విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -3
బ్రహ్మ గుప్తుడు
”గణక చక్ర వర్తిచూడామణి ”అని బిరుదు పొందిన బ్రహ్మ గుప్తుడు గుజరాత్ లో భిల్లమాల గ్రామం లో 598 లో జన్మించాడు .ఆర్యభట్టు రాసినఖగోళ శాస్త్రం లోని గణిత విషయాలన్నీ క్షున్నం గా పరిశోధించాడు . శూన్యం అంటే సున్నా ను,అనంతం అంటే ఇంఫినిటి మొదట కనీ పెట్టాడు .భౌతికం గా ఇవి లేక పోయినా మానసికం గా వీటిని సృష్టించాడు .సున్నాను ఏ సంఖ్యతో హెచ్చిన్చినా సున్నా ఏ వస్తుందని ,ఏదైనా ఒక సంఖ్యను సున్నా తో భాగిస్తే అనంతం వస్తుందని తెలిపాడు .దీనికే” ఖహారం ”అన్నాడు .దీన్ని ఈయన తరువాతి వాడైన భాస్కరా చార్య ఒక శ్లోకం లో నిబద్దం చేశాడు .”వాదా దౌవియత్ ఖం ఖేన దాతే -ఖహారో భవేత్ ఖేన భక్తస్చ రాశిహ్ ”
బ్రహ్మ గుప్తుని ప్రతిభ ను గుర్తించిన వ్యాఘ్రముఖ మహారాజు తన ఆస్థానానికి ఆహ్వానించి ,సన్మానించి ఆస్స్తాన పండిత గౌరవాన్ని కల్పించాడు .అప్పటిదాకా జీవనానికి చాలా ఇబ్బంది పడ్డ బ్రహ్మ గుప్తునికి పరిశోధనకు మహదవకాశం లభించింది .అంక గణితాన్ని బీజ గణితాన్ని మొదటి సారిగా రెండు ప్రత్యక విభాగాలుగా గుర్తించిన ఘనత కూడా ఈయనదే .ఈయన శిష్యుడు భాస్కరాచార్య గురువును సత్కరించి ”గణక చక్ర వర్తి చూడామణి ”బిరుదు ను ఇచ్చాడు .
Brahmagupta’s theorem
Brahmagupta continues,
12.23. The square-root of the sum of the two products of the sides and opposite sides of a non-unequal quadrilateral is the diagonal. The square of the diagonal is diminished by the square of half the sum of the base and the top; the square-root is the perpendicular [altitudes].[11]
So, in a “non-unequal” cyclic quadrilateral (that is, an isosceles trapezoid), the length of each diagonal is
.
He continues to give formulas for the lengths and areas of geometric figures, such as the circumradius of an isosceles trapezoid and a scalene quadrilateral, and the lengths of diagonals in a scalene cyclic quadrilateral. This leads up to Brahmagupta’s famous theorem
గణితం లో ప్రత్యెక విభాగం అయిన ”న్యూమరికల్ ఎనాలిసిస్ ”అని పిలవా బడే ”అంక గణిత విశ్లేషణ ”చేసిన మొదటి వాడు కూడా బ్రహ్మ దత్తుడే .సున్నా వినియోగం లో ఉపయోగించే సూత్రాలను నిబద్దం చేసిన ఘనత ఈయనదే .అప్పటివరకు అందరుకష్ట సాధ్యం అని భావించిన ax2_+1==y2అనే సమీకరణాన్ని సాధించింది బ్రహ్మ గుప్తుడే అంటే గణితానికి బ్రహ్మ లా అన్నీ సృస్తిన్చాడన్నమాట .
బ్రహ్మ దత్తుడు తన 30వ ఏట ”బ్రహ్మ స్పుట సిద్ధాంతం ”అనే గ్రంధాన్ని రాశాడు .మొదటి సారి ఈయన కనీ పెట్టిన ”దశాంశ పద్ధతి ”క్రమం గా అన్ని దేశాలకు వ్యాపించింది .ఈ పుస్తకం ప్రపంచ గణిత శాస్త్రానికే కొత్త ద్వారాలు తెరిచింది .పాశ్చాత్య దేశాల అంకెల కంటే బ్రహ్మ గుప్తుని అంకెల విధానం శాస్త్రీయం గా ఉందని ప్రపంచం,ప్రపంచ గణిత మేధావులు మెచ్చుకొన్నారు .తన రెండవ పుస్తకం ”కరణ ఖండ ఖడ్యక”
లోను గణిత శాస్త్రానికే ప్రాధాన్యత నిచ్చాడు అంకగణిత ,బీజ గణిత మొదలైన విభాగాలపై ప్రాధమిక సిద్ధాంతాలు ఇందులో చేశాడు .
”ax +b==0,ax2+bx+c==0”మొదలైన సమీకరణాలను పరిష్కరించాడు
ఖగోళ శాస్త్ర అధ్యయనం లో ,పరిశోధనలో ఆల్జీబ్రా ను మొదట ఉపయోగించిన వాడుకూడా బ్రహ్మ గుప్తుడే రెండవ గ్రంధం లో ఖగోళ గణితం విపరీతం గా ఉంది .అనేక కొత్త విషయాలు జోడించాడు .బ్రహ్మ స్పుట సిద్ధాంత గ్రంధం దేశ విదేశాలలో మంచి పేరుతెచ్చుకోంది.ఇందులో ”శ్రేడులు(సర్డ్స్)జ్యామితి అనేక నిరర్దారిత సమీకరణ సాధనా ,వర్గ సమీకరణ సాధన మొదలైన విఅతి సులభ విధానం లో ఉన్నాయి .బ్రహ్మ గుప్తుడు కనీ పెట్టిన సున్నాను ఆరబిక్ భాషలో సిఫర్ అంటే ,గ్రీకులోజిఫర్ అన్నారు అదే ఇంగ్లీష్ లో” జీరో’అయింది .’భాస్కరుడికి ముందే బ్రహ్మ స్పుట సిద్ధాంతం చాలా దేశాల్లో ప్రచారమైంది
క్రీ.శ770లో ఉజ్జయిని లోని ప్రముఖ గణిత పండితుడు ”కంక’భట్టు ”ను బాగ్దాద్ రాజ దర్బారుకు పిలిపించి ఆరబ్ పండితులకు భారతీయ అంకెల గణన పద్ధతిని నేర్పాడు .అప్పుడే బ్రహ్మ స్పుట సిద్ధాంత గ్రంధం అరబిక్ భాషలోకి తర్జుమా అయింది ఇలాఏడవ శతాబ్ది పూర్వార్ధం లోనే భారతీయ అంకెలు ,సంఖ్యామానం సిరియా అరేబియా ,ఈజిప్ట్ ,క్రమంగా పాశ్చాత్య దేశాలకు వ్యాపించింది .అరేబియా నుంచి వచ్చిన అంకెలు కనుక పాశ్చాత్యులు ”ఆరబిక్ అంకెలు ”అన్నారు కాని ఆరబ్బులు మాత్రం ”హిందూ అంకెల విధానం ”(ఆల్ ఆర్కాన్ ఆల్ హింద్”గా పిలుస్తారు .
సున్నా కు ఏ సంఖ్యను కలిపినా ఏసంఖ్య నుండి సున్నాను తీసివేసినా ఏ మార్పు ఉండదు అని సూత్రీకరించాడు బ్రహ్మ దత్తుడు. మొదట్లో బ్రహ్మ దత్తుడు ఏ సంఖ్యనైనా సున్నా తో భాగిస్తే సున్నా ఏ వస్తుందని పొరబడి చెప్పాడు .కాని అనంతం వస్తుందని తర్క శాస్త్ర నిబద్ధత తో పేర్కొనటం జరిగింది” పై ”.విలువ10 యొక్క వర్గ మూలం గా నిర్ణయించాడు .ఫస్ట్అండ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్స్ సాధించాడు .”ఫ్రస్టం ఆఫ్ పిరమిడ్ ”కు ఖచ్చిత విలువ కనీ పెట్టాడు .బీజ గణితం లో సంఖ్యలకు సంబంధించిన విషయాన్ని తెలుపుతూ వర్గ సమీకరణణాలను అందించాడు .
కరణ ఖండ ఖడ్యక ”గ్రంధం లో బ్రహ్మ గుప్తుడు ఆర్య భట సిద్ధాంతాలను గాఢంగా అధ్యయనం చేసి చాలా విషయాలు చెప్పాడు .భూమి గుండ్రం గా ఉందని భూమి స్తిరం గా ఉండక గమనం కలిగి ఉందని ఆర్య భట్టు కూడా చెప్పాడు .గురుత్వాకర్షణ గురించి విపుల చర్చ చేశాడు .భూమికి ఆకర్షణ ఉందన్నాడు .నీటికి ప్రవహించటం ఎలా సహజమో అలాగే భూమికి ప్రక్రుతి లోని అన్నిటిని ఆకర్షిస్తుందని వివరించాడు .ఇది ప్రకృతి సిద్ధం గా భూమికి ఉన్న విశిష్ట గుణం అన్నాడు .ఈయన వాడిన” స్పుట” అన్న మాటకు పూర్వం ఉన్న అంశాలను సరి చేయటం అని అర్ధం చెప్పుకొన్నాడు .జీవితం లో చివరి భాగం లో 645లో కరణ ఖండ ఖాడ్యరాశాడు 648 లో బ్రహ్మ గుప్తుడు బ్రహ్మైక్యం పొందాడు .
ప్రొఫెసర్ ”వాలెస్ ”అనే చారిత్రిక పరిశోధకుడు భారతీయుల గణిత ,ఖగోళ విషయాలు చాలా నిర్డుస్ట మైనవిఅనీ ,జ్యామెట్రీ , సూత్రాల నాదరం గా ఖగోళ రహస్యాలు సాధించారని ఇదంతా క్రీ .పూ 3,000. సంవత్సరాలకు ముందే సాధించిన భారతీయ విజ్ఞానం అని మెచ్చుకొన్నాడుజ్యామెట్రీ అనేది ఇండియా లోనే పుట్టిందని ఇది పాశ్చాత్య దేశాల వారి ద్రుష్టి సోకని ఎంతో ముందు కాలం లోనే జన్మించిందని ఎన్నో ”ఎలిమెంటరి ప్రపోజిషన్లు” భారత దేశం నుండే గ్రీసుకు వ్యాపించాయని భారతీయ విజ్ఞులైనప్రాచీన శాస్త్రజ్ఞులను ఆరాధనా భావం తో మెచ్చుకొన్నాడు వాలెస్ . .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-10-13-ఉయ్యూరు

