మరుగున పడిన మతాలు –మతాచార్యులు -46
భాస్కరా చార్యులు
భాస్కరా చార్యులకే భాస్కర రాయుడు ,భాసురానందుడు అనే పేర్లున్నాయి తండ్రి గంభీర రాయ దీక్షితులు .తల్లి కోనాంబా దేవి .వీరిది మహా రాష్ట్ర దేశం .కాశీ వెళ్లి విద్య నేర్చిన భాస్కరుడు తంజావూర్ చేరి కావేరీ తీరం లో ‘’తిరువేలంగాడు ‘’లో ఉన్నాడు .అక్కడ గంగాధర వాజ పేయి అనే పండితుడి వద్ద శాస్త్రాలు నేర్చాడు .శ్రీ విద్యోపాసకులలో భాస్కరుడు ప్రసిద్ధుడు .
భాస్కరా చార్యులు బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాశాడు సేతు బంధం అనే గ్రంధం లో వామకేశ్వర తంత్రం లోని నిత్య షోడశికార్నవానికి వ్యాఖ్యానం చేశాడు పరశురామ కల్ప సూత్రం పై ‘’రత్నాలోకం ‘’అనే వ్యాఖ్యాన గ్రంధం రచించాడు .దుర్గా సప్త శతి పై ‘’గుప్త వతి ‘’అనే వ్యాఖ్యానం రాశాడు భాస్కరుడు క్రీ.శ,.తొమ్మిదో శతాబ్ది వాడని వాచస్పతిమిశ్రుడికి పూర్వం ,శంకరాచార్యుల తరువాతి వాడు అని భావిస్తారు .సూత్ర భాష్యాన్ని తొమ్మిదో శతాబ్దం మొదటి భాగం లో రచించాడని తెలుస్తోంది వాచస్పతి మిశ్రుడు భాస్కరాచార్యులను తన గ్రంధాలలో ఉదాహరించాడు .శంకరులను తీవ్రం గా విమర్శించాడు ఆచార్యుడు .
శ్రుతుల మీదా ,బ్రహ్మ సూత్రాల మీద ఇతరులు చేసిన వ్యాఖ్యానాల నన్నిటిని భాస్కరుడు ఖండించి తన ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించాడు .మహా యానం లోని శూన్య వాదమే మాయా వాదం అంటాడు భాస్కరుడు .భేదాన్ని అభేదాన్ని గుర్తించే భేదా భేద వాదాన్ని యితడు చెప్పాడు .బ్రహ్మమే ఈ విశ్వం లో పరిణమించాడని భావించాడు .ముక్తికి జ్ఞానం ,కర్మా రెండు సాధనలాలె అని గట్టిగా చెప్పాడు .. .జీవన్ముక్తిని అంగీకరించలేదు .విదేహ ముక్తినే అంగీక రించాడు .
పరిపూర్ణం ,అఖండం అయిన పరబ్రహ్మం భాస్కర మతం లో అపరిమితం ,పరిమితం ,అఖండం ఖండం కూడా అవుతుందని చెప్పాడు .ఏక ఉపాధి ఉన్న బ్రాహ్మం అనేక ఉపాధులను గ్రహించి పరిచ్చిన్నం అవుతాడని అన్నాడు .ఈ సిద్ధాంతం శంకర ,రామానుజ మతాలకు మధ్యస్తం గా ఉంది .శంకరుడు చెప్పిన మాయా వాదాన్ని విమర్శించటానికే భాస్కరుడు తన దర్శనాన్ని ఉపయోగించాడు మాయా వాదం మహా యానం లో నుంచి వచ్చింది అంటాడు అందుకని విచ్చిన్న మూలం అన్నాడు .ఈ భేదా భేద వాదమే భాస్కర మతానికి భూమిక .బ్రహ్మం నిరుపాధికం ,సోపాధికం ,.ప్రపంచం చేతనా చేతన విభాగానికి అర్హమైంది అంటాడు .బ్రహ్మకు జీవలోకం లో సంబంధం లో ఈ భేదం అనేది ఔపాదికమే .అభేదం అనేది స్వాభావిక మైంది అన్నాడు
యాదవ మతం లో బ్రహ్మకు భేదం అభేదం స్వాభావికాలే .కానీ భాస్కర మతం లో చిత్తూ ,అచిత్తురెండు బ్రహ్మం యొక్క వాస్తవిక పరిణామాలే .శంకరుడు చెప్పినట్లు మాయ యొక్క లీల కాదు .భేదం లో అభేద లక్షణం కూడా కలిసి ఉందన్నాడు ఆచార్య భాస్కరుడు .దీనికి ఉదాహరణతరంగాలు సముద్రం కంటే భిన్నాలే కాక అభిన్నాలు కూడా అన్నాడు .సముద్ర శక్తి నుంచే తరంగాలు పుట్టాయి .కనుక ఒకే సముద్రం దాని శక్తి వ్యక్తీకరాలు అయిన తరంగాలకంటే భిన్నం గా కన్పించినా ,శక్తికి శక్తి జనకానికి అభిన్నం .అందువల్ల ఇది భేదం కాదు అభేదం కూడా కాదని సమర్ధించాడు .మాయా వాదం లో జీవాత్మ అవిద్య తో కూడిన పరమాత్మ యొక్క ఆభాసమే .రామానుజుడు జీవాత్మను బ్రహ్మం శరీరం గ ,భావించాడు .ఈ రెండు మతాలను కాదని జీవుడికి బ్రహ్మానికి భాస్కరుడు అంశ ,అమ్శిత్వాలను కల్పించాడు .అనంత శక్తి స్వరూపుడైన బ్రహ్మం ఉపాధిని తీసుకొని ,జీవాత్మగా మారుతాడ న్నాడు . ఉపాధి స్వీకారం వల్ల బ్రహ్మం కర్మ బద్ధుడు అవుతాడు .ఈ కర్మ అంటే అంతం లేని కార్యాచరణమే .ఇదిలేక పోయినా దీనికి అంతం ఉంది జీవుడు సాదన క్రమం లో సంసారాన్ని అవగాహన చేసుకొన్నప్పుడు ఉపాధి నశిస్తుందని చెప్పాడు భాస్కరా చార్యుడు బ్రహ్మం అంటే ఏమిటో ,ఉపాధి అంటే ఏమిటో తెలుసుకోలేని జీవుడు సంసార లంపటం లో పడతాడు అని తన వేదాంతం లో భాస్కరాచార్యులు చెప్పాడు
భాస్కరా చార్యను .1554-1594 కాలం వాడైన అప్పయ్య దీక్షితులు ప్రశంషించాడు 1677-1750 వాడైన నాగోజి భట్టఅనే వ్యాకరణ పండితుని ను భాస్కరుడు తన‘’గుప్తావతి ‘’గ్రంధం లో ప్రస్తుతించాడు వీటన్నిటి వల్ల భాస్కరుడి కాలం 1670 అని తేల్చారు భాస్కరుడు సోమయజ్ఞాన్ని జ్యోతిస్తోమాన్నిచేశాడు .కాశీనుండి వచ్చి కొంతకాలం కృష్ణా నదీ తీరం లో ఉండి కావేరీ తీరానికి చేరాడు తంజావూర్ మహా రాజు కావేరి దక్షిణ తీరం లో ‘’భాస్కర రాజ నగరం ‘’అనే అగ్రహారాన్ని ఆచార్యులకు రాసిచ్చాడు
చంద్ర సేన రాజు కు ఒక నపుంసక కుమారుడు జన్మించాడని అతన్ని ఎలా అయినా పురుషుడి గా మార్చమని రాజు ఆచార్య పాదాలను ఆశ్రయించాడు ఆయన కృష్ణా నదీ తీరం లో రోజు ఆ కుర్రాడితో కలిసి సూర్య దేవుడికి ‘’త్రిచరర్ఘ్య ప్రదానం’’చేశాడు ఆయన నివాసం నదికి దూరం గా ఉంది అందుకని రోజు ఏంతో దూరం నడిచి వచ్చి అర్ఘ్యప్రదానం చేసే వాడు .కాళ్లు పుండ్లు పడ్డాయి శిష్యులు భరించలేక ఏడుస్తున్నారు .అప్పుడు ఆచార్యుడు సూర్య దేవుడిని తన శిష్యుల సంతృప్తి కోసం నదీ ప్రవాహాన్ని తన ఇంటి దగ్గరకు త్రిప్పమని ప్రార్ధించాడు భాస్కరుడు ఈ భాస్కరుని ప్రార్ధన మన్నించి కృష్ణా ప్రవాహ దిశను ఇంటికి దగ్గరగా వచ్చేట్లు చేశాడు దానితో ఆ నీటి ప్రవాహం లో తడిసిన రాజు కొడుకు నపుంసకత్వం నశించి పురుష రూపం వచ్చిందట . ఇవీ భాస్కర మహిమలు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-10-13- ఉయ్యూరు

