మురుగున పడిన మతాలు –మతాచార్యులు -50 (చివరి భాగం )
రవీంద్ర నాధ టాగూర్
విశ్వకవి గా ,గీతాంజలి కర్త గా అనేక కదా, నవలా, నాటక రచయితగా శాంతి నికేతన్ సంస్తాపకుడుగా ,రవీంద్ర సంగీత కర్త గా, గాయకుడుగా,చిత్రకారుని గా రవీంద్ర నాధ‘టాగూర్ ప్రముఖ స్తానం పొందాడు .ఆయన దార్శనికుడు కూడా తండ్రి దేవేంద్ర నాద టాగూర్ కుమారుడు .కలకత్తాలో 1861 లో మే ఏడున జన్మించాడు నిత్యం ఉపనిషత్ మంత్రం ఘోష ఉన్న కుటుంబం వారిది .చిన్న నాడే వంగ దేశ వైష్ణవ భక్తీ గీతాలకు ఆకర్షితుడయ్యాడు .వివాహం అయిన తర్వాత ఇంట్లోనే పదేళ్ళ పాటు ఉన్నాడు .తోట పని వారితో ,బ్రహ్మ జ్ఞాన చింతనతో ,విశ్వ సౌభ్రాత్వపు భావనలతో ఉండి పోయాడు .ఇవే ఆయన దార్శనిక సూత్రాలకు మూలాలయ్యాయి .గీతాంజలి కవిత్వానికి1931 లో నోబెల్ పురస్కారాన్ని సాహిత్యం లో పొందిన మొదటిభారత దేశపు కవి టాగూర్ .మొదటి నాన్ యూరోపియన్ కవికూడా .బెంగాలీ చిత్ర కళను బంధాల నుండి విముక్తి చేసి స్వేచ్చా చిత్ర కల గా ఘనత టాగూర్ దే.మన జాతీయ గీతం జన గణ మన బంగ్లా దేశ గీతం ‘’సోనార్ బంగ్లా ‘’లను రాసి న వాడు రవి కవియే .ఎన్నో సాహిత్య వ్యాసాలనూ సాదికారికం గా రాశాడు అయన రాసిన” కాబూలీ వాలా ”కద, చండాలిక నాటకం ,నౌకా భంగం నవల ప్రసిద్ధి చెందాయి శరత్ టాగూర్ ను తన గురువు అన్నాడు
![]()
![]()
![]()
1900-1- కాలం లో శాంతి నికేత విద్యా సంస్థను స్తాపించి కళలను ,సాహిత్య చిత్రలేఖన నృత్యాలను బోధించాడు ఆ తర్వాత అది విశ్వ భారతి గా రూపు దాల్చింది .ఇప్పుడువిశ్వ విద్యాలయమై కేంద్ర ప్రభుత్వ అధీనం లో నడుస్తోంది .సాధన ,,క్రియేటివ్ యూనిటి ,మానవత్వం వ్యక్తిత్వం లను రవీంద్రుడు ఆధారం గా చేసుకొని దర్శన భావాలను వ్యాప్తి చేశాడు .కవిత్వానికి దార్శనిక సూత్రాలకు సంబంధం కల్పించాడు .
రవీంద్ర మతం వైష్ణవ వేదాంతానికి దగ్గరలో ఉంటుంది .పరమార్ధం పురుష రూపం లో ఉంది అదే మానవ కృత దైవం .అదియే పురుషోత్తముడు ‘’నిరవధికం అవదీక్రుతం అయితే పరమార్ధం పురుషార్ధం అవుతుందని టాగూర్ చెప్పాడు .సృష్టి కార్యోన్ముఖం అయితే పురుషార్ధం పురుషం అవుతుందని అన్నాడు .అమూర్తాన్ని కేవలం అంటే ఆబ్సల్యూట్ ను కాదన లేదు .పురుష విధానం లో ఆలోచించి నప్పుడే కేవలం మానవ బోధకు అందుతుంది అన్నాడు టాగూర్ .
![]()
![]()
అద్వైతాన్ని అంగీకరించి, దేవుడొక్కడే అన్నాడు .సావధిక సత్తా నిరవదిక సత్తా పేక్షం అవుతుంది .కేవలం తో ఏక మవటమే సావదికాత్మ యొక్క పరమ లక్ష్యం అంటాడు .టాగూర్ చెప్పిన ఐక్యతకు శంకరుడు చెప్పిన అద్వైత ఐక్యతకు భేదం ఉంది .జీవాత్మ తనకు తాను నిరవ శేషంగా పరమాత్మకు అర్పించుకోవటమే టాగూర్ చెప్పిన ఐక్యత .అహం లేక పోతే ప్రేమ ఎలా ?ఇదొక్కటే ఉంటె ప్రేమ యెట్లా సాధ్యం ?అని సాధన లో వివరించాడు ఆత్మ అన్నిటి కంటే ఎక్కువ ప్రేమాస్పదమైంది .ఆత్మ స్వరూపాన్నే సర్వ ప్రేమాస్పదం గా ఉపాశించేది .ఈ ప్రేమ బాహ్యమైంది ,మరణ శీల మైంది అన్న బృహదారన్యకానికి ఆనందానికి ,ప్రేమకు వ్యాఖ్యానాన్ని కల్పించి జ్ఞానం కంటే ప్రేమయే బ్రహ్మ ప్రాప్తికి సాధకం అవుతుందని రవీంద్రుడు వివరించాడు .’’సాపరాను రిక్త రీశ్వ రే ‘’అనే శాండిల్య మహర్షి సూత్రర్ధాన్ని అనుసరించి ఈశ్వరుని పై ఉన్న పరమ ప్రేమయే భక్తీ అని చెప్పాడు .అలాంటి భక్తీ అహేతుక ,వ్యవహితమూ అయినప్పుడు ప్రేమ అవుతుంది అని గట్టిగా చెప్పాడు .ప్రేమ ,భక్తీ అనర్దాన్తరాలు .జ్ఞానం విషయి విషయ తేడాను పాటిస్తుంది .ఈ తేడా లేక పోతే జ్ఞానం రావటం అసంభవం అన్నాడు విశ్వ కవి .ప్రేమ లక్ష్యం ఐక్యత .ఇందులో విషయి విషయ వ్యత్యాసం అంత రించి పోతుంది .కాని ప్రేమ జ్ఞానం తో పొందేది కాదు అన్నాడు
.![]()
![]()
వాల్మీకి నాటక భాగం”నీస్” ఇందిరా దేవి తో టాగూర్
ఈశ్వరుని తెలుసుకోవాలంటే ఆనందమే ,ప్రేమయే మార్గాలు .ఆనందం జ్ఞానం యొక్క స్పూర్తి అంటాడు .బుద్ధి మనల్ని జ్ఞేయ విషయాలనుండి వేరు చేస్తున్దన్నాడు .ప్రేమ విషయాన్ని ఏకీకరణం వల్లనే తెలుసుకో గలం .అలాంటి జ్ఞానం అపరోక్షం .అనుమానానికి చోటు ఇవ్వదు .అని ప్రేమ రహస్యాన్ని సంపూర్ణం గా ఆవిష్కరించాడు విశ్వకవి రవికవి జ్ఞాని టాగూర్ .
ర్![]()
![]()
టాగూర్ చిత్రాలు
‘’మరుగున పడిన మతాలు –మతా చార్యులు ‘’సమాప్తం ..
ఈ ధారా వాహిక కు కావలసిన ముఖ్య విషయాలన్నిటిని ‘’వీకీ పీడియా ‘’నుండి’’ విజ్ఞాన సర్వస్వం’’ నుండి గ్రహించానని సవినయం గా మనవి చేస్తున్నాను .మొదటి ఎపిసోడ్ లో చెప్పినట్లు నేను అందించింది ఆవగింజంత మాత్రమె .దీన్ని ఆధారం గా ఆ మహనీయులను గుర్తు చేయటానికి మాత్రమె. కావలసిన వారు ఇంకా లోతుగా తెలుసుకొంటారనే నా భావన .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-10-13- ఉయ్యూరు

