సాహితీ బంధువులకు శుభ కామనలు -మూడు ముఖ్యమైన శుభ వార్తలను మీకు అంద జేస్తున్నాను
మొదటి శుభవార్త -సరస భారతి ఈ క్షణానికి లక్షా డబ్భై అయిదువేల మంది వీక్షకులను అక్షరాలా 1,75 049 (సరస భారతి 1,42,657 +శ్రీ ఆంజనేయ స్వామీ బ్లాగ్-32,392 ) ఆకర్షించిందని తెలియ జేయటానికి మహానందం గా ఉంది .
రెండవ శుభవార్త -సరస భారతి ఈ నెల ఇరవై రెండవ తేదీకి నాలుగేళ్ళు దాటి అయిదవ ఏడు లో ప్రవేశిస్తోందనితెలియ జేయటానికి ఆనందం గా ఉంది
మూడవ శుభ వార్త -ఈ ఏడు పదవ సంవత్సరం చదువుతున్న పేద ప్రతిభా వంతు లైన ఆరుగురు విద్యార్ధులకు ”నిరతాన్న దాత ,అపర అన్న పూర్ణ శ్రీ మతి డొక్కా సీతమ్మ గారి జ్ఞాపకార్ధం వారి ముని మనవడి కుమారుడు అంటే ఇని మనవడు శ్రీ డొక్కా రామ భద్ర (అమెరికా ) గారు ఏర్పాటు చేసిన స్కాలర్ షిప్ లను అందించటానికి సరసభారతికి rs10 000 అక్షరాల పది వేల రూపాయలను పంపించారు . ఈ మొత్తాన్ని ఆ ఆరుగురు విద్యార్ధులకు సమానం గా పంచి ఈ నెల ఇరవై రెండవ తేది మంగళ వారం సాయంత్రం6-30 గం లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సరస భారతి 52 వ సమావేశంలో అందజేస్తున్నామని తెలియ జేయటానికి సంతోషం గా ఉంది
అంతే కాదు,ఈ కార్య క్రమంలో పాల్గొన టానికిహైదరా బాద్ లో ఉన్న తమ తలి దండ్రులైన శ్రీ డొక్కా సూర్య నారాయణ గారు(సీతమ్మ గారి ముని మనవలు ) వారి సతీమణి శ్రీ మతి బాలా త్రిపుర సుందరి గార్లను ఉయ్యూరు వచ్చే ఏర్పాటును శ్రీ రామ భద్ర గారు చేశారని తెలుపటానికి మహా దానందం గా ఉంది . అలాగే నాకు అత్యంత ఆప్తులు ,శ్రీ రామ భద్ర గారి కుటుంబానికి చిర పరిచితులు అయిన విశ్రాంత ప్రదానోపాధ్యాలు శ్రీ కోసూరు ఆది నారాయణ(కోసూరు ) గారి ని ఆహ్వానించాము వారి అమృత హస్తాల మీదుగా విద్యార్ధులకు ఈ ఉపకార వెత నాలను అంద జేస్తున్నామని తెలియ జేయటానికిఇంకా సంతోషం గా ఉంది శ్రీ రామ భద్ర గారి కుటుంబానికి సరస భారతి తరఫున ,నగదు స్కాలర్ షిప్ లను అందుకొంటున్న విద్యార్ధుల తరఫున కృతజ్ఞతలను తెలియ జేస్తున్నాను –మీ -దుర్గా ప్రసాద్ -14-10-13 -9-45 p.m.
