మరుగున పడిన మతాలు –మతాచార్యులు -42
జాన్ స్టువార్ట్ మిల్
జాన్ స్టువార్ట్ మిల్ 1806 లో మే ఇరవై న ఇంగ్లాండ్ లో జన్మించిన బ్రిటిష్ దార్శనికుడు .అర్ధ శాస్త్ర నిపుణుడు .తండ్రి కిష్టమైన ఉపయోగ వాదాన్ని వ్యాప్తి చేయటమే ధ్యేయం గా కార్య క్రమం లోకి దిగాడు దీనికి ‘’బెంథెం ‘’సిద్ధాంతాలను కూడా అర్ధం చేసుకొన్నాడు .అనుభవ వాదాన్ని శిఖరా రోహణం చేయించిన ఘనత మిల్ కే దక్కు తుంది .రాజనీతి ,నీతి శాస్త్రాలలో లిబరలిజం అంటే ఉదార వాదాన్ని పూర్తిగా సమర్ధించాడు .

మిల్ చెప్పిన విధానాలను ‘’మెదడ్స్ ఆఫ్ మిల్ ‘’అంటారు .తన ఆదర్శాన్ని శాస్త్రం మీద కేంద్రీకరించాడు మిల్ .ప్రక్రుతి శాస్త్రం లో ఉన్న నిశ్చిత పద్ధతుల్ని సాంఘిక శాస్త్రం లో ప్రవేశ పెట్టటం కోసం చాలా కృషి చేసి సఫలీ క్రుతుడైనాడు .’’ఇండక్తివ్ ‘’అంటే వ్యాప్తి సంబంధమైన అన్వేషణ అంతా కారణాలను వెతకటం తోనే సరి పోతుందని భావించాడు .కనుక శాస్త్రీయం గా సంఘటనల మధ్య సంబంధాలను కనుగొనే పద్ధతుల్ని నిర్ణ యించట నన్నాడు .ఇందులో అయిదు పద్ధతులున్నాయని చెప్పాడు .1-cause complex (కారణ సంకీర్ణం )2-factors(అంశాలు )3-antecedents (పూర్వ రాశులు )4-consequences (ఉత్తర రాసులు )
తన భావ వ్యాప్తికి రెండు నియమాలు రూపొందిన్చుకొన్నాడు .1-సంఘటన దేనిలో కనీ పిస్తుందో అలాంటి విభిన్న ద్రుస్టాంతాలను ఒక దానితో ఒకటి పోల్చి చెప్పటం 2-అలాంటి దృష్టాంతాలను అన్ని విధాల సమానం కాని వాటితో పోల్చి చెప్పటం .ఈ రెండు ‘’ఒక సంఘటన కనీ పించి నప్పుడు ఆ సంఘటనకు కారణం మాత్రం కాదు ‘’అనేది మిల్ యొక్క ప్రాధమిక సూత్రం దీని మీదే అంతా ఆధారపడి రాశాడు .
మిల్ పద్ధతులలో 1-అంగీకార పధ్ధతి (method of agreement ). ఇందు సంఘటన యొక్క రెండు లేక ఎక్కువ దృష్టాంతాలు ఒకే పధ్ధతి ని సామాన్యం గా కలిగి ఉంటె అన్ని దృష్టాంతాలు సామాన్య పద్ధతిలో ఆ సంఘటనకు కారణం అవుతుంది .-2-భేద పధ్ధతి –సంఘటన ఏ దృష్టాంతం లో కనీ పించిందో ,దానికి ఆ సంఘటన కనబడని దానికి ఈ ఒక్కటి తప్ప మిగిలిన వన్నీ సమానం గా ఉంటె అప్పుడది ఆ సంఘటన యొక్క కార్యం ,లేక కారణం అవుతుంది
3-అంగీకార భేద సంయుక్త పధ్ధతి (joint method of agreement and difference ).ఒక సంఘటన కనీ పించే రెండు లేక ఎక్కువ ద్రుస్టాంతా లలో ఒక పరిస్తితి మాత్రమె సమానం గా ఉంటె ఆ సంఘటన కనీ పించని రెండు లేక ఎక్కువ ద్రుస్టాం తాలలో ఆ పరిస్తితి లేక పోవటం తప్ప మరేదీ సామాన్యం గా లేక పొతే ఏ పరిస్తితుల్లో ఈ రెండు ద్రుస్టాంతాల ‘’వర్గాలు’’ భేదిస్తాయో అది ఆ సంఘటన యొక్క కార్యం కాని,కారణం కాని కారణం లో ముఖ్య భాగం కాని అవుతుంది .
4-సాహచర్య పరిణామ పధ్ధతి ( method of concomitant variation ))మార్పు చెందినప్పుడ ల్లా ఒక సంఘటన ఏదో విధం గా మారుతుంటే ఆ సంఘటన రెండవ సంఘట నకు కారణం కాని కార్యం అవుతుంది .
5-అవశేషాల పధ్ధతి (method of residue )-ఏ సంఘటన అయినా యేవో కొన్ని పూర్వ రాస్షుల కార్యం అని ఇదివరకు చెప్పిన దాన్ని వ్యవకలన చేస్తుంది అప్పుడు ఆ సంఘటనలో అవశేషం మిగిలిన పూర్వ రాశుల కార్యం అవుతుంది .ఈ పద్ధతులు కొత్త విషయాలను కనీ పెట్ట టానికి పనికి వచ్చేవి కావు .ఇవి పద్ధతులు కావు నియమాలు మాత్రమె అని తేల్చారు
66 ఏళ్ళ వయసులో 1873 మే ఎనిమిది లో స్టువార్ట్ మిల్ మరణించాడు బ్రిటిష్ పార్ల మెంట్ సభ్యుడైనాడు .లిబరల్ పొలిటికల్ ఫిలాసఫీ వ్యాప్తి చేసిన వారిలో ప్రముఖుడు .మూడేళ్లకే గ్రీక్ భాష నేర్చి ఎనిమిదో ఏట ఈసప్ నీతి కధలు చదివేశాడు ఆ వయసులోనే లాటిన్ నేర్చి యూక్లిడ్ జామెట్రీ ,అల్జీ బ్రాలలో సాధికారత సాధించాడు ఆంగ్ల కవిత్వం చదవటమే కాక రాశాడు కూడా హోమర్ రాసిన ఇలియడ్ కు కొనసాగింపు కావ్యం రాసి మంచి పేరు పొందాడు .ఆగస్తీ కాంటే తో కలం స్నేహం చేశాడు అమెరికన్ అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో గౌరవ సభ్యుడ దయ్యాడు రిప్రేసేన్తతివ్ ప్రభుత్వానికి ప్రోపోర్శనల్ రిప్రేసేన్తెషణ్ కు అనుకూలుడు బెర్ట్రాండ్ రసెల్ కు ఫిలాసఫీలో ‘’గాడ్ ఫాదర్ ‘’మహిళా హక్కుల కోసం బానిసత్వ విమోచన కోసం కృషి చేశాడు .’’ఫెమినిస్ట్ ఫిలాసఫీ ‘’ రాశాడు ‘’దాదాపు నలభై పుస్తకాలాను వైవిధ్య భరితం గా రాసిన ఘనా పాఠి జాన్ స్టువార్ట్ మిల్
సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-13- ఉయ్యూరు

