మరుగున పడిన మతాలు –మతాచార్యులు -43
మిత్ర మతం
మిత్ర మతం క్రీస్తు పూర్వం లోనే ఉండి క్రీ.శ.లో కొన్ని శతాబ్దాలు బాగా వాప్తి చెంది క్షీణించి పోయింది .ఆర్య ,పర్షియన్ పురాణ కధల్లో ఉన్న శాంతి ,సత్యం ఆధారంగా ఈ మతం ఏర్పడింది .ఈ మతానికి దేవత ‘’మిత్రుడు ‘గా ఉండేవాడు తరువాత సూర్యుడు దేవతగా మారాడు మిత్రుడు అన్నా సూర్యుడు అన్నా ఒకటే .ఈ మతం లో దేవతలంతా ఆర్యులు ,పర్శియన్లె .వీరిని రోమన్లు కూడా పూజించే సంప్రదాయం వచ్చింది .భారత్ వచ్చిన ఆర్యులు ఇరానీ సంబంధాన్ని వదలక ముందే ఈమతం వ్యాప్తి లో ఉందని చరిత్రకారుల ఉవాచ .
మిత్రుడు వ్రుషభ వధ
మిత్ర దేవత మనుష్యులకు చాలా ఇష్టమైన వాడు .ఆర్యుల కాలం లో మిత్రుడు వరుణుడి తో కలిసి ఉన్నట్లు తెలుస్తోంది .ఈ దేవతలిద్దరు ఒకే స్వర్ణ రధ సారదులై ఒకే రకమైన చింతన చేసి నట్లు ఉంది .ఈ ఇద్దరు విశ్వ క్రమాన్ని ,ధర్మాన్ని సంరక్షిస్తూ ,మానవ హృదయాలకు ,కార్యాలకు సాక్షులుగా ఉంటారు .మిత్రా వరుణులనేత్రం గా.సూర్యుడు ఉన్నాడని ఈ మతం అంటుంది .ఆకాశం లో వీరు నియమిత మార్గం లో ప్రయాణం చేసే వీళ్ళ రధమే ‘’కాంతి ‘’గా భావిస్తారు .వీరిద్దరూ పాపుల ను శిక్షిస్తారని, అవసరమైతే క్షమిస్తారని విశ్వ సిస్తారు .
మిత్రా వరుణు లిద్దరూ ప్రతి రోజు మానవులను మేల్కొల్పి ,నిత్య క్రుత్యాలకోసం ప్రోత్సహిస్తారు .అనంతా శం అనబడే’’ అదితి ‘’కుమారులైన వీరు ఆదిత్యులయ్యారు అని నమ్ముతారు .వేదం లో ఉన్న మిత్రుడు ,ఇరానియన్ పురాణాల్లో ఉన్న మిత్రుడు వేరు వేరు కాదు .జోరాస్ట్రియన్ మతం లో ‘’ఆర్మజ్ద్ ‘’అంటే ఆహూర ,మజ్ద ఈయనే .ఈయనే విశ్వానికి అధిదేవత .ప్రపంచానికి మధ్య వర్తిగా వ్యవహరిస్తాడు .దుష్టశక్తి అయిన ‘’ఆహ్రిమన్ ‘’వ్యతిరేకం గా మిత్రుడు అజ్మార్డ్ టో కలిసి రోజూ పోరాడుతూనే ఉంటాడు .
చరిత్రకారుడు ప్లూటార్క్ చెప్పిన దాన్నిబట్టి క్రీ.పూ. 68లో పాంపే చక్ర వర్తి సైలీశియా నుంచి సముద్ర చోరులైన ఖైదీ లచేత ఈ మిత్ర మతం రోమ్ దేశం లో ప్రవేశించింది .రోమన్ సైనికుల ద్వారా ,వర్తకుల ద్వారా ,ప్రచారకుల ద్వారా రోమ్ లో చాలా వేగం గా విస్తరించింది .రోమన్ చక్ర వర్తులు కూడా మిత్ర పూజ చేశారు .బ్రిటన్ లో రోమన్ కేధలిక్కులు ప్రవేశించిన చోట్ల మిత్రమతం నాశనం చెందింది .ఈ మిత్ర మతం క్రీ.శ .275 నుండి క్షీణత ప్రారంభమైంది .నాల్గవ శతాబ్దం లో మిత్ర మతాన్ని నిషేధించే శారు .దానితో పూర్తిగా అణగారి పోయింది .దీనిస్థానం లో క్రైస్తవం వేరూనింది .
రోమన్ సామ్రాజ్యం లో మిత్ర నాణాలు
ఆ నాడున్న అన్ని రహస్య మతాల లాగానే ‘’ఒక దివ్య వివేకం’’ తమకు ఉందని ,మిత్రాయిజం చెబుతోంది .ఈశ్వరుని తో ఐక్యం అవటం ద్వారా మోక్షం లేక అమృతత్వం సాధించాలని మిత్రుల అభి భాషణం .మిత్ర మతం లో నైతిక ప్రమాణాలు చాలా ముఖ్యమైనవి .ఈ మతం లో ఉన్న అనేక అంశాలు దీని తర్వాతా వచ్చిన ‘’మాని ‘’అనే మతం లో ప్రవేశించాయి
మ్యూజిం లో మిత్ర విగ్రహం
మిత్ర మతం లోని సూత్రాలు చాలా రహస్యాలు కొద్ది మంది ఆన్తరంగికులకే అవి తెలుసు కనుక పునర్నిర్మాణం అసాధ్యమైంది ..మొదటి ఆంగ్లానువాద పుస్తకం ఫ్ఫ్రాంజ్ కామన్స్ రాసిన’’ texts and illustrationt illustrations monunuments of mystic mitra’’అనేది1884 -1900 మధ్య ప్రచురింప బడింది .ప్రతి మిత్ర దేవాలయం లో ముఖ్య దేవుడు మిత్ర ‘’తారోక్తని ‘’అనే పవిత్ర వ్రుషభాన్ని చంపుతున్న మూర్తి ఉంటుంది .ఈ వృషభం ఖగోళ రహస్యం గా భావిస్తారు .దీనితో బాటు ఒక సర్పం ఒక శునకం ఒక మాల కాకి కూడా విగ్రహ రూపం లో దర్శన మిస్తాయి .ఇవన్నీ నక్షత్ర గణాలకు చెందినవని అనుకొంటారు .ఒక్కొక్క దేవాలయం లో నలభై మందికే ప్రవేశం .మిత్ర శ్రేణిలో నాలుగు సోపానాలున్నాయి అందులో మూడు అందరు చేరుకో వచ్చు ఆధ్యాత్మిక ఉన్నతికివి సోపానాలు .చివరిది.కష్ట సాధ్యం .ఇందులో ఉన్న ఏడు రాంకుల క్రమం –మాల కాకి ,కన్య ,సైనికుడు ,సింహం ,పెర్సేస్ ,సూర్య వార్తాహరుడు ,తండ్రి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-13- ఉయ్యూరు









