మరుగున పడిన మతాలు –మతాచార్యులు -41
కార్ల్ యాస్పర్స్ (Jaspers Carl )
కార్ల్ యాస్పర్స్ జర్మన్ దార్శనికుడు ఓల్డెన్ బర్గ్ లోఒక బ్యాంకి అధికారి కుమారుడు .1883 లో ఫిబ్రవరి23 న జన్మించాడు మనసిక రోగ చికిత్సా నిపుణుడు .దీనిపై‘’Allegemeine sycho patology ‘’అనే గ్రంధాన్ని రాశాడు ద్రుష్టి ని దర్శన శాస్త్రం మీద కేంద్రీకరించాడు .హిడెన్ బర్గ్ యూని వర్సిటి లో ఆచార్య పదవి లో చేరాడు .అప్పుడున్న జాతీయ సమైక్య వాదాన్ని ఒప్పుకోలేదు కార్ల్ .దీని ఫలితం గా జర్మనీ ని వదిలి పెట్టాల్సిన స్తితి వచ్చింది .1943 లో స్విట్జర్లాండ్ లో బాసిల్ విశ్వ విద్యాలయ ఆచార్య పదవి లో ప్రవేశించాడు .చాలా గ్రంధాలు రాశాడు అందులో ముఖ్యమైనవి దర్శన శాస్త్రం ,దార్శనిక సమాలోచనా రీతి ,దార్శనిక శాస్త్ర ప్రవేశం ,నేటి తర్కం –ప్రతి తర్కం మొదలైనవి .1969ఫిబ్రవరి 26న ఎనభై ఆరు ఏళ్ళ వయసులో మరణించాడు
“While I was still at school Spinoza was the first. Kant then became the philosopher for me and has remained so…Nietzsche gained importance for me only late as the magnificent revelation of nihilism and the task of overcoming it.”
కియోర్క్ గార్డ్ అనే ఆయన స్తాపించిన అస్తిత్వ వాద సంప్రదాయానికే యాస్పర్ర్స్ చెందుతాడు .అతని దృష్టిలో దర్శన శాస్త్రం అంటే విశ్వాన్ని గూర్చిన అమూర్త సిద్ధాంతం కాదు .అస్తిత్వ గుణం ఉన్న దార్శనికుడు తాను ఉన్న ప్రత్యక్ష జీవిత సన్నీ వేశాలలో చూపే ప్రవ్రుత్తి .యే దర్శన శాస్త్రం అన్నాడు .యాస్పర్స్ ఆలోచన పరిణతి పొందిన కొద్దీ అస్తిత్వ వాదం లో ఉన్న విరోదా భాసాలపై ఆసక్తి తగ్గింది .అంత కంటే సువ్యవస్తిత దార్శనిక సమా లోచన వైపు ద్రుష్టి పెట్టాడు .ఈ అంశాలను దర్శన శాస్త్రం ఉపేక్షించ కూడదు అని చెప్పాడు .దాని లక్ష్యం హేతు బద్ధ బౌద్ధిక విచారమే .తర్కం యొక్క ప్రాదాన్యతను గు ర్తించాడు .కనుక దర్శన శాష్ట్రం ‘’బుద్ధి దర్శనం’’ అని కొత్త అర్ధం చెప్పాడు .
ఇతని ఆలోచనలలో విషయత్వం (ఆబ్జెక్టి విటి),అస్తిత్వం (ఎక్సిస్టెన్స్ ),అతీత్వం (ట్రాన్సేన్ డేన్స్ ) ఉన్నాయి .వాస్తవికత అంటే సజీవ నిర్జీవ వస్తువులే కాక ,ఆలోచనలు మనః ప్రవృత్తులు .ఇవన్నీ ప్రక్రుతి శాస్త్రం చర్చించేవి .ప్రక్రుతి విజ్ఞానం వల్ల విశ్వం యొక్క సమగ్ర స్వరూపం తెలియదు ప్రక్రుతి జ్ఞానం దానికది సాటి లేనిదే .దానిపై విపరీతం గా ఆధార పడ రాదు .ప్రక్రుతి విజ్ఞానం టో దర్శన శాస్త్రానికేమీ వైరుధ్యం లేదన్నాడు .దర్శనం ప్రక్రుతి యొక్క పరిమితి ని చూపించి దాని పై వ్యామోహం కలగ కుండా కాపాడుతుంది .వ్యక్తీ అస్తిత్వం లో ఉన్న వైవిధ్యం సందిగ్ధతల పై ద్రుష్టి పెట్టాలి .తన నిర్ణయాలలో మానవుడు తన అస్తిత్వాన్ని బయట పెడతాడు .అతడు కేవలం ‘’విషయి ‘’మాత్రం కాదు .ప్రపంచం టో సంబంధం ఉన్న వాడు .అతని అస్తిత్వానికి ఎప్పుడూ ప్రామాదం పొంచి ఉంటుంది .ఈ సందర్భం లో అతనికి వ్యక్తిత్వం, స్వేచ్చ ఉండక పోవచ్చు .
దైవ ద్రుష్టి లేక పొతే అమానుషం గా మానవుడు ప్రవర్తించే అవకాశం ఉంది .స్వతంత్ర మానవ సంఘం లో తానొక స్వతంత్ర వ్యక్తీ గా మసులుకోవాలి .అస్తిత్వాన్ని వివరించటం అసాధ్యం అన్నాడు యాస్పర్స్ .కనుక విషయ వాస్తవికత కంటే భిన్నమైన వాటిని కల్పించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు .అతీత్వం అనేది లేక పొతే అస్తిత్వం అర్ధం కాదన్నాడు .’’లిమిట్ సిచుయేషన్స్అనే భావాన్ని దీనికోసం వ్యాప్తి లోకి తెచ్చాడు చావు మొదలైనవి అనుభావాలైనప్పుడు మనల్ని మన అస్తిత్వ విషయం లో శ్రద్ధ పెంచి అస్తిత్వం యొక్క నిగూడార్ధాన్ని ఈ అవధి సన్నివేశం(లిమిట్సిచు యేషన్స్ ) కాపాడుతాయని చెప్పాడు .
అస్తిత్వానికి ఈ దృశ్య ప్రపంచం టో సంబంధం ఉన్నట్లే దాని అతీత్వం టో కూడా సంబంధం ఉంది అన్నాడు .దీనిని వివరించటానికి ‘’కూటలిపి భాష ) ‘’ను తయారు చేసి అందులో చెప్పాడు .అతీత్వ సందేశాలను గ్రాహించటా నికి మనిషి ఎప్పుడూ సిద్ధం గా ఉండాలి .కూట లిపి లో మునిగి తేలిన వాడి జన్మ సార్ధకం .అలాంటి కూట లిపి భాష లలో చరిత్ర ఒకటి ‘’అన్నాడు ఈ భాష పురాణాలలో కళలలో కన్పిస్తుంది అని చెప్పాడు .కూట లిపి కానిదేదీ లేదు అని తేల్చాడు .అతీత్వం వాస్తవికత యొక్క ఉత్కృష్ట దశను, నికృష్ట దశనూ రెండిటిని చెబుతుంది .
1934 లో యాస్పర్స్ రాసిన ‘చరిత్ర పుట్టుక- లక్ష్యం ‘’గ్రంధం ఈ ద్రుష్టితో రాసిందే .క్రీ .పూ. 500 కా లాన్ని’’యాక్సిస్ టైం ‘’అంటారు .ఆ కాలానికి చాలా ప్రాధాన్యత కల్పించాడు గ్రంధం లో .ఈ కాలం లోనే ప్రపంచం లో చాలా దేశాలలో మతాచార్యులు జన్మించారని అన్నాడు .వారి సందేశాలను అవగాహన చేసి కొని ,మానవుడు తన స్తిత్వాన్ని గురించి దాని పరిమితుల గురించి జ్ఞానాన్ని సంపాదించాడు అని స్పష్టం గా చెప్పాడు కార్ల్ .
ఒక రకం గా అస్తిత్వ వాదులలో యాస్పర్స్ అతి వాదుల కంటే సమత్వ ద్రుష్టి ఉన్న వాడుగా గుర్తింపు పొందాడు .పాశ్చాత్య దేశాలలో కనిపించే పురుషార్దాలానే యాస్పర్స్ తన దర్శన శాస్త్రం లో నిక్షిప్తం చేశాడని తెలుస్తుంది .జీన్ పాల్ సాత్రే వంటి నిరీశ్వర వాదుల కంటే యాస్పర్స్ క్రైస్తవానికి దగ్గర గా ఉన్నాడు అ నే భావన కలుగుతుంది
నాజీలు అధికారం లోకి వచ్చిన తర్వాతా జ్యూయిష్ వాడు అని ఉద్యోగం ఊడ గొట్టారు జర్మనీ యూరప్ దేశాలలో పేరు పొందిన ఫిలాసఫర్ అని పించుకొన్నాడు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-10-13 ఉయ్యూరు

