మా తాత రోజుకో కథ రాయించేవారు :కృష్ణశాస్త్రి

దేవులపల్లి కృష్ణశాస్త్రి అనగానే భావకవిగా సుపరిచితులైన ఒకనాటి కృష్ణశాస్త్రి గుర్తొస్తారు. ఆయన మనవడి పేరు కూడా అదే. తన రెండో నవల ‘జంప్ కట్’ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన కృష్ణశాస్త్రితో ‘నవ్య’ సంభాషించింది.

-మీది బంగారు బాల్యం అనుకుంటాను….
అక్షరాలా అంతే. మా తాతగారి కోసం ఎంతోమంది రచయితలు, కవులు, సినిమారంగంలోని వ్యక్తులు వచ్చిపోతూ ఉండేవారు. మా నాన్న బుజ్జాయి బొమ్మలేసేవారు. ఆయన కోసం వచ్చే స్నేహితులు, పరిచయస్తులు… అదంతా ఇంకో లోకం. వాళ్లందరి గురించి తెలుసుకోవడం, వారి సంభాషణలను వినడం, అలవాట్లను పరిశీలించడం – ఇవే పెద్ద చదువులాగా ఉండేది. అసలు స్కూలుకెళ్లి నేర్చుకునేదేముంది అనిపించేది. మా తాతగారు కూడా అలానే అనేవారు. అలాంటి ఉద్దేశంతోనే మా నాన్నను ఆయన బడికే పంపలేదు. నన్ను కూడా బడికి పంపొద్దనుకుంటే మా అమ్మ ఊరుకోలేదు. మా అమ్మ పేరు లక్ష్మి. ఆమె భోగరాజు పట్టాభిసీతారామయ్య గారి మునిమనవరాలు. మొత్తానికి మా ఇంట్లో వాతావరణం చాలా స్వేచ్ఛగా, ప్రజాస్వామికంగా ఉండేది. పెద్దాచిన్నా అంతరాలేమీ లేకుండా పిల్లలు ఏదైనా ప్రశ్నించగలిగేలా ఉండేది.

-తాతగారితో మీ అనుబంధం ఎలా ఉండేది?
భలే గొప్పగా ఉండేది.. ఉదాహరణకు ఆయన ఏదైనా మ్యూజిక్ డిస్కషన్‌కు వెళుతున్నారనుకోండి, ఇంట్లో చెప్పాపెట్టకుండా ఆయన కారెక్కేసి నేను కూడా వెళ్లిపోయేవాణ్ని. అది మా అమ్మకు తెలియకుండా ఆయనే మేనేజ్ చేసేవారు. అలాగే స్కూలుకెళ్లే సమయానికి ఎక్కడ దాక్కోవాలో తెలియక కంగారు పడుతుంటే మా తాతగారే ఏ మంచం కిందకో దూరిపొమ్మని చెప్పేవారు. మా అమ్మ వెతుక్కుంటూ వస్తే, ఆయన దానిమీదే కూర్చుని ‘వాడిక్కడ లేడు. ఎక్కడున్నాడో వెతకాలి…’ అని ఆమెను పంపించేసేవారు. ఎంత వయసు వచ్చినా ఆయన ఇరవయ్యేళ్ల యువకుడిలాగా ఉత్సాహంతో తుళ్లిపడుతూ ఉండేవారు.

-మీ అల్లరికి ఆయన సాయం వచ్చేవారన్నమాట..
అసలు మా తాతగారే చాలా అల్లరి మనిషి. నాకు ఊహ తెలిసేనాటికే మా తాతగారికి గొంతు పోయింది. దాంతో అన్నీ రాసి చూపెట్టేవారు. ఆయన అల్లరికి ఉదాహరణ చెబుతా చూడండి. ఒకసారి ‘మా సినిమాకు పాట రాయండి’ అంటూ ఎవరో వచ్చారు. మా తాత ‘వాడి మొహం నాకు నచ్చలేదు. నేను పాట రాయనని చెప్పు’ అని కాగిత ం మీద రాసి మాకు చూపెట్టారు. మేం ఆ మాట అవతలివాళ్లకు చెప్పలేం కదా? అందుకని, ‘తాతగారికి ఇవాళ వేరే పనులున్నాయట. మిమ్మల్ని రేపు రమ్మంటున్నారు’ అని అవస్థ పడుతూ చెప్పేవాళ్లం. అంతలోనే తాతగారు కాగితం తీసుకుని ‘అదేమిటి అలా చెబుతున్నావు? నాకు వాడి వె ధవ మొహం నచ్చలేదని చెప్పానుగా. అదే చెప్పు. వాడు ఎన్నిసార్లొచ్చినా నేను పాట రాయను…’ అని రాసేవారు. అది చదవగానే మాకు నవ్వొచ్చేసేది. దాన్ని దాచుకుని ‘అబ్బే ఏం లేదండి, రేపు కాదట, వచ్చే వారం రమ్మంటున్నారు…’ అని ఏదో సర్దిచెప్పి పంపించేవాళ్లం. మా తాతగారి అల్లరే నాకూ వచ్చింది. నాకిప్పుడు యాభై ఏళ్లు వస్తున్నా నాలోపల ఆరేళ్ల పసిపిల్లాడు అలాగే ఉన్నాడు. దాంతోనే అనుకుంటా, నేను పిల్లల బొమ్మల చిత్రకారుడిగా బాగా రాణించాను.

– మీ రచనా వ్యాసంగం ఎలా మొదలయింది?
వేసవి సెలవుల్లో మేం ఎండలో తిరక్కూడదని మా తాత మమ్మల్ని రోజుకో కథ రాయమనేవారు. అప్పటికే విన్నవైనా, లేదా కొత్తగా ఆలోచించినవైనా, మా మాటల్లో, మాకు నచ్చినట్టు రాయాలి. అలా ముప్ఫై రోజుల్లో ముఫ్పై రాసేవాళ్లం, నేను, నా ఇద్దరక్కచెల్లెళ్లు కూడా. బహుశా నా రచనకు బీజం అక్కడ పడిందనుకుంటాను.

– కానీ నవలారచయితగా చాలా ఆలస్యంగా వచ్చారు. ఎందుకలా?
నవలలు రాసి బతకడం కష్టం. రచన జీవనాధారం కాలేదు. జీవితంలో బాగా స్థిరపడ్డాక ఇంగ్లీష్‌లో నవలలు రాయడం మొదలెట్టాను. మరొకటి కూడా ఉంది. మా తాతగారి పేరే నాకు పెట్టారు. నాకు అది అదృష్టమేగాని ఆయన పాలిట అది దురదృష్టం కాకూడదు కదా. అందుకని నా మీద నాకు నమ్మకం వచ్చాక రాయడం మొదలెట్టాను.

– ఇంతకీ మీరు తెలుగు మాట్లాడటమేనా, లేక….
నాకు తెలుగు రాయడం చదవడం బాగా వచ్చా రాదా అన్నదే కదా మీ ప్రశ్న. నేను పుట్టిపెరిగింది మద్రాసులోనే అయినా, మా నాన్న నన్ను వెంకటసుబ్బారావు స్కూల్లో వేశారు. అప్పట్లో ఆ ఊళ్లో చాలా స్కూళ్లు తెలుగును రెండో భాషగా బోధించేవి. వాటిలో మా స్కూలుకు మంచి పేరుంది. దాంతో నాకు తెలుగు రాయడం, చదవడం చక్కగా వచ్చు. తెలుగంత బాగా తమిళం, ఇంగ్లిష్, హిందీ కూడా వచ్చు. నా నవలలను నేనే తెలుగులోకి తీసుకురావాలని అనుకుంటున్నాను.

-మీ కొత్త నవల ‘జంప్ కట్’ గురించి కొంచెం చెప్పండి…
ఈ నవల్లో కథానాయకుడు సత్యజిత్‌రే. అతని తండ్రి రామన్ సినిమా రచయిత. పెద్దాయన ఆరోగ్యం బాగాలేదంటే చూడటానికి అమెరికా నుంచి ఇండియా వస్తాడు. తర్వాత ఏం జరిగింది, తండ్రి జీవితం గురించి అతనికెన్ని కొత్త విషయాలు తెలిశాయి… అన్నదే కథాంశం. ఈ మాట అంటే చాలామందికి కోపం రావచ్చుగాని కథ మొదలుకొని ప్రచారానికి వేసే పోస్టర్ల వరకూ అన్నీ వేరే చోటి నుంచి ఎత్తేసినవే ఉంటాయి ఎక్కువసార్లు. నా నవలలో అలాంటి సంఘటనల గురించి, అన్నిచోట్లా జరుగుతున్న మేథోచౌర్యం గురించి రాశాను. మన సినిమాల్లో ఒరిజినల్ పనిచేసేవి రెండే విభాగాలనిపిస్తుంది. ఒకటి ట్రాన్స్‌పోర్ట్, రెండోది కేటరింగ్.

– చిన్నప్పట్నుంచీ సినిమా రంగం తెలుసు మీకు, దానిపట్ల మీకు ఆసక్తి లేదా?
నాకు సినిమా రంగం పట్ల చాలా ఆసక్తి ఉంది, అవగాహన ఉంది. అందువల్లే నేను ‘జంప్ కట్’ రాయగలిగాను. ఏదైనా సినిమాకు నేను స్వయంగా రాసి దర్శకత్వం వహించాలని ఆలోచన. త్వరలోనే ఈ ఆలోచన కార్యరూపం దాలుస్తుందని అనుకుంటున్నాను.

-మీరనుకున్నవన్నీ నెరవేరాలని ఆంధ్రజ్యోతి ఆకాంక్షిస్తోంది….
థేంక్యూ. ఈ పత్రికతో మా అనుబంధం ఏనాటిదో. మా నాన్న ఆంధ్రజ్యోతిలో తొమ్మిదేళ్ల పాటు ప్రతిరోజూ కార్టూన్ వేసేవారట. దాని పేరు ‘పెత్తందారు’. తెలుగు నేలతో ఈ బంధం కొనసాగాలని ఆకాంక్షిస్తాను.

కృష్ణశాస్త్రి తొలి నవల ‘ఐస్ బోయిస్ ఇన్ బెల్ బాటమ్స్’ దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. అది కొంత ఆత్మకథాత్మకంగా ఉంటుంది. ఆ పుస్తకం రెండో భాగం ‘రాలీ డేస్ అండ్ డిస్కో నైట్స్’ వచ్చే ఏడాది రాబోతోంది. మూడో భాగం కూడా రాయాలన్నది కృష్ణశాస్త్రి ఆలోచన.

అదితి

– See more at: http://www.andhrajyothy.com/node/9206#sthash.xuJWMyWn.dpuf

దేవులపల్లి కృష్ణశాస్త్రి అనగానే భావకవిగా సుపరిచితులైన ఒకనాటి కృష్ణశాస్త్రి గుర్తొస్తారు. ఆయన మనవడి పేరు కూడా అదే. తన రెండో నవల ‘జంప్ కట్’ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన కృష్ణశాస్త్రితో ‘నవ్య’ సంభాషించింది.

మీది బంగారు బాల్యం అనుకుంటాను….
అక్షరాలా అంతే. మా తాతగారి కోసం ఎంతోమంది రచయితలు, కవులు, సినిమారంగంలోని వ్యక్తులు వచ్చిపోతూ ఉండేవారు. మా నాన్న బుజ్జాయి బొమ్మలేసేవారు. ఆయన కోసం వచ్చే స్నేహితులు, పరిచయస్తులు… అదంతా ఇంకో లోకం. వాళ్లందరి గురించి తెలుసుకోవడం, వారి సంభాషణలను వినడం, అలవాట్లను పరిశీలించడం ఇవే పెద్ద చదువులాగా ఉండేది. అసలు స్కూలుకెళ్లి నేర్చుకునేదేముంది అనిపించేది. మా తాతగారు కూడా అలానే అనేవారు. అలాంటి ఉద్దేశంతోనే మా నాన్నను ఆయన బడికే పంపలేదు. నన్ను కూడా బడికి పంపొద్దనుకుంటే మా అమ్మ ఊరుకోలేదు. మా అమ్మ పేరు లక్ష్మి. ఆమె భోగరాజు పట్టాభిసీతారామయ్య గారి మునిమనవరాలు. మొత్తానికి మా ఇంట్లో వాతావరణం చాలా స్వేచ్ఛగా, ప్రజాస్వామికంగా ఉండేది. పెద్దాచిన్నా అంతరాలేమీ లేకుండా పిల్లలు ఏదైనా ప్రశ్నించగలిగేలా ఉండేది.

తాతగారితో మీ అనుబంధం ఎలా ఉండేది?
భలే గొప్పగా ఉండేది.. ఉదాహరణకు ఆయన ఏదైనా మ్యూజిక్ డిస్కషన్‌కు వెళుతున్నారనుకోండి, ఇంట్లో చెప్పాపెట్టకుండా ఆయన కారెక్కేసి నేను కూడా వెళ్లిపోయేవాణ్ని. అది మా అమ్మకు తెలియకుండా ఆయనే మేనేజ్ చేసేవారు. అలాగే స్కూలుకెళ్లే సమయానికి ఎక్కడ దాక్కోవాలో తెలియక కంగారు పడుతుంటే మా తాతగారే ఏ మంచం కిందకో దూరిపొమ్మని చెప్పేవారు. మా అమ్మ వెతుక్కుంటూ వస్తే, ఆయన దానిమీదే కూర్చుని ‘వాడిక్కడ లేడు. ఎక్కడున్నాడో వెతకాలి…’ అని ఆమెను పంపించేసేవారు. ఎంత వయసు వచ్చినా ఆయన ఇరవయ్యేళ్ల యువకుడిలాగా ఉత్సాహంతో తుళ్లిపడుతూ ఉండేవారు.

మీ అల్లరికి ఆయన సాయం వచ్చేవారన్నమాట..
అసలు మా తాతగారే చాలా అల్లరి మనిషి. నాకు ఊహ తెలిసేనాటికే మా తాతగారికి గొంతు పోయింది. దాంతో అన్నీ రాసి చూపెట్టేవారు. ఆయన అల్లరికి ఉదాహరణ చెబుతా చూడండి. ఒకసారి ‘మా సినిమాకు పాట రాయండి’ అంటూ ఎవరో వచ్చారు. మా తాత ‘వాడి మొహం నాకు నచ్చలేదు. నేను పాట రాయనని చెప్పు’ అని కాగిత ం మీద రాసి మాకు చూపెట్టారు. మేం ఆ మాట అవతలివాళ్లకు చెప్పలేం కదా? అందుకని, ‘తాతగారికి ఇవాళ వేరే పనులున్నాయట. మిమ్మల్ని రేపు రమ్మంటున్నారు’ అని అవస్థ పడుతూ చెప్పేవాళ్లం. అంతలోనే తాతగారు కాగితం తీసుకుని ‘అదేమిటి అలా చెబుతున్నావు? నాకు వాడి వె ధవ మొహం నచ్చలేదని చెప్పానుగా. అదే చెప్పు. వాడు ఎన్నిసార్లొచ్చినా నేను పాట రాయను…’ అని రాసేవారు. అది చదవగానే మాకు నవ్వొచ్చేసేది. దాన్ని దాచుకుని ‘అబ్బే ఏం లేదండి, రేపు కాదట, వచ్చే వారం రమ్మంటున్నారు…’ అని ఏదో సర్దిచెప్పి పంపించేవాళ్లం. మా తాతగారి అల్లరే నాకూ వచ్చింది. నాకిప్పుడు యాభై ఏళ్లు వస్తున్నా నాలోపల ఆరేళ్ల పసిపిల్లాడు అలాగే ఉన్నాడు. దాంతోనే అనుకుంటా, నేను పిల్లల బొమ్మల చిత్రకారుడిగా బాగా రాణించాను.

మీ రచనా వ్యాసంగం ఎలా మొదలయింది?
వేసవి సెలవుల్లో మేం ఎండలో తిరక్కూడదని మా తాత మమ్మల్ని రోజుకో కథ రాయమనేవారు. అప్పటికే విన్నవైనా, లేదా కొత్తగా ఆలోచించినవైనా, మా మాటల్లో, మాకు నచ్చినట్టు రాయాలి. అలా ముప్ఫై రోజుల్లో ముఫ్పై రాసేవాళ్లం, నేను, నా ఇద్దరక్కచెల్లెళ్లు కూడా. బహుశా నా రచనకు బీజం అక్కడ పడిందనుకుంటాను.

కానీ నవలారచయితగా చాలా ఆలస్యంగా వచ్చారు. ఎందుకలా?
నవలలు రాసి బతకడం కష్టం. రచన జీవనాధారం కాలేదు. జీవితంలో బాగా స్థిరపడ్డాక ఇంగ్లీష్‌లో నవలలు రాయడం మొదలెట్టాను. మరొకటి కూడా ఉంది. మా తాతగారి పేరే నాకు పెట్టారు. నాకు అది అదృష్టమేగాని ఆయన పాలిట అది దురదృష్టం కాకూడదు కదా. అందుకని నా మీద నాకు నమ్మకం వచ్చాక రాయడం మొదలెట్టాను.

ఇంతకీ మీరు తెలుగు మాట్లాడటమేనా, లేక….
నాకు తెలుగు రాయడం చదవడం బాగా వచ్చా రాదా అన్నదే కదా మీ ప్రశ్న. నేను పుట్టిపెరిగింది మద్రాసులోనే అయినా, మా నాన్న నన్ను వెంకటసుబ్బారావు స్కూల్లో వేశారు. అప్పట్లో ఆ ఊళ్లో చాలా స్కూళ్లు తెలుగును రెండో భాషగా బోధించేవి. వాటిలో మా స్కూలుకు మంచి పేరుంది. దాంతో నాకు తెలుగు రాయడం, చదవడం చక్కగా వచ్చు. తెలుగంత బాగా తమిళం, ఇంగ్లిష్, హిందీ కూడా వచ్చు. నా నవలలను నేనే తెలుగులోకి తీసుకురావాలని అనుకుంటున్నాను.

మీ కొత్త నవల ‘జంప్ కట్’ గురించి కొంచెం చెప్పండి…
ఈ నవల్లో కథానాయకుడు సత్యజిత్‌రే. అతని తండ్రి రామన్ సినిమా రచయిత. పెద్దాయన ఆరోగ్యం బాగాలేదంటే చూడటానికి అమెరికా నుంచి ఇండియా వస్తాడు. తర్వాత ఏం జరిగింది, తండ్రి జీవితం గురించి అతనికెన్ని కొత్త విషయాలు తెలిశాయి… అన్నదే కథాంశం. ఈ మాట అంటే చాలామందికి కోపం రావచ్చుగాని కథ మొదలుకొని ప్రచారానికి వేసే పోస్టర్ల వరకూ అన్నీ వేరే చోటి నుంచి ఎత్తేసినవే ఉంటాయి ఎక్కువసార్లు. నా నవలలో అలాంటి సంఘటనల గురించి, అన్నిచోట్లా జరుగుతున్న మేథోచౌర్యం గురించి రాశాను. మన సినిమాల్లో ఒరిజినల్ పనిచేసేవి రెండే విభాగాలనిపిస్తుంది. ఒకటి ట్రాన్స్‌పోర్ట్, రెండోది కేటరింగ్.

చిన్నప్పట్నుంచీ సినిమా రంగం తెలుసు మీకు, దానిపట్ల మీకు ఆసక్తి లేదా?
నాకు సినిమా రంగం పట్ల చాలా ఆసక్తి ఉంది, అవగాహన ఉంది. అందువల్లే నేను ‘జంప్ కట్’ రాయగలిగాను. ఏదైనా సినిమాకు నేను స్వయంగా రాసి దర్శకత్వం వహించాలని ఆలోచన. త్వరలోనే ఈ ఆలోచన కార్యరూపం దాలుస్తుందని అనుకుంటున్నాను.

మీరనుకున్నవన్నీ నెరవేరాలని ఆంధ్రజ్యోతి ఆకాంక్షిస్తోంది….
థేంక్యూ. ఈ పత్రికతో మా అనుబంధం ఏనాటిదో. మా నాన్న ఆంధ్రజ్యోతిలో తొమ్మిదేళ్ల పాటు ప్రతిరోజూ కార్టూన్ వేసేవారట. దాని పేరు ‘పెత్తందారు’. తెలుగు నేలతో ఈ బంధం కొనసాగాలని ఆకాంక్షిస్తాను.

కృష్ణశాస్త్రి తొలి నవల ‘ఐస్ బోయిస్ ఇన్ బెల్ బాటమ్స్’ దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. అది కొంత ఆత్మకథాత్మకంగా ఉంటుంది. ఆ పుస్తకం రెండో భాగం ‘రాలీ డేస్ అండ్ డిస్కో నైట్స్’ వచ్చే ఏడాది రాబోతోంది. మూడో భాగం కూడా రాయాలన్నది కృష్ణశాస్త్రి ఆలోచన.

అదితి

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.