మరుగున పడిన మతాలు –మతాచార్యులు -49
కబీర్
భక్త కవి కబీర్ శ్రేష్ట సత్పురుషుడు ..తలిదంద్రులెవరో తెలియదు .కాని పుట్టింది1398 లో జ్యేష్ట శుద్ధ పూర్ణిమ సోమవారం నాడు అని అంటారు . .మహమ్మదీయ దంపతులు కబీర్ ను పెంచారని అంటారు ఆయన చేనేత వ్రుత్తి కి చెందినా వాడు . .కాశి లో కబీర్ జన్మించాడు .కబీర్ అంటే ఆరబిక్ లో కబీర్అంటే గొప్ప వాడు అని అర్ధం ఇస్లాం మతం లో 37 వ దేవుడి పేరు కబీర్ .వివాహం చేసుకొని కొడుకును కన్నాడు రామానంద స్వామి తన గురువు అని కబీర్ అన్నాడు .గురువు ‘’రామ’’మంత్రాన్ని కబీర్ కు బోధించాడు .కబీర్ సంప్రదాయం ఆందరికీ అందుబాటులో ఉంటుంది .ఆయన భక్తులు పది లక్షలకు పైగా ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నారు ..కబీర్ బీజక్ కబీర్ గ్రంధావళి,అనురాగ సాగర్ పుస్తకాలు కబీర్ రాశాడు అవధి బోజ్పురి ,వ్రాజ్ మాండలికాలలో తత్వాలు రాశాడు సంత్ మత్ ,రాదాస్వామి గబీర్ దాస్ లపై కబీర్ ప్రభావం ఉంది .ఆయన కవితల్ని బాణీలు లేక బోధలు అంటారు రెండు పంక్తులుందే వీటిని’’ కబీర్ దోహాలు’’అంటారు . దులో కబీర్ గంభీర వేదాంత భావాలు సూటిగా మనసుకు హత్తుకోనేట్లు చెప్పటం అయన ప్రతిభకు నిదర్శనం .ఇవి ముఖతా చెప్పినవే పరంపర గా తర తరాలుగా వ్యాప్తి చెందాయి సూఫీ మతం లో మొదటి ప్రార్ధాన కబీర్ కవిత్వం తో నే ప్రారంభమవుతుంది గృహస్తుగా సంత్ గా కబీర్ సమర్ధ జీవితాన్ని గడిపాడు .కబీర్ భగత్ ను సిక్కుల అయిదవ మతగురువు అర్జున్ సిక్కు మత గ్రంధం గ్రంధ సాహేబ్ లోచేర్పించాడు ..కబీర్ 1518 లో నూట ఇరవై ఏళ్ళు జీవించి మఘార్ లో మరణించాడు
వారణాసి లో మగ్గం నేస్తున్న కబీర్ చిత్రపటం కబీర్ పోస్టల్ స్టాంప్ -1952
కబీర్ పరమాత్మను అన్ని నామాలతో భజించిన మహా భక్త శిఖా మణి.అందులో న్రామ నామం అంటే మహా ప్రీతీ ఆయనకు అందువల్ల ముస్లిం మత పెద్దల ఆగ్రహానికి ఈర్ష్యకు గురి కావాల్సి వచ్చింది .సికందర్ లోడి భక్త కబీర్ ను చాలా బాధలు పెట్టాడని చరిత్ర చెబుతోంది .కబీర్ కు అల్లా ,విష్ణు ,కృష్ణ ,గోవింద ,ఖుదా ,రామ నామాలన్నీ నిర్గుణ పరబ్రాహ్మను సూచిన్చేమంత్రాలే నని నమ్మాడు . కబీర్ కొలిచే రాముడు వేదా తీతుడైన ,త్రిలోకాలకు విలక్షణుడైన కేవల పరమాత్మ తత్వమే .
భక్తిని పారమార్ధిక సాధనం గా కబీర్ ఎంచుకొన్నాడు .మన లని భగవంతుడి తో కలిపే హృదయం దొరకటం ఒక మహా రహస్యం అన్నాడు కబీర్ .దీనినే ఆయన’’ భావ ‘’,భేద ‘’పేర్లతో పిలిచాడు .అందుకే తన మార్గాన్ని ‘’భావ భగతి ‘’అంటే భావ భక్తి అన్నాడు .దీన్ని వర్ణించటం అసాధ్యం అన్నాడు .అదొక అనుభవైక వేద్య విధానం అని చెప్పాడు సద్గురు కటాక్షం వల్లనే ఇది సాధ్యం అన్నాడు .అప్పుడే జ్ఞాన నేత్రం వికశించి మనలో దాగి ఉన్న రహస్యం మనకు తెలుస్తుంది అంటాడు .భగవంతుని పై జిజ్ఞాస ,ఆయన ముఖ వీక్షణ అభిలాష తీవ్రం గా మనలో రగుల్కొని ఈశ్వరుడోక్కడే ఏకైక ప్రియ తముడై ,ఆయన విరహం తాళ లేనంత అయినప్పుడే భాగవత్సాక్షాత్కారం లభిస్తుందని కబీర్ చెప్పాడు .
కబీర్ చెప్పిన భావా భక్తీ కి మస్శుద్ధి ,మనస్సు యొక్క సంయమనం ,అవసరాలు .అన్ని భొతిక విషయాలు వదిలేసి చివరికి దేనిలో ప్రవేశించాలో ఆ మనస్సు ను మనం వెతుక్కోవాలి .అదే ‘’ఆకల్ నిరంజన్’’ అంటే నిరంజన బుద్ధి .అని కబీరు వర్ణించాడు .ఈ నిరంజన బుద్ధి ఎక్కడో లేదు మన మనసులోనే ఉందన్నాడు .మనసు నిర్వికారం గా ఉన్నప్పుడు అది స్వచ్చమైన అద్దం లాగా శుద్ధమైనప్పుడు అది నిరంజన బుద్ధి లో ప్రవేశిస్తుంది .అప్పుడే మన మనస్సులో రహస్యమైన శాశ్వత పర వస్తువు ప్రతి బిమ్బిస్తుంది .అదే ‘’అపా ‘’,బ్రహ్మం ‘’,రాముడు ‘’అందుకే ఈ ప్రాప్తి సాధ్యమవుతుంది దీనినే ఆ ప్రాప్తి సాధనాన్ని ‘’ఆత్మ సాధన ‘’,బ్రహ్మ విచారం ‘’రామ నామ సిద్ధి యోగం‘’అన్నాడు.
భావం అనేది షట్చక్రాల బంగారు భవనం లో ఉంది .దాని తాళం విప్పి లోపలి ప్రవేశించి నప్పుడే షట్చక్ర చేదనం జరిగి అది తెలుస్తుంది .పరం జ్యోతి సహస్రారం లో దర్శనం అయినప్పుడు ‘’హద్దు ‘’హద్దు లేనిది ‘’అవుతుంది అంటాడు కబీర్ .’’ఘట ‘’ ముందే ‘’అఘటం కనీపిస్తుంది . ఇదే అనంత బ్రహ్మ యొక్క అసంఖ్యాక సూర్య సమానం అయి ,శీతల తేజస్సు ,దాని వర్ణన కుదరదు .ఆ స్తితి ప్రాప్తించి నప్పుడు కల్పనలనేవి ఉండవు .మనస్సు పోయి ,అమనస్కత ఏర్పడుతుంది .ఈ కర్మ వల్ల కర్మ నాశనం అయి మమత్వం అభిమానాలు బ్రహ్మాగ్ని చేత భస్మం అవుతాయి .ఈ అవస్తనే కబీర్ ‘’సహజ సమాధి ‘’అన్నాడు .గురువు వల్లే ఇది లభిస్తుందని చెప్పాడు దీనికోసం ఆసనం ముద్రా ,అక్కర్లేదు .వాసనా త్యాగం మనో నిరోధం వల్ల ‘’సురటి ‘’ని అరికట్టాలి .అప్పుడే సహజ సమాధి వీలు అవుతుంది .అనాది నుండి వచ్చిన వాసనాదుల వల్ల కలిగే ప్రపంచ దృశ్యాల స్పురణమే ‘’సురటి ‘’ లేదా సంసారం .
హిందూ, మహమ్మదీయ మతాలలో ఒకే పరమ సత్యం ఉందని నమ్మి దాన్ని వ్యక్తం చేయటానికి ప్రయత్నించాడు .కబీర్ ది ఒక రకం గా ‘’అద్వైత సాక్షాత్కార వాదం‘’కబీర్ పై హఠ యోగుల ప్రభావం ఉంది.కుల భేదాలను లెక్క చేయలేదు కబీర్ .అందరికి సన్నిహితుడైన ఒకే ఈశ్వరుడి గూర్చి ప్రజలకు దేశ భాషలో బోధించైనా ప్రజా భక్త కవి కబీర్ . ..
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-13-ఉయ్యూరు

