శ్రీ దేవి భండాసుర వధ లో అంత రార్ధం -8(చివరి భాగం )
‘’కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ భండాసుర శూన్యకా –బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుభ వైభవా ‘’
ఈ సంసారం నిస్సారం అని అర్ధం అవటానికి కామేశ్వరుని కృప కావాలి .శూన్యం సంపూర్ణం గా కనీ పిస్తుంది అప్పుడే .కామ దేవుడు మన్మధుడిని క్షణం లో భస్మం చేసిన అస్త్రం కామేశ్వరుడి దగ్గరే ఉంది ఆ అస్త్రమే భండాసురుడిని ,వాడి శూన్యక నగరాన్నీ భస్మీ పటలం చేసింది మనసులో ఏ కోరికా లేనప్పుడు ప్రా పంచిక సుఖాల శూన్యత్వం దానంతటికి అది బయట పడుతుంది .మాయ ,మొహం మమత ,అనే అందమైన వల క్షణం లో ముక్కలై పోతుంది .
కామేశ్వరుడైన మాహా శివుడి ఈ విజయం తో ఏంతో సంతోషించిన బ్రహ్మ ,విష్ణు మహేన్ద్రులు ఆయననను ప్రస్తుతించారు .ఆత్మ వైభవ మహత్తు ను తెలుసుకొని దేవతలంతా పరమేశ్వరీ పరమేశ్వరులను పరమ పురుష ,పరా ప్రక్రుతులను ముక్త కంఠం తో ప్రస్తుతి చేశారు .త్రుటిలో భస్మమైన కామ దేవుడిని కరుణామయి అయిన అమ్మ సహించలేక కరుణ తో అతని భార్య రతీ దేవి విలాపాన్ని విని సహించలేక పోయింది .స్త్రీ ,పురుషులను మానవతను మమత ,అనురాగాల తో బంధించే మంగళ కరమైన కామాన్ని లోకానికి అవసరం అని భావించింది అంతే క్షణం లో దయతో అమ్మ మన్మధుడిని పునర్జీవితుడిని చేసింది ఆమె ధర్మ సంవర్ధిని .కనుక కఠిన హృదయం తో కామేశు డు చేసిన కామ దహనాన్ని ,పొరబాటును సరి దిద్దింది .ధార్మిక భూమి మీద విశుద్ధమైన మమత ,ప్రేమ అనురాగాలు వర్ధిల్లాలని కామేశ్వరి సంకల్పం అందుకే మన్మధుడికి బతుకు నిచ్చింది
నిజానికి కాముడు కూడా అమ్మ సృష్టి లోని వాడే కదా .అందుకే స్రష్ట కు సృష్టి మీద సహజం గా అనురాగం ఉంటుంది ఆ అనురాగమే ఇక్కడ కాముని జీవితానికి సహాయ పడింది తండ్రి -కొడుకు పై కోపం ప్రకటిస్తే తల్లి సర్ది చెప్పటం లోకం లో మనం చూస్తూనే ఉన్నాం .’’అశరీర రూపం ‘’లోకాముడిని కామేశ్వరి సృష్టించి అతని చాయను అందరి హృదయాలలో ప్రతిష్టించింది ఇది కామునికే కాదు సకల చరాచర ప్రాణి కోటి కీ అవసరమైన ధార్మిక భావం సహజం గా ‘’తీయని ఆకలితో’’ కామ వాసన అందరిలో మేల్కొనే ఉంటుంది .దాన్ని పరమేశ్వరి ప్రసాదం గా భావించి ధర్మ సమ్మితం గా సేవిస్తే అది దేవి ఆరాధనే అవుతుంది .ఈ విషయాన్నే తరువాతి శ్లోక పాదం తెలియ జేస్తోంది
‘’హర నేత్రాగ్ని సందగ్ధ కామసంజీవ నౌషధిహ్ ‘’
పరమేశ్వరి నామాలలో ప్రతిదీ ప్రాణ శక్తితో ఉంటుంది కామ దేవుడిని బూడిద రాసి చేసిన కామేశ్వరుడిని ‘’హర ‘’శబ్దం చక్కగా వ్యక్తం చేసింది .అంతటినీ హరించే వాడు హరుడు ప్రజాపతి చేసిన సృష్టిలో ఆహితమైంది ,అనవసర మైంది ,అశోభన మైంది అంతా నశింప జేయటమే శంకరుని పని .అందుకే హర శబ్దం వాడారు .హరుని మూడవ కన్ను మంట కాముడిని కాల్చింది .ఈ మూడో కన్ను మనందరి లోను ఉంటుందని గ్రహించాలి .లలాటం లో ఉన్న ఈ మూడో కన్ను లోపలి చూపును కలిగి ఆనందాన్ని పొందుతుంది .ఈ కన్ను తెరుచుకొంటే అంధకారం అంతా పటా పంచలై వెలుగు పరచుకొంటుంది .అజ్ఞానం స్తానాన్ని జ్ఞానం ఆక్రమిస్తుంది .ఆత్మ తత్త్వం బోధ పడుతుంది .అప్పుడు జ్ఞాని జీన్ముముక్తుడౌతాడు .ఈ జీవన్ముక్త దశ వైపు ఈ నామం సూచిస్తుందని భావం .పరమేశ్వరుడు ముక్తి దాత .పరమేశ్వరి ఈ ముక్తి ప్రయోజనాన్ని సమస్త ప్రపంచానికి అందిస్తుంది .’’వినాశం లోనే వికాస బీజం ఉంది ‘’అని గ్రహించాలి .కామ వాసన కామిని వినాశనం వైపు లాక్కేడుతుంది .అమ్మ వాడిని కామేశుని వికాసం వైపుకు తీసుకొని వెడుతుంది ఇదే పరమేశ్వరి నామం లో ఉన్న రహస్యార్ధం అని మహా వ్యాఖ్యాన కర్త స్వర్గీయ ఇల పావులూరి పాండురంగా రావు గారు వ్యాఖ్యానించి చెప్పిన దానినే మీకు అంద జేశాను .అందరికి ఆ పరమేశ్వరీ కటాక్షం లభించాలని ఈ దసరా సందర్భం గా కోరుతున్నాను
సంపూర్ణం
వీలు వెంట శ్రీ లలితా సహస్ర నామాలలో ‘’శ్రీదేవి దివ్య శరీర త్రికూట రహస్యం ‘’అంద జేస్తాను
శ్రీ దుర్గాష్టమి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-10-13-ఉయ్యూరు

