హృదయ స్పందన గాంభీర్యం ఉదాత్తత లేని ‘’వాది’’(ఆది )శంకరాచార్య
ఎందుకో భారవి ఈ సినిమా తీస్తున్నాడని తెలిసినా ,విడుదల ముందు ట్రెయిలర్స్ చూసినా ,ఆ యాడ్స్ చూసినా ఈ సినిమా చూడాలనే అభిప్రాయం కలగలేదు .ఊళ్ళో సుమారు వారం ఆడినా దాని మీద ద్రుస్టే పోలేదు ..కాని నిన్న సాయంత్రం ఆరింటికి మా మనవడు చరణ్ ఫోన్ చేసి ‘’తాతా జెమినీ లో ఆది శంకరాచార్య సినిమా వస్తోంది చూడు ‘’అని చెబితే అప్పుడు టి.వి.ఆన్ చేసి చూశా ..నా పూర్వపు నిర్ణయం లో మార్పు అది తేలేక పోయింది .దీనికి కారణం నా వయసు కూడా నేమో .పూర్వం అయ్యర్ తీసిన సంస్కృత సినిమా అరవ కుర్రాడిని పెట్టి తీసి డబ్బింగ్ తో విడుదలైన సినిమాలు చూసి బాగా అనుభూతి పొంది ఉన్నాను అవి ఇంకా మనసు పై వేసిన గాఢ ముద్ర చెరిగి పోలేదు .కనుక కూడా నచ్చి ఉండక పోవచ్చు అని సర్ది చెప్పుకొన్నాను .పొనీ యూత్ కోసం తీశానని భారవి డబ్బా వా యించి చెప్పినా అందరు ప్రముఖులతో వాయించి చెప్పించినా యువత కు కిక్కు యెక్క లేదు ‘’.కక్కు ‘’వచ్చిందేమో .లేక పోతే యువత ఇన్ని గ్రాఫిక్కులు ,చొప్పించినా బ్రహ్మా రధం పట్టి ఊరేగించలేక పోయారు .’’సం థింగ్ ఈజ్ మిస్సింగ్ ఫర్ అల్.’’.
నాగార్జున ,మోహన్ బాబు శ్రీ హరి ,విజయ చందర్ ,నాగ బాబు ,సుమన్,భరణి ,సాయి చంద్ వంటి వారు నటులు గానే అని పించారు కాని పాత్రల్లో ఇమడలేదు .పానకం లో పుడక ల్లా వాళ్ళు కధకు కంటకాలై పోయారు .వారిని కవర్ చేయటానికే భారవికి తాతలు దిగొచ్చారు .ఇక కధ,సందర్భం గాలికి, అసంతృప్తి ప్రజలకూ మిగిల్చాడు . భైరవి సంభాషణలు అర్ధ వంతం గా ఉన్నాయి .పాటలూ బాగున్నాయి వర్ద మాన గాయకులంతా తమ ప్రతిభను సద్వినియోగం చేసుకొన్నారు .గాయకుడు హేమ చంద్ర అమరుక మహా రాజు గాబా నే చేశాడు. పల్నాటి బాల చంద్రుడేమో నని పించాడు .యుద్ధం చేయలేదు కాని ఇందులో కామ యుద్ద్ధం బానే చేశాడు .ఉభయ భారతి గా కమలిని ముఖర్జీ మంచి నటన ప్రదర్శించింది .ఆద్యంతం సినిమా వేగం గా నడిచింది ఉభయ భారతి భర్తతో వాదం లో లోతు లేదు కాని వెకిలి కని పించింది .
భారవి గ్రాఫిక్కు కిక్కు లమీదే ఆధారపడ్డాడు అవీ సందర్భోచితం గా లేనే లేవు .శంకరుని ఆత్మస్తైర్యం కంటే పై నుండి ఆడించే నాటకం అంతగా రక్తి కట్టలేదు ఇది పాత్ర శీలాన్ని స్వభావాన్ని ఖూనీ చేసింది .నగరాల పేర్లన్నీ రాసి చూపిస్తూ అంగుళం కదల కుండా శంకరాచార్య ను పన్నెండు సార్లు ఆసేతు హిమాచల పర్యటన చేయించిన భారవి‘’పని తనానికి జోహార్లు ‘’.
కౌశిక్ చాల అందం గా,ఉండాల్సి నంత గంభీరం గా పక్వమైన నటనాను భావం కలవాడు అతన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు దర్శకుడు .కాశ్మీర సింహాసనాదిపత్యం ఏంతో హుందాగా జరగాల్సి ఉంది అది అంతా భరణి,సుమన్ వాచ్యం చేయటం తో పాత్ర ఉదాత్తత దెబ్బతింది’’ఆహా’’ అని పించాల్సిన సీను ‘’ఊహూ ‘’అని అని పించింది అక్కడ ఓంకార మహాత్మ్యాన్ని తెలియ జేసే పాట బాగాఅర్ధ వంతం గా పాడాడు శంకర్ మహదేవన్ ఇది రామ దాసు సినిమా కాపీ బాణీ అని పించింది .ఫ్లూట్ రఘు తన సంగీత దర్శకత్వ సామర్ధ్యాన్ని బాగా విని యోగించాడు .ఆచార్యు ల వారి ఇహలోక యాత్ర చాలింపు చూసి కళ్ళు చెమర్చాల్సింది పోయి ,అక్కడా నాగ్ కనిపించి ఇబ్బంది పెట్టాడు .
రాఘవేంద్ర రావు బాణీ పుణికి పుచ్చుకొన్న భారవి ఉన్నదంతా ఊడ్చి ఈ సినిమా తీసి దర్శకత్వం వాహించి ఒక చాలేన్జీ గా నిలిచాడు ఇది గర్వకారణమే .ఆతను మంచి సినిమాలు తీయ గల సత్తా ఉన్న వాడు అని మాత్రం రుజువైంది .కొంచెం పైత్యం తగ్గించుకొంటే భవిష్యత్ భారవి ఇంకా అర్ధ వంతమైన చిత్రాల దర్శకుడ వుతాడని, అవాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను . .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –15-10-13- ఉయ్యూరు


నిన్న జెమిని టివిలో ఈ సినిమా చూడగానే నాకూ ఇలానే అనిపించింది. ప్రతి పాత్రలోనూ అహంకారం, వెకిలితనమే కనిపించాయి. హాస్యం కూడా శృతి మించింది. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది వంటి పాటలు ఇలాంటి సినిమాలో వాడాలనుకోవటం నీచంగా అనిపించింది. ఎంతసేపూ మాజిక్కులు చేయాలని చూసారు కానీ జగద్గురువుల జీవితం నుంచి, వారి బోధలనుంచి నేటి యువత నేర్చుకోవలసింది ఏమిటో సరిగ్గా చెప్పలేకపోయారు.
LikeLike