మరుగున పడిన మతాలు –మతాచార్యులు -35

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -35

లీబ్నిట్జ్

లీ బ్నిత్జ్త్జ్ పూర్తీ పేరు గాట్ ఫ్రీడ్ విల్ హెల్మ్ లీబ్నిట్జ్ .లైస్శిగ్  నగరం లో 1648 లో జన్మించాడు .అక్కడి యూని వర్సిటి లో నీతి శాస్త్రాన్ని బోధించాడు తండ్రి చిన్నతనం లోనే మరణించాడు  కష్టపడి స్వయం కృషి తో తర్క గణిత శాస్త్రాలలో అపార పాండిత్యాన్ని సాధించాడు .పదార్ధ విజ్ఞానం పై మోజు ఎక్కువ .విద్యార్ధి దశ లోనే అమోఘ పాండిత్యాన్ని పొందటం వల్ల  ఆచార్య పదవి లభించింది .తన కున్న విజ్ఞానం ఒక్క విద్యకే పరి మితం కాకూడదని భావించాడు .రాజు దగ్గర ఉద్యోగం లో చేరి ఈజిప్ట్ పై జైత్ర యాత్ర చేయటానికి పద్నాలుగవ లూయీ ని ప్రేరేపించాడు .కాని అతడు స్తబ్దుగా ఉండి  పోవటం వాళ్ళ నెపోలియన్ దీన్ని గమనించి లాభం పొందాడు .

దేశమంతా పర్య టించిన లీబ్నిట్జ్ ఆర్నాల్డ్ ,హైగేన్స్ మొదలైన ప్రముఖులను సందర్శించాడు .స్పినోజా ఇతని స్నేహాన్ని కాదను కొన్నాడు దీనితో కొంత కుంగి పోయాడు .మైన్త్స్ రాజు చని పోయిన తర్వాతా బ్రన్స్ విక్ రాజు గ్రంధాలయ పర్య వేక్షక ఉద్యోగాన్ని ఇచ్చాడు .ఇక్కడ బ్రన్స్ విక్ వంశ చరిత్ర రాశాడు .చివరి రోజుల్లో రాజు దయ లేక పోవటం వల్ల కాలం గడవటం కష్టమైంది .హారోవార్ రాజు జార్జి రాజ్య నిర్వాహక సభను జర్మనీ నుంచి ఇంగ్లాండ్ కు మార్చేశాడు .రాజు లీబ్నిట్జ్ ను తనతో తీసుకు వెళ్ళ లేదు .అల్ప బుద్ధి అని ,నాస్తికుడని అపకీర్తి పొందాడు .లీబ్నిజ్ 1716 లో మరణించాడు  మరణించిన తర్వాత అతని అంత్య క్రియలు కూడా ఒక నీచుడికి చేసి నట్లు చేశారు .మరణానంతరం ప్రజలు బుద్ధి తెచ్చుకొని అర్ధం చేసుకొన్నారు .

వివిధ దర్శనాలను ఏకం చేయటానికి కృషి చేశాడు .ప్రోటే స్తంట్లు కేధలిక్కుల మధ్య సామరస్యం సాధించటానికి ప్రయత్నించాడు .చైనా సంస్కృతిని మెచ్చు కొన్నాడు .ఉనేస్కో లో ఆదర్శ దార్శనికుడు గా లీబ్నిజ్ ఉండ తగిన వాడు అని ఫిలిప్ వైనర్ భావిన్చాడంటే ఇతని గొప్ప తనం ఎలాంటిదో తెలుస్తోంది .వాదాలతో అనవసర కాల క్షేపం చెయ్యకుండా విజ్ఞాన సమర్పణకుసర్వ సామాన్య భాష ను ఒక దాన్ని సృస్టించ టానికి లీబ్నిట్జ్ కలల కన్నాడు .

గణితం లోన్యూటన్ కనుక్కొన్న ‘’కాల్క్యులస్ ‘’గణితాన్ని ఆవిష్కరించటం లో లీబ్నిట్జ్ కూ గణ నీయ పాత్ర ఉంది .ఎవరు ముందు అని వాదం పెరిగింది .లీబ్నిట్జ్  కనీ పెట్టిన సాం కేతిక పరి భాష న్యూటన్ పరి భాష కంటే గొప్పది .

లీబ్నిట్జ్ దార్శనిక పధ్ధతి లో ద్రవ్య భావం అనేది ఉంది .అధికారం .పధ్ధతి .గూఢ పధ్ధతి లో తార్కిక సత్యాన్ని భూతార్ధ  సత్యం ఉన్నాయి డేకార్డ్ లాగా ఆధునిక విజ్ఞానాన్ని జోడించాడు .ఒక భౌతిక ద్రవ్యం ఆధారం గా ఏకత్వసూత్రం కనుక్కోవటానికి లీబ్నిట్జ్ ప్రయత్నించాడు .’’అరిస్టాటిల్ కౌగిలి నుంచి నేను విడి పోయి డేమక్రటిస్  చెప్పిన పరమాణువాదాన్ని ,శూన్య వాదాన్నిపరమాణువులను అంగీకరించాను .ఇది నా ఊహకు దగ్గర గా ఉంది .గణిత శాస్త్రముకు   కు భిన్నంగా ఉన్నాయి .అతి భౌతిక శాస్త్రీయ బిందువుకే సత్యత్వ ,వాస్తవికత్వాలు ఉన్నాయి .ఈ జీవ అణువు (మొనాడ్)ఒక శక్తి ఎకాన్కమే .ఇది ఆత్మ వంటిది ‘’అంటాడు లీబ్నిట్జ్ .డేకార్డ్. గతి శాస్త్రాన్ని ఇతను ఒప్పుకోలేదు ‘’క్వాం టిటి ఆఫ్ మోషన్ ‘’ నిత్యం అంటాడు డేకార్డ్ దీనికి వ్యతి రేకం గా నియత దశలో జరిగే గతి యొక్క  క్వాం టిటి నిత్యం అన్నాడు లీబ్నిట్జ్. దీనికే శక్తి నిత్యత్వ సూత్రం అని  పేరు . ద్రవ్య కణాన్ని ఒకే స్తానం లో ఉంచటాని కైనా బలం కావాలి .స్తితి శక్తి ఉన్న వస్తువు కైనా చైతన్యం గా ఉంటుంది అన్నాడు .ప్రతి జీవ అణువుకు అంత రంగిక స్వభావం ఉంది. జీవ అణువుల నానాత్వం అంగీ కారమే

జీవ అణువులు కేవల జీవ అణువులు ,ఆత్మా స్పిరిట్స్ అని మూడు రకాలు జీవాణువులు పరస్పర ప్రతిక్రియా రహితలుగా ఉంటాయి శ్రేణుల యొక్క అనా వస్యకత (కంటిన్ జెంట్)పర్యాప్త కారణం అయిన ఈశ్వరుడే .ఇదే లీబ్నిట్జ్ ప ర్యాప్త హేతు సూత్రం . లీబ్నిట్జ్ పద్ధతిలో అవి భక్త తాదాత్మ్య సూత్రం(identity of indiscernibles) ,సంపూర్ణతా(plentitude  ) సూత్రంఉన్నాయి .  ఉండవలసి నంత అస్తిత్వం ఉంది అని సంపూర్ణతా సిద్ధాంతం చెబుతుంది కనీ పించే ప్రపంచం సుస్తాపిత దృశ్యం (bene funda te ))సర్వ జీవాణువుల సహా అస్తిత్వమే (కో ఎక్సి స్తేన్స్ )ఆకాశం అన్నాడు .ఇది సర్వ సామాన్య ఆవ కాశం .దీనికి భిన్నం గా వ్యక్తీ అవకాశం ప్రతి బిమ్బించే జీవాణువు యొక్క పరి పూర్ణత అని ప్రతి పాదించాడు .ఈ రెండు భౌతిక శాస్త్రానికి బాగా ఉప యోగ పడ్డాయి .

సద్రుస్యం లేని ధర్ముల క్రమ వ్యవస్థ నే కాలం అన్నాడు లీబ్నిట్జ్ .ఇవి ఒక దాని తర్వాత ఒకటి ఉంటాయి ఇతని కాల నిర్వచనం అర్ధం అవటం కష్టం .జీవాణువు పరిణామ ధర్మాన్ని అంగీకరించిన కాలం యొక్క  యదార్ధాన్ని లీబ్నిట్జ్ నిరాకరించాడు జీవాణువుల ‘’గవాక్ష రాహిత్యం ‘’ఒక పెద్ద అడ్డంకి.ఇది జ్ఞాన మీమాంసలో చాలా చిక్కులు తెచ్చింది తనకు ముందున్న పూర్వ సిద్ధాంతాలను సమన్వయ పరచటానికే కృషి చేశాయే ఈశ్వరీయ జ్ఞానం అంటాడు .ఇదేవ్యక్తీ   సహాయ జ్ఞానం .కేవలం జీవాణువులను నిరూపించే జ్ఞానం నిక్రుస్టమైనది .ఈ రెంటికి మధ్య ప్రకృష్ట ప్రభావం ఉన్న జీవాణువు లను ప్రదర్శించే మహనీయ మానవులున్నారు అన్నాడు .

లీబ్నిట్జ్ సిద్ధాంతాలన్నీ సంసర్గాలు అసత్యాలు ,ప్రతి పాదనా ఉద్దేశ విదేయం రూపం లో ఉంటాయి .’’జీవాణునవులు అనేకం ‘’అనే వాక్యం మాత్రం సంప్రస్నా త్మకమూ కాదు ఉద్దేస్య విదేయమూ కాదు .ఈ  ప్రపంచ విసహాయం  లో లీబ్నిట్జ్ వైవిధ్యం .సాంప్రదాయ దార్శనిక వర్గానికి ఆధునిక తార్కిక భాషా శాస్త్ర వాదానికి మధ్య గొప్ప సమన్వయము సాధించిన వాడు లీబ్నిట్జ్ .సత్యం కేవలం నామాలు మూలాధారం కలది కాదు అనే లీబ్నిట్జ్ ఉక్తిని తార్కిక భాషా వాదం లో గొప్ప స్తానం పొందింది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా  ప్రసాద్ –  15-10-13 ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.