్తు ఆయన రచనలను సంపుతీకరించటం కాని ఆంగ్లం లోకి అనువదించటం కాని జరగ లేదు ఈయనను పరోక్ష బౌద్ధుడు అనీ అంటారు
వేదాంతాన్ని సాంఖ్యం తో సమన్వయ పరచాడు .సాంఖ్యం లో చెప్పిన పరిణామ వాదం వేదాంతుల పాలిటి చింతామణి .అద్వైతాన్ని వ్యావహారికం గా ,మిగిలిన ద్వైత విశిస్తాస్టాద్వైత భేదా, భేద దర్శనాలను పార మార్ధికం గా పరిణామ వాదం స్వీకరించింది .భిక్షువు పరిణామ వాదాన్ని ఒప్పుకోవటమే కాక సాంఖ్యం లో ఉన్న ప్రకృతి పురుష ద్వైతాన్ని పురుష బహుత్వాన్ని వేదాంత సూత్రాలలో చేర్చాడు .
బ్రహ్మ మీమాంస లో జీవాత్మ యొక్క బహుత్వం కనీ పిస్తుంది కొన్ని శ్లోకాలలో .సాంఖ్యం లోని పురుష ఆత్మత్వం బ్రహ్మ మీమాంస లో ఇబ్బంది కలిగిస్తుంది .’’ఆత్మేతి తూప యంతి ‘’అనే సూత్రం లో పరమాత్మ కే పరమార్ధం లో ఆత్మత్వాన్ని చెప్పింది .అయినా సాంఖ్యం- వేదాంతం తో భేదించలేదు .కారణం వ్యాహరాకికాత్మ అయిన జీవుడికి ఇతర వివేక జ్ఞానాలు మోక్షానికి సాధనాలుగా చెప్పటమే ఇది రెండు దర్శనాలకు సమ్మత మైన విషయమే .కనుక శ్రుతి, స్మృతి లలో ప్రసిద్ధం గా చెప్ప బడిన నానాత్వ ఎకత్వాదులకు సాంఖ్యం లో వ్యావహారిక పరమార్ధ భేద దృష్టిలో సాంఖ్యానికి వేదాంతానికి మధ్య భేదం తొలగి పోయింది అందుకే సాంఖ్య సిద్దాంతాలవివరణ మే వేదాంతం లో కనీ పిస్తోంది
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-10-13 ఉయ్యూరు

