వేయి పడగలు –రేడియో నాటకం -12వ భాగం
ఈ రోజు శని వారం ఉదయం ఎడుమ్బావుకు హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం తొలి తెలుగు జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాధ సత్యనారాయణ గారు రచించిన వేయి పడగలు నవలకు నాటకీ కరణం చేసిన పన్నేండవ భాగం విన్నాను .ముందు మాట చెప్పినవారు మన రాష్ట్రం లోని జానపద కళా రీతులను తెలుగు చదువుల స్థానం లో ఆంగ్ల భాష ప్రాచుర్యం పొందుతున్న రీతికి అంతరించి పోతున్న సంస్కృతికి ధర్మానికి ప్రతీక వేయి పడగలు అని చెప్పి దీనినొక అద్భుత రసమయ కావ్యం లా నవలా సొగసులతో తీర్చి దిద్దిన విశ్వనాధ సహస్ర ముఖ మేధో వికసనం గా అభి వర్ణించారు జన జాగృతి చేశారని చెప్పారు .
ఈ నాటి ఈ భాగం లో హరప్ప సుబ్బన్న పేట లో లో జరుగుతున్నజానపద కళా రీతుల ప్రదర్శన చూస్తాడు ,ప్రక్కనే ధర్మా రావు కూర్చుంటాడు చిన్న రాజా వారిని తండ్రిగారి అనుమతి తీసుకొని వచ్చారా అని అడుగుతాడు దానికి ఆ కుర్రాడు ఇలాంటి వాటికి అనుమతి ఎందుకని ,అయినా అనుమతి పొందే వచ్చానని ,ముందు తండ్రి వద్దని వారిన్చాడని కాదు వెళ్తాను అంటే అప్పుడు ‘’ఆమె ‘’వైపు అదోలా చాశాడని ఆమె ఇంగ్లీష్ సంగీతం లో లీనమై అదోలా చూసిందని అప్పుడు అయిష్టం గానే సరే వవెళ్ళ మన్నాడని సవివరం గా తెలియ జేస్తాడు ఇక్కడ తన తండ్రి రెండో పెళ్లి చేసుకొన్నా ఆవిడను పిన్ని అనకుండా అదేదో అసహ్యం భావం తో ‘’ఆమె ‘’అని తనకున్న అభిప్రాయాన్ని బయట పెట్టాడు .’’మీ ప్రక్కన కూర్చో వచ్చా? /’’అని ధర్మను అడిగితే ‘’అదేమిటి బాబు నా ఒళ్లో కూర్చోవలసిన వాడివి .నాకు తామ్ముడు లాంటి వాడివి ‘’అని ఆప్యాయతను వర్షిస్తే హరప్ప దానిలో తడిసి ముద్దా అయ్యాడు ఇదీ ఆరాధనా భావం అతను కళల కు చూపిస్తున్నఆసక్తికి నిదర్శనం .తండ్రి .
వారి సంభాషణ లో పాముల వాళ్ళ ప్రదర్శన ప్రసక్తి వస్తుంది పాములాడించే వాడు వివిధ రకాల పాముల్ని వాటి విషాలను గురించి కాటు వేస్తె నివారణ గురించి చాలా వివరం గా చెప్పటం చూసి వాటిని ఆడించిన తీరును చూసి సంభ్రమాశ్చర్యాలతో మునిగి పోయాడు .అప్పుడు ధర్మా రావు ‘’వాడు చెప్పిన విషయాలు ఒక రిసెర్చ్ ప్రొఫెసర్ చేసిన పరిశోధనను తల దన్నేలా ఉందని అలాంటి వాడి ప్రతిభాకు ఏ యూని వర్సిటి గుర్తించని ,తగిన ప్రోత్సాహమివ్వదనిఅతను బాధ పడ్డాడు నిజమే నంటాడు హరప్పా . ఎట్సన్ డోరా దొర మన కళల ప్రామాణ్యాన్ని ఎంతో మెచ్చాడని కూడా తెలియ జేస్తాడు
మర్నాడు ప్రహ్లాద నాటకం చూడాలని ఉందని అన్నబుల్లి రాజా వారిని తండ్రి అనుమతి తీసుకొని రమ్మని హెచ్చరించాడు .అలాగే మర్నాడు వచ్చాడు తండ్రి అంత తేలిగ్గా ఒప్పుకోలేదని ,మన సంస్థానం లోనే దాన్ని ప్రదర్శింప జేద్దామని అప్పుడు చూడచ్చు అని అన్నాడని కాని అంత దాకా ఆగలేక వచ్చానని అన్నాడు .ప్రహ్లాదుడు మహా భక్తుడని ధర్మం కోసం అసలైన చదువు కోసం అలమటించిన బాలుడని ఎన్నో బాధలు తండ్రి చేతుల్లో అనుభవించాడని అన్నిటికీ శ్రీ హరే ఉన్నాడని త్రికరణ శుద్ధిగా నమ్మాడని అలానే విష్ణువు అతన్ని కాపాడాడని చివరికి స్తంభం లో ఉన్న హరి నరసింహ రూపం లో ప్రత్యక్ష మైనట్లు నాటకం లో చూపారు .నరసింహ పాత్ర దారి హిరన్య కశిపుడిని చంపిన సన్నివేశం లో వెంటనే కొందరు వచ్చి హారతి ఇచ్చి శాంతింప జేశారు ఇలా ఎందుకు చేశారని కుతూహలం గా హరప్పా అడిగాడు దానికి ‘’ఒకప్పుడు నరసింహ పాత్రను తండ్రి హిరణ్య కశిపుడు పాత్రను కొడుకు వేశారని తండ్రిపాత్రదారి పాత్రలో లీనమై పోయి ఇనుప గోళ్ళతో నిజం గానే కొడుకు హిరణ్య క్షిపుడిని చీల్చేశాడని అప్పటి నుంచి ఈ జాగ్రత్త తీసుకొంటున్నారని చక్కని సమాధానం చెప్పి అతని లో ఉన్న కుతూహలాన్ని మెచ్చాడు
అలాగే దమయంతి రెండవ స్వయం వరం లో ఆమె వయస్సు ఎంత అని ధర్మ ను అడిగితే అతని తెలుసుకొనే కోరికను ఆహ్వానించి 34 అని చెప్పాడు . తనకు బందరు జాతీయ కళా శాలలో తెలుగు లెక్చరర్ పోస్టింగ్ వచ్చిందని చెబితే ‘’జీతం ఎంత ?/’’అని అడిగితే ‘’ముప్ఫై రూపాయలు అని చెప్పాడు .మరి తనకు ఇంగ్లీష్ ను రోజుకో గంట మాత్రమె బోధించే ఈట్సన్ దొరకు నెలకు పన్నెండు వందలు ఇస్తున్నారని బాధగా అంటాడు హరప్పా .అంటే మన చదువులు చెప్పే వారిని చాలా తేలిగ్గా చూస్తున్నారని ,పరాయి భాష చెప్పే వారిని నెత్తిన కెత్తుకొని చాల ఎక్కువ జీతం ఇస్తునారని ఆ చిన్న బుర్ర ఆలోచించ గలిగింది ఇతనే భవిష్యత్తులో దివాణాన్ని సంస్కరించ గల ఆశా దీపం అని తెలియ జేస్తాడు విశ్వనాధ
ఇట్లా ఈ భాగం లో మన జానపదకళకు కూచి పూడి నాట్యానికి నాటకానికి పెద్ద పీటవేసి వీటిని అందరు సమాదరించాల్సిన అవసరాన్ని గుర్తు చేశాడు కవి సామ్రాట్ .నాటకం లో అందరు సమర్ధ వంతం గా తమ పాత్రలను పోషించి న్యాయం చేకూర్చారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-10-13 –ఉయ్యూరు

