మరుగున పడిన మతాలు –మతాచార్యులు -38

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -38

డేకార్టేస్

‘’ఆధునిక దార్శనిక పిత ‘’అని పించుకొన్న రీనె డేకార్టేస్  1596 మార్చ్ 31న ఫ్రాన్స్ దేశం లో  జన్మించాడు ప్లేటో తర్వాత మళ్ళీ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపా పదించి ప్రసిద్ధి కెక్కిన వాడు డేకార్డ్ .శ్రీ మంతుల ఇంటిలో పుట్టి ఉత్తమ విద్యా వ్యాసంగాన్ని సాధించాడు దర్శన శాస్త్రం మీదనే మొదటి నుంచి మోజు ఏర్పడింది .లాఫ్లేచ్ జేజూయిట్ కళా శాలలో విద్య నేర్చి గణితం లో ప్రావీణ్యాన్ని పొందాడు ..నిరంతర చింతనా పరుడు .సైన్యం లో చేరి పని చేశాడు. దీనితో ప్రపంచాను భవం కలిగింది .చాలా దేశాలు తిరిగాడు .అనేక కలలు వచ్చేవి .మనసు వ్యాకులం గా ఉండేది .అప్పుడు స్వాధీన మనస్కత తో తన కలలన్ని తన దర్శన శాస్త్రానుభవమే నని ,కలల్లో పొందిన ఉపదేశాలన్ని అమోఘాలని నిశ్చయించుకొన్నాడు .

 

Frans Hals - Portret van René Descartes.jpg

Firma Descartes.svg

సహజం గా డేకార్డ్ పిరికి వాడు .పుణ్య స్వభావం ఉన్న వాడు .గెలీలియో భూ చలన సిద్ధాంతాన్ని సమర్ధించాడు .తాను  రాసిన గ్రంధాలను ప్రచురించాడు .స్వీడెన్ రాణి క్రిస్టీన్ ఆహ్వానం పై హాలండ్ వెళ్ళాడు .తెల్ల వారు ఝామున అయిదు గంటలకు తనకు రోజు దర్శన శాస్త్రాన్ని బోధించమని కోరింది అలానే చేశాడు .చలి బాధకు తట్టుకోలేక పోయాడు .ఊపిరి తిత్తులు చెడి పోయాయి .1650 లోఫిబ్రవరి న  యాభై నాలుగేళ్ళకే డేకార్డ్ అకాల మరణం  పొందాడు  వాడు  రోమన్ కేధలిక్ మతం వాడు ఆయన రాసిన ఫస్ట్ ఫి లాసఫీ పుస్తకం ఎన్నో యూని వర్సిటీలలో బోధనా  గ్రంధం గా ఉంది

 

క్రిస్తినీ  రాణి తో ఫోటో                                               సమాధి

డేకార్డ్ దర్శన శాస్త్ర్సం లో జ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది .సమ్యక్ నిర్ణయ సామర్ధ్యం ,భ్రమ ,వివేకం మనుష్యులకు సహజం ,సమానం అన్నాడు డేకార్డ్ ..వైయక్తిక బౌద్ధిక వాదం డేకార్డ్ తోనే ప్రారంబ మైంది అంతటి వరకు చర్చి ఆది పత్యం లోనే సాగి పోయింది .’’నేను తలుస్తున్నాను కనుక నేనున్నాను ‘’అనేవాక్యం తో  డేకార్డ్ తన దర్శన శాస్త్రాన్ని ప్రారంభించాడు .దీనికి ముందే ఆతను కొన్ని విధి విధానాలను, నియమాలను రూపొందించు కొన్నట్లు డేకార్డ్ మరణా నంతరం వెలువడిన ‘’రెగ్యులే ‘’అనే పుస్తకం లో ఉంది .మనస్సును యదార్దాలను అప వాదం లేని నిర్ణయాలను చేసే టట్లు మనసును ప్రవర్తింప చేయాలన్నాడు .మానసిక శక్తులకు అనుగుణం గా చిత్త శుద్ధి తో స్పందించాలి .మన మనో నిశ్చయాన్ని ఇతరుల భావాలకు తలొగ్గి వదిలి పెట్ట రాదు సరళ, సంకీర్ణ జీవులన్నిటి విషయమై పరీక్షించి దేని నుండి జ్ఞానం పొంద వచ్చో దానిని గ్రాహించాలి .

కొన్ని భావాలు ఆన్తరికాలు కాక పొతే జ్ఞానం  అనేది రాదు అని అభిప్రాయ పడ్డాడు .దీనికి కావాల్సిన హేతువులను గణిత శాస్త్రం నుంచి గ్రహించాడు .గణితం పై డేకార్డ్ కు అమిత గౌరవం అందుకే ‘’గణితం యొక్క మూలం దృఢ  ప్రతిష్టితం .ఆ మూలం పై గణిత శాస్త్రాని కన్న ఎక్కువ గొప్ప సౌధాన్ని కట్టటం అసాధ్యం అని తెలుసు కొని నేను ఆశ్చర్య పోయాను ‘’అని రాశాడు .

తనకు ముందున్న దార్శనికుల భావాలేవీ నచ్చలేదు డేకార్డ్ కు .నిశ్చిత జ్ఞానం ఎక్కడ లభిస్తుందో అని తీవ్ర అన్వేషణలో పడి  గణితాన్ని ఆధారం గా చేసుకొన్నాడు .సందేహాలకు చోటు లేని నిస్చయత్వం గణితం వల్లనే సాధ్యం కనుకు దీన్ని తన దర్శనానికి అనుసంధానం చేసుకొన్నాడు .దీనికోసం ఒక ప్రస్థా ఘట్టం అవసరం అని పించింది .సెయింట్ అగస్టీన్ చెప్పిన ‘’సందేహ పధ్ధతి ‘’ని గ్రహించాడు .’’నేను ఆలోచిస్తున్నాను కనుక నేను ఉన్నాను ‘’అనే స్వయం విదితం చేసే వ్యక్తీ నిష్టమైన ఆలోచనల ఆధారం గ మిగిలిన సత్యాలను దీని నుంచి రా బట్ట టానికి ప్రయత్నం చేశాడు .సందేహించే వాడి ఉనికి సందేహం లేనిది కనుక సందేహ పదం కాదు అన్నాడు. తాను  ముందు చెప్పిన వాక్యాన్ని ప్రస్థానం గా తీసుకొన్నాడు డేకార్డ్

 

‘’దేన్నీ నేను స్పష్టం గా సమగ్రం గా నేను గ్రాహిస్తానో అది సత్యం అని స్వీకరిస్తాను ‘’అని చెప్పాడు .స్వంత చైతన్యం లాగా ఏది ఏది స్పష్టం గా పరి పూర్ణం గా .కనీ పిస్తుందో అదంతా సత్యమే నంటాడు .నిశ్చల మనస్సు నుండి ఉద్భ వించే భావాలు సప్రమాణ జ్ఞానం అన్నాడు ఇంద్రియ సంవేదనాల కంటే భౌతిక ద్రవ్యం భిన్నమైనది .ఈ గుణాలు అస్పస్టాలు .ఇవి వస్తు నిస్టం కావు .అంటే కొత్త అతి భౌతిక వాదం ఇందులో చేరిందని తెలుస్తోంది .శరీరానికి మనసుకు మధ్య ఉన్న వైరుధ్యం మరీ బల పడింది డేకార్డ్ వాదం లో .మానవుడు కూడా యంత్రమే అయినా అతనిలో దేవుడు, ఆలోచించే మనసును  ఉంచాడు మనిషికి ఉన్న సంవేదనలు గ్రాహక శక్తి ,చలనం మొదలైన స్వరూపం చేత శరీరం లో విజాతికి చెందినా మనసు ఉంది ఎక్కడో శరీరం తో సంసర్గం కలగ జేసు కొంటోంది అని భావించాడు .ఈ సంసర్గం అనేది మాన వ మస్తిష్కం లో ఉన్న ‘’పైనీయాల్ గ్రంధి (అమృత గ్రంధి)లో జరుగుతోంది అని చెప్పాడు డేకార్డ్ .ఇక్కడే మనసు- నాడుల నుంచి వేదనలను గ్రహించి ,నాడీ కణాల గుండా ‘’ఆనిమల్ స్పిరిట్స్’’ద్వారా చలానాలను కలిగిస్తోంది అన్నాడు .కాని డేకార్డ్ చెప్పిన ఈ  విషయాన్నీ భావ వాదులు, భాషా శాస్త్ర వేత్తలూ అంగీకరించలేదు .అయితే ఇది భావ వాదానికి నాంది అని నిస్సందేహం  గా చెప్ప వచ్చు ఇదే డేకార్డ్ సాధించిన ఘన విజయం

ద్రవ్యం కంటే మనస్సు నిశ్చిత బుద్ధికి శ్రేష్టం అని తెలిసింది .దీని పై ఇంకా స్పష్టమైన సిద్ధాంతాలను ఆ తర్వాత ఎప్పుడో కాని కాంట్, హెగెల్ లు చెప్ప గలిగారు .దేవుడు ,బయటి ప్రపంచం లను నిరూపించటానికి డేకార్డ్ ప్రయత్నించాడు .మనసు నుండి బాహ్య ప్రపంచాన్ని ఉత్పాదిన్చాటా నికి సిద్ధాంతాలు చేశాడు .మనసు నుండి భౌతిక ద్రవ్యాన్ని వేరు చేసి వాటి మధ్య సంబంధాన్ని ఏర్పరచాడు .దీనినే ఈశ్వరుడు అన్నాడు .’’ఏది నాకు భిన్నం అయిన దంతటిని సృష్టించిందో ,అలాంటి అనంతం నిత్యం స్వతంత్రం సర్వజ్ఞత్వం అయిన ద్రవ్యమే దేవుడు లేక ఈశ్వరుడు అన్నాడు డేకార్డ్ .దేవుడుతప్పక వివేకవంతుడు .ఈశ్వర అస్తిత్వాన్ని ఆయన స్వరూపం నుండి వేరు చేయలేము అంటూ’’ఒక త్రిభుజం లో మూడు కోణాలు కలిస్తే రెండు సమకోణాలకు సమానం’’ అనే గుణం త్రిభుజం స్వరూ పాన్నుంచి ఎలా వేరు చేయ లేమో ఇదీ అంతే అని ముడి పెట్టాడు .కాంట్ అస్తిత్వం విశేష కోటిలో చేరదు అని తేల్చాడు .

ఈశ్వరుని పరి పూర్నతలో శీల పరి పూర్ణత ఉంది కనుక ఆయన వంచకుడు కాదన్నాడు డేకార్డ్ .సహజ ప్రకాశం కలది అంతా సత్యమే నన్నాడు .మన ఇంద్రియాలు మనల్ని ఎప్పుడూ వంచిస్తాయి అనే భావం నుంచి డేకార్డ్ బాహ్య ప్రపంచ స్వభావాన్ని స్పస్టపరచ టానికి యత్నించాడు .డేకార్డ్ మతం లో విస్తృత మైనదీ ,పరిణామ శీలం కలది తప్ప ఈ విశ్వం లో ఇంకేదీ లేదు .’’ఆర్కి మిడీ స్ లాగా డేకర్డ్ ‘’భౌతిక ద్రవ్యాన్ని,చలనాన్ని నాకు ఇస్తే ఈ విశ్వాన్ని అంతటిని నేను మళ్ళీ నిర్మిస్తాను ‘’అని ప్రతిజ్ఞా చేశాడు

విస్తృతి ని విస్తృత మైన దాని కంటే వేరుగా చూడలేము అన్నాడు .దేశం లేక వస్తువు లోపల ఉండే ప్రదేశం ,దాన్ని ఆక్రమించి ఉన్న ద్రవ్యం పరస్పర భిన్నాలు కావు .మనంచూసే  చూపు ను బట్టి తేడా గా కనీ పిస్తాయంటాడు .వస్తువులో విస్త్రుతి  దాని విశేషణం .అని తన భౌతిక శాస్త్రానికి జామెట్రీ ని జోడించి చెప్పాడు మరి నానాత్వానికి కారణం ఏమిటి ?చలనం ఉష్ణం కాంతి అంటాడు  మనస్సు –శరీరం ల గురించి చెబుతూ భౌతిక సూత్రాలకు లొంగని దాన్ని మనసుకు ఆపాదించాడు ఈశ్వరుడే చలానికి ప్రధాన కారణం మొదటి చలనం ఆయన కల్పించిందే .అప్పటి నుండి విశ్వ చలనం నిరాటంకం గా జరిగి పోతోంది అన్నాడు .

డేకార్డ్ ద్వైత వాదిఅయినా వ్యక్తి లో కనీ పించే మనస్సు శరీరాల ఐక్యతను ,ప్రత్యక్ష ,అంతర్ జ్ఞానాన్ని కాదన లేదు .బాహ్య ప్రపంచం విషయం లో డేకార్డ్ చెప్పింది అతి భౌతిక శాస్త్ర మూల సారమే .అతని దృష్టిలో దర్శనం వృక్షం లాంటిది .దాని మూలం అతి భౌతిక శాస్త్రం .కొమ్మలు భౌతిక శాస్త్రం .మిగిలిన విజ్ఞాన శాస్త్రాలన్నీ దాని శాఖలే .ఈశ్వరుడే ప్రాధమిక ద్రవ్యం .మనసు ,భౌతిక ద్రవ్యం సెకండరి .విశేషణాలు భౌతిక ద్రవ్యం యొక్క సారాలు (ఎస్సెన్స్ )మనస్సు స్వరూపం ఆలోచనా భౌతిక ద్రవ్యాల విస్తృతి .ప్రాకారాలు అంటే ఫంక్షన్స్ ద్రవ్యం యొక్క విశేష రూపాలు (మాడి ఫిషన్స్  )  .డేకార్డ్ దర్శన శాస్త్రం వల్ల  నూతన వైజ్ఞానిక ఆవిష్కారానికి ,దర్శనం తో సమన్వయానికి దారి తీశాయి  అతన్ని విమర్శించిన వారి వల్ల డేకార్డ్  ప్రతిభ పెరి గిందే కాని తగ్గలేదు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-10-13 –ఉయ్యూరు

.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.