మరుగున పడిన మతాలు –మతాచార్యులు -36
వల్లభా చార్యులు
పరబ్రహ్మ సర్వ ధర్మా శ్రయ మని వల్లభా చార్యుల మతం .పరబ్రహ్మ తనను తాను ఈ జగత్తు గా చేసుకొంటాడు .ఎవడి నుండి సర్వ భూతాలూ పుట్టు తున్నాయో అలాంటి బ్రహ్మానికే కర్తృత్వం ఉంది .ఇది ఆయన కు స్వభావమే కాని శంకరుడు చెప్పినట్లు మాయ తో కూడినది కాదు .బ్రహ్మ కర్త అయితే జీవులలో తార తమ్యాలేందుకు ఏర్పడ్డాయి అన్న దానికి వల్లభా చార్యులు ఆయనలో పక్షపాతం .లయ విషయం లో నిర్దయా ఉన్నాయని చెప్పాడు ఇది పరబ్రహ్మ దోషం కాదు అనటానికి మూడు సమాధానాలు చెప్పాడు .జీవుల కర్మల ఫలాన్ని బ్రహ్మం సఫలం చేశాడు కనుక వైషమ్యదోషం ఆయనకు అంటదు .తన సర్వ సమ ఈ విషమ సృష్టి అవసరం కనుక సామర్ధ్యాన్ని ప్రదర్శించాటానికే సర్వ సృష్టి ని బయటికి తెచ్చాడు కనుక విషమ దోషం అంటదు .లీలకు అవకాశం లేదు కనుక విషమ ద్రుష్టి లోపం అంటుకోదు అంటాడు వల్లభుడు ఈయన1474 .లోచంపా రణ్యం లో జన్మించి 1531లో మరణించాడు విష్ణు స్వామి మతం లో ”ఆచార్య ”పదవి పొందాడు . ఆ సంప్రదాయానికి చివరి వాడైన బిల్వ మంగళ ఆచార్యుడుఈయన గురువు
విజయ నగర సామ్రాజ్య చక్ర వర్తి శ్రీ కృష్ణ దేవా రాయల ఆస్థానం లో వల్లభా చార్యులు వాదం లో శంకారా ద్వైతాన్ని ఓడించాడు పుష్టి వాడ భక్తీ కి ప్రధమ ఆచార్యుడు వల్లభుడు విష్ణు స్వామి మతం లో రుద్రసంప్రదాయానికి చెందినా వాడు వల్లభుడు బ్రహ్మ సూత్రాలకు అనుభాశ్యం రాశాడు పదహారు స్తోత్రాలను రాశాడు మహా జ్ఞాని మహా బహాక్త శేఖరుడు మహా వేదాంతి అని పించుకొన్నాడు తన పుష్టి వాడ మత ప్రచారానికి అనేక పాఠ శాలలను ఏర్పాటు చేశాడు. రామానుజ మాధవ నిమ్బార్కారుల వేదాంతాన్ని తన వేదాంతం లో చొప్పించాడు వల్లభా చార్యులు
![]()
నేను అనేకం గా అవుతాను అనే శ్రుతి వాక్యం పరబ్రహ్మ తన ఇచ్చ ప్రకారం పూర్ణ మైన ఆనందాన్ని మరుగు పరచి జీవ స్వరూపాన్ని గ్రహిస్తాడు . ఈవిషయం లో అవిద్య లేక మాయ సంబంధం లేదు .అగ్ని నుండి విస్ఫులింగాలు వచ్చి నట్లు జీవులు పరమాత్మ నుండే ఉద్భ విస్తాయి .కనుక జీవ నానాత్వాన్ని అంగీకరించాడు వల్లభా చార్యులు .ఉత్పత్తి, వినాశం లేక పోవటం వల్ల జీవుడు నిత్యుడే .ఇతడు జ్ఞాత .మాత్రమె .జ్ఞానం అతని ధర్మం .జ్ఞాన రూప మైన ధర్మానికి ,జ్ఞాత్రు రూప మాయిన ధర్మికి కాంతికి సూర్యుడికి ఉన్న సంబంధం లాంటిదే .జీవుడికి పైకి వెళ్ళటం మోక్ష కారక మైన గతి .జీవుడు అణుస్వరూపుడు .తన సహజ జ్ఞానం చే చైతన్య రూపం గా వ్యాపిస్తాడు .
స్మ్రుతి ప్రమాణం చేత జీవుడు పరబ్రహ్మ అంశమే.బ్రహ్మ అంశి.బ్రహ్మకు పామ్శుత్వం ,నిరంకుశత్వం ఉందని స్మ్రుతి ఒప్పుకొంది .కనీ పించే సృష్టి అంతా సృష్టికి పూర్వమే ఉంది కనీ పించేదంతా సత్యమే అని శ్రుతి వాక్యం కనుక జగత్తు సత్యమే .మట్టి, కుండలో భాగమై నట్లు జగత్తు కూడా బ్రాహ్మ లో భాగమే .వల్లభ మతం లో జగత్తు ,సంసారం ఒకటి కాదు .ఇది ఇంకే మతం లోను కనీ పించని విషయం .అజ్ఞానం టో పుట్టిన సంసారం జ్ఞానం వల్ల నశిస్తుంది జగత్తు సద్రూపం. దానికి నాశనం లేదు .ఈ మతం లో మోక్షానికి జ్ఞానం కంటే భక్తికే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. జ్ఞాన సహజ భక్తీ మహా సాధనం .భక్తిలో మర్యాదా ,పుష్టి అని రెండు రకాలు .మొదటిది పరమేశ్వరుని చరణార విన్దాలపై భక్తీ, రెండోది భగ వంతుని ముఖార విందము పై భక్తీ .మర్యాదా భక్తీ వేద సిద్ధం .పుష్టి భక్తీ వేద నిరపేక్షం .స్వతంత్రం .మర్యాద భక్తికి కి సాయుజ్యమే ఫలం .పుష్టి భక్తికి ఫలం అభేద బావన .మర్యాదా భక్తిలో ఫలా పేక్ష ఉంటె ,పుష్టి భక్తిలో ఫలా పేక్ష లేదు .మర్యాదా భక్తికి అంబరీషుడు పుష్టి భక్తీ కి వ్రేపల్లె గోపికా స్త్రీలు ఉదాహరణ .ఇందులో శ్రీ కృష్ణ లీలా రసానుభావాన్ని వ్రజ భామలు పుష్కలం గా అనుభ వించారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-10-13- ఉయ్యూరు

