మరుగున పడిన మతాలు –మతాచార్యులు -45
మ(మా )ని మతం (Manicheism )
మని లేక మానికేయన్ అనే పర్షియన్ మత ప్రవక్త క్రేపూ.216 -276 బోధించిన మత వ్యవస్తనే మని లేక మానికా మతం అంటారు .దీన్ని ‘’జ్ఞాన మతం ‘’అనీ పిలుస్తారు .ఈ మత సిద్ధాంతాలలో జ్ఞాన ,క్రైస్తవ బౌద్ధ ,జోరాస్ట్రియన్ మత భావనలన్నీ ఉన్నాయి .క్రీ.పూ.మూడో శతాబ్దం లో పుట్టిన ఈ మతం అనేక పశ్చిమ ,తూర్పు దేశాలలో విపరీతం గా వ్యాప్తి చెందింది .చివరికి క్రైస్తవం దీన్ని మింగేసింది .
మని అనేది గ్రీకు పేరు దీనికి లాటిన్ లో సమాన పదం మానికేయన్ .మానికేయన్ సంపన్న ఉన్నత కుటుంబం లో జన్మించాడు తండ్రి దగ్గరే విద్య నేర్చాడు .ఆనాటికి ప్రచారం లో ఉన్న మిత్ర మతాన్ని క్రైస్తవాన్ని ,పెర్షియా దేశ మతమయిన మజ్దాను కూలంక షం గా అధ్యయనం చేసి ఆకళింపు చేసుకొన్నాడు అయన ఇరవై ఏళ్ళ వయస్సు లో ఈ కొత్త్తమతాన్ని స్తాపించాడు .క్రీ.శ 241కాలపు పర్షియా రాజు షాపూర్ పట్టాభిషేకానికి ఈ మతాన్ని ప్రత్యేకం గా బోధించాడు భారత దేశం కూడా వచ్చాడని ప్రచారం లో ఉంది ..కాని బహ్రాన్ రాజు ఇతన్ని మాజ్డా మత పూజార్లకు అప్పగించాడు . బ్రతికి ఉండగానే మానికేయన్ చర్మాన్ని ఒలిచి అతి క్రూరం గా చంపేశారు వాళ్ళు
మని మతస్తులు
పదవ శతాబ్ది లో మని మతావలంబకులు
మానికేయన్ తనకు దివ్య సాక్షాత్కారం కలిగిందని ,ప్రపంచ మత ప్రవక్తలలో తానే చివరి వాడినని చెప్పుకొన్నాడు .బుద్ధుడు జోరాస్తర్ ,యేసు క్రీస్తు కూడా ప్రవక్త లే అన్నాడు తను ఈ లోకానికి ‘’శాంతి దూత ‘’గా వచ్చానని తెలియ జేశాడు .
మని మత సిద్ధాంతాలు –ఇది పూర్తిగా ద్వైత మతం .ఆయన దృష్టిలో భౌతిక నైతిక విషయాలలో భేదం లేదు ..కాంతికి ,చీకటికి మధ్య గొప్ప సంఘర్షణ ఉంది .అలాగే సంఘర్షణ పుణ్య ,పాపాల మధ్యా ఉంది .జ్ఞానం అన్నా విమోచనం అన్నా చీకటి లోంచి వెలుగుకు ప్రస్తానం .తమస్సులోనుంది వచ్చిన వాటినన్నిటిని వదిలెయ్యాలి .కాంతి లోకం నుండి వచ్చిన అన్ని విషయాలను ప్రోత్సహించి ,వాటినే అనుసరించాలి .కాంతి లోకం దేవుడి అధీనం లో ఉంది .తమోలోకానికి అధిపతి ‘’సైతాను ‘’.ఈ రెండు లోకాల మధ్యా మొదటి నుంచి సంఘర్షణ ఉంది .ఒక సారి సైతాన్ కాంతి లోకం పైకి దండెత్తినప్పుడు కాంతి దేవత మొదటి మానవుడిని సృష్టించి సైతాను తో పోరాటానికి పంపింది సైతానే శక్తి వంతుడై మనిషిని నిర్బంధించాడు .కొత్త దేవతల సహాయం తో కాంతి దేవతయే సైతానుతో పోరాడి మొదటి మానవుడిని విడి పించిందని వీరి సిద్ధాంతం .
ఒకప్పదు మని మతం లో ఉన్న సెయింట్ అగస్టీన్
1
పదమూడవ శతాబ్దం లో దొరికిన మని గ్రంధ భాగం
మొదటి మానవుడంటే ‘’ఆదాము ‘’.ఇతన్ని సైతాను లాగానే సృష్టించాడు .కాని బలమైన కాంతి రేఖ ఉన్న వాడు ఆడం కు తోడుగా సైతాన్’’ అవ్వ’’ అంటే ఈవ్ ను ఇచ్చాడట .వీరి కామం వల్లనే మానవ జాతి ఆవిర్భవించింది .రాక్షసులు కామం తో, భ్రాంతితో, ప్రలోభాలతో మానవుల్ని హింసించారు .అప్పుడు కాంతి దేవత ప్రవక్త లను భూమి మీదకు పంపి ,మానవులకు వారి స్వభావాన్ని గురించి ,ప్రకృతి గురించి సరైన జ్జ్ఞానాన్నిచ్చి విముక్తికోసం సహాయ పడతారు .
ఈ మతం లో పురోహితులు మాత్రం చాలా కఠిన మైన నియమాలను పాటించాలి .సాధారణ మానవులు అహింస ,విగ్రహారాధన ,అబద్ధం ,వ్యభిచారాలను దురాశలను వదిలితే చాలు .మని మతం ‘’ప్రోబాస్ ‘’చక్ర వర్తి కాలం లో క్రీ.శ.280 లో రోమన్ సామ్రాజ్యం లో ప్రవేశించింది .దాదాపు మూడు వందల ఏళ్ళు సువ్యవస్తితం గా నిలిచి ఉంది అక్కడ .తర్వాత వచ్చిన రోమన్ చక్ర వర్తులు మని మతానికి వ్యతి రేకం గా శాసనాలు చేశారు .మధ్య యుగం వచ్చేసరికి కొత్త దారులు చూసుకొని క్షీణించి పోయింది
మని సిద్ధాంత గ్రంధాలు చాలా ఉన్నా చివరికి కొన్ని భాగాలు మాత్రమె అదీ అనువాద రూపం లో లభించాయి చైనా దేశం లోను ఈ మతం బానే వ్యాపించింది మని సిరియానిక్ లిపి ని కానీ పెట్టాడని భావిస్తారు మన వినాయకుడు ఈ మతం లో ప్రవేశించాడు మనికేయన్ కుషాన్ సామ్రాజ్యం లో పర్యతిన్చాడని చెబుతారు పాప్ మితియాదిస్ కాలం లో ఈ మతం రోమ్ లో బాగా ఉండేది .రోమన్ చక్ర వర్తి తియోదాస్ మానికేయులను చంపేయమని క్రీ.ష.382 లో క్రైస్తవ మతాన్ని రాజ మతం గా ప్రకటించే ముందు ఆజ్ఞా జారీ చేశాడు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-13- ఉయ్యూరు





