ఆస్తిక మహాశయులకు నమస్కారం.
ప్రతి సంవత్సరము తెలంగాణా ప్రాంతములో జరిగే మన శ్రీ జనార్దనానంద సరస్వతి వేద విద్వన్ మహా సభలు ఈ సంవత్సరము కరీంనగర్ జిల్లాలో గల మహా మహిమాన్వితమైన వేములవాడ క్షేత్రములో 24-10-2013 నుండి 27-10-2013 వరకు జరుగుచున్నాయి.
కావున ఆస్తిక మహాశయులందరూ ఈ 4 రోజుల సభలలో పాల్గొని ఆ వేదవేద్యుడైన రాజరాజేశ్వర స్వామి అనుగ్రహాన్ని, అలాగే వేదమాత అనుగ్రహాన్నికూడా పొందవలసినదిగా ప్రార్ధన.
దీనితో పాటు ఆహ్వాన పత్రికను జత చెయడమైనది.
తూములురు శాయినాథ శర్మ, శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి స్మృతి ట్రస్ట్
పసుమర్తి బ్రహ్మానంద శర్మ, శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి స్మృతి ట్రస్ట్
కుప్పా శ్రీ ఆంజనేయ శాస్త్రి, శ్రీ వేద వ్యాస పాఠశాల, బ్రాహ్మణ బస్తీ





