మరుగున పడిన మతాలు –మతాచార్యులు -40
సర్వేపల్లి రాధా కృష్ణ పండితుడు
1888 లోసెప్టెంబర్ అయిదున రాధాకృష్ణన్ తిరుత్తని లో జన్మించాడు తండ్రి వీరాస్వామి తల్లి సీతమ్మ . సర్వే పల్లి రాదా కృష్ణన్ మద్రాస్ క్రైస్తవ కాలేజి లో విద్య పూర్తీ చేసి ,అక్కడే ప్రెసి దేన్సి కాలేజ్ లో దర్శన శాస్త్ర ఉపన్యాసకుడు గా ,ప్రదానోపన్యాసకుడుగా పని చేశారు .భార్య శివకామి .కల కత్తా విశ్వ విద్యాలయం లో తత్వ శాస్త్రావుపన్యాసకుడు గా పని చేశారు .మాంచెస్టర్ కాలేజ్ ఆ ఫ ఆక్స్ ఫర్డ్ లో ఆస్తాన్ ఉపన్యాసకుడైనాడు .1926 లో చికాగో లో హాస్కేల్ తులనాత్మక మత దర్శనోపాధ్యుడైనాడు .1931-36 లో ఆంద్ర విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షుడుగా1936-52 లో ప్రాచ్య మత ,నీటి శాస్త్రాలలో స్పాల్టింగ్ ఆచార్యుడుగా ఉన్నాడు .1939-48 ,కాలం లో బెనారస్ విశ్వ విద్యాలయ ఉపాధ్యక్ష పదవి నిర్వహించాడు .అంతర్జేఅతీయం గా ఎన్నో విశిష్ట పదవులను రించాడు పండితుడు .1951 లో భారత తోలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ తో బాటు తోలి ఉప రాష్ట్ర పాటి పదివిలో అలరాడాడు ఆతర్వాత రెండవ రాష్ట్రపతి గా పరిపాలనను ఆదర్శ వంతం గా పని చేసి ప్లేటో చెప్పినట్లు దేశానికి రుషి పాలనా కావాలన్నదాన్ని రుజువు చేసి సర్వా సమర్దుడని పించుకొన్నాడు .అంతకు ముందు రష్యాలో రాయ బారిగా ఉండి స్టాలిన్ మనసునే మార్చిన ఘనుడు రాధాకృష్ణ దేశికుడు .అనేక వేదాంత గ్రంధాలను తత్వ శాస్త్రా గ్రంధాలను రచించి ప్రపంచ ప్రసిద్ధి చెందాడు ఆచార్యుడు తన పుట్టిన రోజు సెప్టెంబర్ అయిదు ను వేడుక గా జరపటం కంటే ‘’ఉపాధ్యాయ దినోత్సవం ‘’గా నిర్వహించాలని సూచించాడు .అప్పటినుంచి అదే జరుగుతోంది .ప్రస్తాన త్రయం అనబడే బ్రాహ్మ సూత్రాలు ఉపనిషత్తులు భగవద్ గీత కు రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యానం చరిత్రలో నిలిచి పోతుంది .’’క్రిష్ణార్పణ చారిటి ట్రస్ట్ ను ఏర్పరచి సేవ లందించాడు .’’ఫిలాసఫర్ ప్రెసిడెంట్ ‘’గా సుప్రసిద్ధుడు .ప్లేటో ‘’తత్వ వేత్త రాజ్యాదికారి కావాలి ‘’అన్నదాన్ని రుజువు చేశాడు .అన్తాకు ముందు జనక చక్ర వర్తి తో ఈయనను పోలుస్తారు .
బుజ్జాయి వేసిన చిత్రం పై రాధా కృష్ణ సంతకం
రాదా కృష్ణన్ భావనలో సమన్వయము చాలా ముఖ్యమైనది .ఈ విశ్వం యొక్క విచిత్ర రూపాన్ని ,దానిలో కనీ పించే ఏకత్వాన్ని జాగ్రత్త గా గమనించాలని కోరాడు .మానవ స్వభావం సద్భావమనుభావం తో కూడిన విజ్ఞానం లో కూడా ఏకత్వాన్ని దర్శించ వచ్చు అంటాడు పండితుడు .ఆయన దర్శనం లో మూడు అంశాలు ప్రధానమైనవి .
మొదటిది –‘’కేవలం ‘’గూర్చి సిద్ధాంతాలున్నాయి .పాశ్చాత్య వేదాంతాన్ని హెగెల్ ,బ్రాడ్లీ వంటి వారి ని ఆదర్శం గా తీసుకొన్నాడు ఈయన భావానాలు మిగిలిన వారి దాని కంటే విలక్షణ మైనది .’’కేవలం అని చెప్పిన రాదా కృష్ణ భావం శాంకారాద్వైతంలోనిదే
రెండవది –ఈయన రచనలన్నీ ఆధునిక ప్రపంచ సమస్యల పరిష్కారానికే ఉప యోగించాడు .ఇదే భారతీయ వేదాంతానికి కొత్త రూపు నిచ్చాడు .ఇతర దేశాలలో ఉదార భావం వ్యాపించిన చోట్లలో రాదా కృష్ణ భావ వ్యాప్తి చొచ్చుకు పోయింది .
మూడవది –ఆధునిక దర్శన శాస్త్ర చరిత్రలో మన పండితుని స్తానం అద్వితీయం గా నిలిచి పోయింది .మానవ నాగరకతకు సంస్కృతికి కొత్త సమన్వయం తీసుకొచ్చాడు .ప్రపంచ వైవిధ్యానికి ఏకత్వం సాధించిన ప్రజ్ఞాని .ప్రపంచ దేశాల మధ్య సంస్కృతుల మధ్య ఉన్న భిన్నాలను వదిలి ఏకత్వాన్ని సమకూర్చి న ఘనుడు ఈ మధ్యే మార్గం అంటే‘’తార్కిక వివేచనా జ్ఞానం యొక్క ఫాలితమే ‘’.
‘’ library of living philosophers ‘’అనే గ్రంధ శ్రేణి లో ఒకటి అయిన ఫ్రాగ్ మెంట్స్ఆఫ్ కన్ఫెషన్ ‘’లో గురువు యెంత గొప్ప వాడైనా తానూ దాన్ని అంగీకరించాను అన్నాడు స్వానుభవం నుండి వచ్చిన జ్ఞానమే మూల మైనది అని ఖచ్చితం గా చెప్పాడు .గతంఅనాగారక తకు ఆరంభం అని భావించి రెండిటిని పునర్జీవింప జేయాలి ఇది ప్రాచీనులు చెప్పిన శుకుడు చెప్పిన బోధ కాదు .అప్రాచీన విజ్ఞానం లోని ఆత్మ వివేక సారాన్నిగ్రహించి మహా జ్ఞానాన్ని అంతా కొత్త పద్ధతిలో వివరించి సమస్యా పరిష్కారానికి విని యోగ యోగ్యత నిరూపించాడు .
జ్ఞాన ,మీమాంసా శాస్త్రాలలో అంతర జ్ఞానం యొక్క మూలం అయిన ‘’కేవల ‘’సిద్ధాంతాన్ని ముఖ్యం గా బోధించాడు .జ్ఞానం అనేది స్వతః ప్రమాణం .అది నిత్యుడు అయిన జ్ఞాతను తెలియ జేస్తుంది .ప్రపంచం మిధ్య కాని భ్రాంతి కాని కాదు .విజ్ఞానానికి ఉపయోగ పడే సంవేదనలన్ని ,వాటి మధ్య సంసర్గాలుగా మారాలి .ద్రవ్యం జీవం ,చైతాన్యం అనేవి కాల్పనిక నిర్మాణాలు .మానవ అనుభవానికి వరుస దశలు .ఇది కేవల జ్ఞాన వాడి చెప్పే మతం మాత్రం కాదు .
‘’ప్రపంచానికి వ్యావహారిక సత్తా ఉంది .వ్యావహారిక సత్తాకు భిన్నమైనవి .మానవ అనుభవం పరమ సత్యం కాదు .భ్రాంతి విలసితం కూడా కాదు . .ప్రపంచం సత్యం కాక పోయినా మనస్సు సృష్టించింది కాదు .సత్తా సర్వాస్వం ఆత్మయే .మన ఆలోచనా పరంపరా లో అనుభవం అయిన ఒక ఆవశ్యకత నిర పేక్ష సత్యం ప్రక్రుతి చైతన్య తో కూడినది .అను రూప మైన వశ్యం సద్బావం యొక్క అనుభూతి లేనిదే నిరుపాధిక సత్యం గా భావిన్చాక్ లేం .దీన్నే ‘’జీవితాన్ని గురించి హావ వాడ దృక్పధం ‘’అనే దానిలో వివరించాడు రాధాకృష్ణన్ .’’అయిడలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ లో వీటి విషయమై చర్చించాడు .మనతో సమాన మైన అనుభవం కల ఇతర మనస్సులు కలవు అన్నది అందరికి తెలిసిందే .ఈ సామాన్య ప్రతీకయే పరామాత్మ యొక్క అస్తిత్వైకి ప్రమాణం అన్నాడు .
తన వాదాలను ఉపనిషత్తుల నాదారాం గా సమర్ధించాడు .అంతర్ జ్ఞానం అనగా ప్రత్యక్ష అనుభూతియే .ఇది అఖండాభనువమే .అంతర జ్ఞానానికి రుజువు దాన్ని మన మనసు నుండి బహిష్కరించ లేక పోవటమే అన్నాడు .
నీతిశాస్త్ర విషయం లో కూడా రాదా కృష్ణన్ కు కొన్ని నిశ్చిత అభిప్రాయాలున్నాయి .కర్మ స్వేచ్చకు ప్రతి ద్వందికాదు .తన్ను తానూ ఉద్ధరించుకోవాలి అన్న కోరిక మానవుడికి సహజం .సన్యాసం కూడా సాధుత్వాన్ని సాధనం కాదు .స్మృతుల ననుసరించి ప్రవర్తించటం మంచిదే నన్నాడు .అవి శాంతికి ఉపయోగిస్తే మంచిదే అంటాడు .సంపూర్ణ జ్ఞానం ,నిరుపాధిక ప్రేమ ,పరి పూర్ణ స్వేచ్చ మధ్య సామరస్యాన్ని సాధించటమే మనవ జీవిత లక్ష్యం .ఇందులో ఏది లోపించినా సంపూర్ణం కాదు .’H indu view of life ‘’లో వర్ణ వ్యవస్థ ను సమర్ధించాడు .మానవుడి గుణాలే అతని ఉత్క్రుస్టతకు కారణం .మానవ హక్కులు తగ్గించుకొని కర్తవ్యానికి ప్రాముఖ్యమివ్వాలని కోరాడు .ఇతరుల దృక్పధాన్ని కూడా అర్ధం చేసుకోవాలి .శీలం పీడనం లేక పోవటమే ప్రజాస్వామ్యానికి రక్ష అన్నాడు .ప్రజాస్వామ్యం సఫలం కావాలంటే ఆర్ధిక తార తమ్యాలుండా రాదు .ధర్మం తో ఉందని అభ్యుదయం ఇసుక ఇల్లు లాంటిదే .
అంతర్జాతీయ రాజకీయ రంగం లో రాదా కృష్ణన్ బోధలు అత్యన్తావస్యకాలు అన్నారెందరో. ప్రతి నాగరికత అక్కడి మతం యొక్క అభి వ్యక్తియే .అంధ విశ్వాసాలు వదిలెయ్యాలి .ఆత్మ సంపత్తి లో మానవు లంతా సమానమే .మానవులు ఉన్నత గుణాలు పొంది ప్రవర్తనలో ఈశ్వర భావాన్ని నింపుకొని ప్రవర్తిస్తేనే శాంతి ఏర్పడుతుంది అని చెప్పాడు .ఏ సంప్రదాయాన్ని రాదా కృష్ణన్ అంగీకరించ లేదు .మనుష్యుల హృదయాలలో వెలుగు నింపి ,శ్రద్ధను ప్రోత్సహించి కృతకృత్యులు కావాలనిపండి తుని ఉపదేశ సారం1975ఏప్రిల్ 17 న 86 ఏళ్ళ నిండు వయసులో పరమ పాడించాడు మహా పండితుడు .
|
t is not God that is worshipped but the authority that claims to speak in His name. Sin becomes disobedience to authority not violation of integrity. |
” |
|
“ |
“Reading a book gives us the habit of solitary reflection and true enjoyment.” |
” |
|
“ |
“When we think we know we cease to learn.” |
” |
|
“ |
“A literary genius, it is said, resembles all, though no one resembles him.” |
” |
|
“ |
“There is nothing wonderful in my saying that Jainism was in existence long before the Vedas were composed.” |
అని ప్రవచించిన ఉత్తమ వేదాంత తత్వ దేశికుడు రాదా కృష్ణన్
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-10-13- ఉయ్యూరు

