మరుగున పడిన మతాలు –మతాచార్యులు -39

 

L.N.Tolstoy Prokudin-Gorsky.jpg
                                                              ఇరవై  ఏళ్ళ వయసులో
 మరుగున  పడిన మతాలు –మతాచార్యులు -39

 

లియో టాల్ స్టాయ్

రష్యాలో బాగా సంపన్నమైన కుటుంబం లో లియో టాల్ స్టాయ్ 1828 లోసెప్టెంబర్ తొమ్మిది న  జన్మించాడు .పూర్తీ పేరు లెవ నికోలోవిచ్ కౌంట్  టాల్ స్టాయ్ .యస్నాయ పోల్యాన జన్మ స్తలం  యవ్వనం లో ఖుషీ పురుషుడిగా అన్నీ భోగాలు అనుభ వించాడు ఆ తర్వాతా ఇలాంటి జీవితం పై విరక్తి కలిగింది .ప్రేమ ,కరుణ ప్రధానం గా ఉన్న తత్వ శాస్త్రాన్ని రూపొందించాడు

.యుద్ధం మీద ప్రతి ఒక్కరికి ద్వేషం కలిగే టట్ట్లు ‘’యుద్ధము –శాంతి ‘’అనే గొప్ప నవల1865-69 మధ్య  రాశాడు రష్యా పై నెపోలియన్ దండ యాత్రకు వ్యతిరేకం గా అయిదు కుటుంబాల కదా ను ఇందులో రాశాడు స్వతంత్ర బుద్ధి అన్దరికిఉన్దాలని చెప్పాడు నెపోలియన్ లాంటి గర్విస్తులు తమను తాము తెలుసుకోలేక విర్ర వీగారాని రాశాడు అది ఆయన ‘’మాగ్నం ఓపస్ ‘’అని ఇంచుకోంది.రష్యా సాహిత్య చరిత్రలో అదొక మెయిలు రాయిగా ఆధునిక రష్యా ఇతిహాసం (ఎపిక్) గా సుస్తిర స్తానం పొందింది ఆయనకు విశేష మైన కీర్తి ప్రతిష్టలు తెచ్చింది ప్రపంచ దేశాలలో టాల్ స్టాయ్ పేరు మారు మోగింది .ప్రపంచ ప్రసిద్ధ నవలా రచయిత అయ్యాడు

                                                                                               గాంధి తో టాల్ స్టాయ్

.ఆయన రాసిన అన్నా కేరీనా నవల ఫ్లాబర్ట్ రాసిన ‘’మేడం బోవరి ‘’కి ,ఫాన్తెన్ రాసిన ‘’ఇఫీ బ్రీస్ట్ ‘’నవలకు సరి సమానం .ఇందులో వివాహిత అయిన ఒక స్త్రీ విషాద ఆద చిత్రించాడు ఈ నవల చాలా సార్లు హాలీ వుడ్ సినిమా గా తీశారు .అన్నా కేరీన లో తానూ చెప్పాల్సింది అంటా చెప్పెశానని ఇంకా రాయటానికి ఏమీ మిగలలేదని టాల్ స్టాయ్ చెప్పుకొన్నాడు ఈ నవలలో అసాంఘిక అవి నీతి ని బోధించాడని ఆయనపై ఆరోపణ వచ్చింది ఆయన రాసిన ‘’కన్ఫెషన్ అండ్ వాత ఐ బెలీవ్ ‘’రచనను ప్రభుత్వం నిషేస్ధించింది జీవితం లో సత్యానికి యెంత అవసరం ఉందొ రచనలో లేక కళలలో కూడా సత్యానికి అంతే ప్రాధాన్యత ఉండాన్నాడు టాల్స్టాయ్ గాంధీ గారికి టాల్ స్టాయ్ గురువు ..షేక్స్ పియర్ ,డాంటే ,బీతొవెన్ లు అంటే ఎవగించుకొన్నాడు లియో .కదా నవలాలలో క్లైమాక్స్ అంటే ఇష్టం లేని వాడాయన .ప్రతిదీ సంపూర్ణం గా రాయటమే ధ్యేయం ఆయన క్రిస్టియన్ భావం లో ‘’సేర్మాన్ ఆన్ ది.మౌంట్ ‘’కు ప్రాధాన్యత ఎక్కువ .తనకు నచ్చిన వాటిని విడిగా రాసుకొన్నాడు దీనికి ‘’టాల్ స్టాయ్ బైబిల్’’ అని పేరుఇది బాగా ప్రాచుర్యం పొందింది . పీటర్ ది గ్రేట్ ఈయనకు ‘’కౌంట్ ‘’బిరుదునిచ్చాడుబాక్సర్ విప్ల వాణ్ని సమర్ధించాడు కరువు బాధితులకు సహాయం చేశాడు

 

కరువు సహాయ కార్యక్రమం                                            టాల్ స్టాయ్ సమాధి 

1908 లో ‘’ a letter to a HIindu ‘’అని భారత స్వాతంత్ర్యాన్ని బ్రిటిష్ పాలకుల నుండి తెచ్చుకోవటానికి అహింసా మార్గమే శరణ్యం అని రాశాడు దక్షిణాఫ్రికా లో గాంధీ పని చేస్తున్నప్పుడు ఆయనకు ఇది దొరికి చదివి స్పూర్తి పొందాడు వారిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్త రాలు జరిగాయి గాన్స్దీ గారి అనుమానాలన్నీ టాల్ స్టాయ్ తీర్చి కార్యోన్ముఖుడిని చేశాడు .గురు దక్షిణ గా దక్షిణాఫ్రికాలో రెండవ ఆశ్రమం గా ‘’టాల్ స్టాయ్ ఫారం ‘’ను గాంధీ ఏర్పాటు చేశాడు .టాల్ స్టాయ్ ‘’ఎస్పరాన్టో ఉద్యమం ‘’ను పూర్తిగా సమర్ధించాడు .

కజాన్ యూని వర్సిటి లో న్యాయ ,భాషా శాస్త్రాలు చదివాడు .ఆ నాటి విద్యా స్తాయి నచ్చక డిగ్రీ పొందలేదు .ఎక్కువ కాలం మాస్కో ,పీటర్స్ బర్గ్ లో గడిపాడు .సుఖ వ్యాధులు అంటించుకొని ,జూదం అది అంతా పోగొట్టుకొన్నాడు .1850 నుంచి రచనా వ్యాసంగం మొదలు పెట్టాడు .సైన్యం లో చేరి పని చేశాడు ’’చైల్డ్ హుడ్ ,బాయ్ హుడ్, యూత్ అనే ట్రయాలజి  గా తన జీవిత చరిత్ర రాసుకొన్నాడు మొదట్లో రాసిన ‘’రైడ్ ‘’అనే కధలో మిలిటరీ చేచన్ పర్వతాలలో ఉన్న త్రైబల్స్ పై చేసిన దాడిని ప్రతిఘటిస్తాడు .క్రీమియన్ వార్ లో సైనిక భాగానికి సారధ్యం వహించి ‘’సేబస్తో పోల్ ‘’స్వాధీనం చేసుకొన్నాడు .రోజు డైరీ రాస్తూ తనలోని భావాలను పొందు పరచే వాడు .గోతే స్తేన్దాల్ థాకరే రచనలను కరతలా మలకం చేసుకొన్నాడు .డికెన్స్ రూసో రచనలను ఆకళింపు చేసుకొన్నాడు .

సిద్ధర్దుడికి జ్ఞానోదయం అయి నట్లు టాల్ స్టాయ్ కి కూడా జ్ఞాన నేత్రం విచ్చు కొంది.జీవిత లక్ష్యం పై జిజ్ఞాస పెరిగింది మరణమా ?అంతమా /అనే ప్రశ్న వేధించింది .మరణ భయాన్ని పోగొట్టుకోవటానికి మార్గాలేమిటి అనే దాని పై చింతన చేశాడు .దీని పై నిరంతరం ఆలోచిస్తూ దేశ ,విదేశాలు తిరిగి మనస్సుకు సమాధానం చెప్పుకొన్నాడు .ఏఎ అనంత పయనం లో ఆటను నాలుగు సూత్రాలను రూపొందించాడు .1-కోపాన్ని చంపుకోవాలి .2-కాముకత్వం రూపు మాపు కోవాలి .3-ఏ విషయాన్ని గురించి ఎవరికి మాట ఇవ్వ కూడదు .4-అపకారికి కూడా ఉపకారం చేయాలి .ఈ నాలుగు సూత్రాలను సమన్వయము చేస్తూ ‘’చతుర్దర్శన సమన్వయ దీపిక ‘’అనే ఉద్గ్రంధం రాశాడు

1917 లో రష్యాలో లెనిన్ నాయకత్వం లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది .ప్రతి కాలేజి విద్యార్ధి  తత్వశాస్త్రాన్ని ఒక ఏడాది తప్పకుండా చదవాలనే నియమం వచ్చింది . హైస్కూల్ లెవెల్ లో తర్కం ,సామాజిక శాస్త్ర బోధన అమల్లోకి వచ్చింది .

ఈ విశ్వం అనంతం అని ,దీనికి ఆది కాని అంతం కాని లేవని టాల్ స్టాయ్ చెప్పాడు .విశ్వం సర్వ సమగ్రం అన్నాడు .కనుక దీన్ని మించినదేడీ ఎక్కడా లేదు అని స్పష్టం చేశాడు .కనుక ‘’అజ్నేయం ‘’అనేది విశ్వం లో లేనే లేదుఅజ్ఞాతం మాత్రం ఉంది అన్నాడు .’’విశ్వ రహస్యాన్ని ఆవిష్కా రించే సూత్రాలు గతి తార్కిక భౌతిక వాదసూత్రాలు మాత్రమె ‘’ అని ఖచ్చితం గా చెప్పాడు .ఇవే అందరికి మార్గ దర్శకాలు అని తేల్చి చెప్పాడు .ఇదంతా ఆ నాటి రష్యా లో ఉన్న తాత్విక ధోరణికి మూల లక్శనాలాఐన విషయాలే .1910 లో నవంబర్ఇరవై న  82 ఏళ్ళ వయసులో టాల్ స్టాయ్ ఇహ లోక యాత్ర చాలించాడు

సశేషం –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-10-13- ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.