రాచకీయ ‘’ద్విప్లెట్స్’’-2
11-బుద్ధ జీవి ,సంస్కారి,సమస్యా పరిష్కారి ‘’ప్రెసిడెంట్ ప్రణబ్ ‘’
ఈ రోజు విభజన సమస్యకు అందరికి అయ్యాడు ‘’మంత్రం ప్రణవం’’
12-సమస్య సృష్టించి భగ్గున మండుతుంటే వినోదం చూస్తోంది ‘’కోర్ కమిటీ ‘’’
సానుకూల స్పందన,ముందుచూపులేని చెవిటి మూగా అయిన ’’ దగా కోర్ కమిటీ ‘’
13- బెయిలిప్పించి బయటికి తెస్తే బెదిరించి పేలుస్తున్న’’ గన్ అయ్యాడు జగన్ ‘’
కుక్కుకున్న కోట్లే మయ్యాయోమరిచేట్లు చోద్యం చూపిస్తున్ననాటకం ‘’మాయా జగన్’’
14- తెల్ల లుంగీ లాల్చీ వెనక నల్ల ఆలోచనల ‘’చిదంబరం ‘’
ఆంతర్యం అంతు బట్టనిరహస్యం అయింది ‘’చిదంబర ‘’
15-పదవి ఉన్నా దానికో విలువుందని మర్చిన ‘’మన్ మోహన్ ‘ ‘
స్కాములు కుంభకోణాలు ,అవినీతి తో అయ్యాడు ‘’మసిమోహన్ ‘’
16-దేశం కాని దేశం వనిత ఇక్కడ చక్రం తిప్పే ‘’సోనియా ‘’
ఈ దేశ చరిత్రే తెలుసుకోలేని కబోది ని చేసింది ఆమె ‘’మానియా ‘’
17-అమ్మకొడుకు బంగారప్పలుకుల ,బంగారు బాతు ‘’రాహుల్ ‘’
చరిత్ర మార్చుతాడంటేనమ్మలేం పొంచి ఉందన్నాడు‘’రాహుకాల్ ‘’
18-సత్తా చూపిస్తాడట ఇప్పటిదాకా కునికిన ‘’నరసింహన్ ‘’
విభజన ప్రక్రియలో ఇప్పుడు అవుతాడేమో ‘’వీర నరసింహన్ ‘’
19-ఉండాలో వేంచేయాలో తేల్చుకోలేని ‘’రాయపాటి ‘’
ఉండి తలా తోకా లేని వాగుడు కాక ఏం’’పొడిచేశాడేమిటి ‘’?
20-కావు కావు మని పదవికోసం గావుకేకలు పెట్టి’’ కావూరి ‘’
అదిరాగానే తూ నా బొడ్డు అని వేసుకొన్నాడు’’ స్వయం ఉరి’’
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-10-13- ఉయ్యూరు
