నా దారి తీరు -46
స్పాట్ లో సరిగమలు
రోజూ తిరగలేక పోతే బందర్లో బాలమ్మ గారింట్లో ఉండి పోయే వాడిని .వాళ్ళ హాలులో ఒక చోట నా బాగ్ పెట్టుకొని స్నానం అవీ అక్కడే చేసే వాడిని బాలమ్మ గారు నాకు ఉదయం రోజూ కాఫీ ఇచ్చేవారు .సాయంత్రం స్పాట్ నుంచి రాగానే టీ ఇచ్చ్చే వారు .ఆవిడ భర్త ‘’పీచు గారు ‘అనబడే రెంత చింతల సోమయాజులు గారు ,వారి పిల్లలు అందరు ఎంతో ఆప్యాయం గా ఉండేవారు ఎంతో మర్యాద చూపేవారు .ఉదయం రాత్రి హోటల్ లో భోజనం టిఫిన్ చేసే వాడిని .ఇంట్లో భోజనం చేయమని బల వంత పెట్టె వారు కాని సాధ్యమైనంత వరకు వారికి ఇబ్బంది కలిగించే వాడిని కాదు ‘’అన్నయ్య గారూ ‘’అని బాలమ్మ గారు పిలిచే పిలుపు లో ఎంతో ఆత్మీయత కని పించేది .పిల్లలంతా మామయ్యగారూ అని పిలుస్తూఉండే వారు ఒక రకం గా వారింట్లో సభ్యుడనై పోయాను .స్పాట్ అయి పోయినతర్వాత బందరు లడ్డు లాంటివి కొని ఇచ్చి వచ్చేవాడిని .ఎప్పుడు బందరు వెళ్ళినా నా పనులయిన్తర్వాత ఒక సారి వారింటికి వెళ్లి పలకరించి రావటం ఒక అలవాటై పోయింది .ఏంతో సంతోషించే వారు .బాలమ్మ గారు మా అబ్బాయిల పెళ్లిళ్లకు వచ్చేవారు .అలాగే నా గాడ్ ఫాదర్ అయిన ఆర్ ఎస్.కే గారిని కూడా కలిసి వచ్చేవాడిని .ఆయన ‘’జాగృతి ‘’వార పత్రికలో సినీ సమీక్ష చేశే వారు. ఆ ఒరవడి అద్భుతం గా ఉండేది .ఈ విషయం లో నేను ఆయన ఫాన్ ను .ఆయన ఆర్.ఎస్.ఎస్ ,జనససంఘ ,బి జెపి లకు చాలా సన్నిహితులు .వార్తలకోసం ధిల్లీ మొదలైన చోట్లకు వెళ్లి వార్తలు సేకరించేవారు .ఒక లోక సభ ఎన్నికలో బి జెపి కూటమి అత్యదిక సీట్లు గెలుస్తుందని రాశారు నాకున్న అవగాహనా బట్టి రావని ఆయనకు ఉత్తరం రాశా .నిజం గానే నేను చెప్పిందే నిజమైంది .అప్పుడు ఆయన ఫోన్ చేసి ‘’ప్రసాద్ గారూ !మీరే కరెక్ట్ నా అంచనాలు తప్పాయి ఐ యాం సారీ ‘’అన్నారు .‘’అదీ నిజాయితీ . అందుకే ఆయన నా ఆరాధ్యులై పోయారు
స్పాట్ లో కొన్ని చారిత్రాత్మక సంఘటనలు జరిగాయి .హెడ్ మాస్టర్స్ అసోసి ఏషన్ మీటింగ్ అరుగుతూ ఉండేది మేము హెడ్ మాస్తార్లం కాక ముందు కూడా దాని ప్రెసిడెంట్ సోమంచి రామం గారు మమ్మల్నీ రమ్మని పిలిస్తే వెళ్ళే వాళ్ళం .జరిగే తీరు తెన్నులు చూసే వాడిని .కాని అయన అందరు హెడ్ మాస్టర్లకు మీటింగ్ ఉంది అని చెప్పినా పట్టు మని పది మంది కూడా హాజరయ్యే వారు కాదు .పాపం ఆయనకు విసుగు కోపం వచ్చేది .కాని తమాయించుకొని సంఘం పరిస్తితిని మాకు వివరించి బాధ పడేవారు . మేము హెడ్ మాస్టర్లం కాదు కనుక ఏమి చెయ్యగలం ?మేము హెడ్ మాస్టర్లం అయిన తర్వాత అసోసి ఏషన్ ను బలోపేతం చెయ్యాలని చాలా ఆలోచించాం మేము హెడ్ లం అయిన కొత్తలో రామం గారు రిటైర్ అయి నాలుగైదు మంది సంఘానికి ప్రేసిడెంట్లు వచ్చారు కాని ఎవరూ నిలబడలేదు .ఆరు నెలలో మూడు నెలలో ఉండి తప్పుకొనే వారు సంఘం మరీ కుదేలయి పోయింది .అప్పుడు ఒక సారి నా దగ్గర అసిస్టంట్ గా స్పాట్ లో ఇంగ్లీష్ పేపర్లు దిద్దిన ఆదినారాయణ ,పెదముత్తేవి హెడ్ మాస్టర్ నేను అలోచించి ఏమైనా సంఘానికి గొప్ప స్తానం కల్పించాలని అనుకొన్నాము అతను చురుకైన వాడు .అప్పుడు పటమట హైస్కూల్ హెడ్ మిస్త్రేస్ ప్రామీలా రాణి గారితో కూడా చర్చించాం ఆవిడా సరే అంది .రామం గారితో మాట్లాడాం దీనికి మొత్తం బాధ్యత తీసుకొన్నది నేనూ ఆదినారాయాణనే.మిగిలిన వారందరికీ చెప్పాం అందరు మంచి అసోసియేషన్ ఏర్పడాలనే భావించారు . నా ఆలోచన ప్రకారం ప్రమీలా రాణి ప్రెసిడెంట్ గా ,ఆదినారాయణ కార్య దర్శి గా సంఘం ఏర్పడాలని అందర్నీ ఒప్పించాం .
అందరం ఒక రోజు సాయంత్రం స్పాట్ అయిన తర్వాత అందరిని హాజరయ్యేట్లు చేసి ఉండిపోయేట్లు చేశాం అందరు ఉన్న్నారు ఇదే మొదటి సక్సెస్ అను కొన్నాం.నా ప్రపోసల్ ను అందరికి చెప్పాను అందరు ఏక గ్రీవం గా దాన్ని ఎండార్స్ చేశారు అంతే రామం గారు సభాధ్యక్షుడి గా వీరిని ఎంనుకోన్నాం నన్ను ఉపాధ్యక్షుడిని చేశారు కార్య వర్గాన్ని ఉత్సాహ వం తులతో వారి అనుమతి పై తీసుకొన్నాం .అప్పుడు డి.యి ఓ .గారు నూకల శ్రీరామమూర్తి గారు .ఏంతో సాదు స్వభావులు .మంచి చేయాలనుకొనే వారు సమర్ధుడైన పరిపాలకుడు గా పేరు పొందారు అంతకు ముందు ఒక సారి ఈ జిల్లాలో గజెటెడ్ ఇన్స్పెక్టర్ గా పరిషత్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా అద్భుతమైన రికార్డ్ తో పని చేశారు ఆయన వెంటనే దీన్ని సమర్ధించారు .
అప్పుడు కామన్ ఎక్సామినేషన్ బోర్డ్ సేక్రేటరి గా బేజ వాడ హిందూ హైస్కూల్ హెడ్ మాస్టర్ నరసింహా రావు గారున్దేవాడు అది ప్రైవేట్ హైస్కూల్ .ఆయన టెస్ట్ పేపర్లు ,క్వార్టర్లీ ,హాఫ్ యియర్లీ, యాన్యువల్ పేపర్లను ముందే లీకయెట్లు అమ్మి సొమ్ము చేసుకొనే వాడు .మా అందరికి చాలా అసహ్యం గా ఉంది .అంతే కాదు జిల్లా పరిషత్ స్కూళ్ళు ఎక్కువ జిల్లాలో .అందుకని వీరి వల్ల ఆదాయం కూడా కూడా ఎక్కువ .అందుకని జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్ సెక్రటరి షిప్ రావాలని మేమందరం అనుకొనే వాళ్ళం నూకల వారు రావటం వాళ్ళ ఇది సులు వైంది వారికీ ఈ విషయం చెప్పాం .ఆయన నవ్వి సరే చూద్దాం అన్నారు ఇది తెలిసిన నరసింహా రావు గారు ఒకసారి నా దగ్గరకొచ్చి తనకే ఆ పదవి కావాలని చాలా బల వంత పెట్టాడు ఎవరికి చెప్పినా ఒప్పుకోలేదు అందరూ దుర్గా ప్రసాద్ ను ఒప్పిస్తే మాకేం అభ్యంతరం లేదు అని తప్పించుకొన్నారు .నేను ససేమిరా అ న్నాను .నాకు ఆది నారాయణ సపోర్ట్ .నూకల వారు స్పాట్ అయి పోగానే వేసవి సెలలవలలో తన కున్న పవర్ ఆధారం గా ప్రమీలా రాణి గారిని సి.యి.బోర్డ్ సెక్రెటరి గా నియమించి కార్య వర్గాన్ని ఆమెనే వేయమన్నారు ఆమె తనకు తెలిసిన మా తో సంప్రదించి మంచి వారిని ఏర్పరచుకోంది హెడ్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ,దీనికి సెక్రటరి కూడా అవటం వాళ్ళ ఏంతో సౌలభ్యం ఏర్పడింది మేము అనుకొన్న వన్నీ సాధించుకో గలిగాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-10-13- ఉయ్యూరు

