ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -50
20- వ శతాబ్దపు ఫ్రెంచ్ మహా శిల్పి –అగస్టీ రోడిన్ -2
మానవ శరీరం సర్వం సుందరమే
వాల్ట్ విట్మన్ మహాకవి కి లాగానే రోడిన్ కు కూడా మానవ శరీర భాగాలలో అందంగా ఉండనిది ఏదీ లేదనే భావం ఉంది .జీవితం లోని అతి సూక్ష్మ విషయాల పరిశీలన కూడా అవసరం అనేవాడు .రోడిన్ కు సెక్రెటరి గా పని చేసిన రైనర్ మారియా రిల్కే ‘’Rodin grasped life in its smallest details –he observed it and it followed him –he awaited it at the cross roads where it lingered ,he over took it as it ran before him –he found it in all places equally great ,equally powerful ,and over whelming ‘’అని అతని తత్వాన్ని బాగా అధ్యయనం చేసి చెప్పాడు .రోడిన్ శరీరం అనేక పరీక్షలకు లోనైంది .ఎడారులు అందులో ప్రాకాశించాయి .ఆకలి దాన్ని బాధగా చూపింది .దప్పిక కూడా వదలలేదు .ఇవన్నీ తట్టుకొని నిలబడి గట్టి వాడయ్యాడు .అతను వంగితే పటకార లాగా కనిపిస్తాడు. నడుస్తుంటే ప్రపంచ దూరాలన్నీ అతని తోనే ఉన్నాయని పిస్తుంది .అతని అడుగు బలంగా ద్రుఢం గా పడేది .అటూ ఇటూ ఊగుతుంటే అతనిబాహువులు అతని అడుగులను గురించి మాట్లాడుతున్నట్లుండేది .గాలిలో తేలిపోయినట్లు నడిచేవాడు .
మార్బుల్ మాస్టర్
కళలో ఎదుగుతున్న కొద్దీ రోడిన్ సున్నితత్వాన్ని శిల్పాలలో తెచ్చాడు .ఇ౦ ప్రెషనిస్ట్ చిత్రకారుడు గా అనిపించేవాడు .అతని తీరును నిశితంగా పరిశీలించిన అమెరికా విమర్శకుడు జేమ్స్ హన్కర్ ‘’the edges of certain parts were amplified ,deformed ,and falsified to ensure the undulating appearance of life ‘’అని చెప్పాడు .అతని ఆలోచన అస్పష్టం అనిపిస్తుంది .శిల్పం లో ఒక ధ్యాన యోగం ఉంటుంది. అదే అతని గొప్ప చిత్ర నిర్మాణ విధానం .అతనికి పాలరాయి అంటే మార్బుల్ అంటే మహా ఇష్టం. ఆ ఇష్టమే అతడిని శిల్ప నిర్మాణం లో పరాకాష్టకు చేర్చింది .అతను రూపొందించిన శిల్పాల శిరస్సులు , శరీర భాగాలు పుష్ప సౌందర్యాన్ని సున్నితత్వాన్ని గుర్తుకు తెచ్చి మార్బుల్ అతని చేతిలో మట్టి, మైనం అయి అనేక రూపాలు దాల్చి౦దే మోనని పిస్తుంది .అంత లావణ్యం గా రోడిన్ శిల్పాలుంటాయి .
శిలా మహా కావ్యం
నలభై ఏళ్ళ వయసులో రోడిన్ పొట్టిగా ఉన్నా ఆకర్షణీయంగా ఉండేవాడు .అతని గడ్డం మాత్రం భలే తమాషాగా ఉండేది .అది నెరసిన తర్వాత ఓల్డ్ టెస్ట్ మెంట్ ప్రాఫెట్ లాగా కనిపించేవాడు .ఇంకా బాగా చెప్పాలంటే ‘’గాలిక్ హాన్స్ సాచ్’’ లా ఉండేవాడు .అద్భుత కళాఖండాలు సృష్టించాలని భావించాడు రోడిన్ .అందుకోసం మొదట ‘’గేట్ ఆఫ్ హెల్ ‘’అనే భారీ ప్రాజెక్ట్ తీసుకొని ఇరవై ఏళ్ళు దానిపైనే పని చేశాడు .ఆ శిల్పం లోని సౌందర్యాన్ని ఆస్వాది౦చనవారు దాన్ని ‘’ఎపిక్ ఇన్ స్టోన్ ‘’అన్నారు .అంటే ‘’శిలా మహాకావ్యం’’ అని వేనోళ్ళ కీర్తించారు .డాంటే కలగన్న అన్ని భావాలకు ఈ శిల్పం ప్రతీకగా ఉందని మెచ్చుకొన్నారు .విషయ స్పృహ లో నుంచి అలౌకిక స్పృహకు దారి తీసింది ఆ శిల్ప చాతుర్యం .దీని తర్వాత అనేక అద్భుత శిల్ప రచన చేశాడు రోడిన్ .అందులో ‘’ఆడం అండ్ ఈవ్ ‘’,పోలో అండ్ ఫ్రాన్సిస్కా ‘’,ఉగాలినో ‘’,వరుస శిల్పాలను మిగిలినవాటిలో ముద్దు వంటివి –(కిస్ అమాంగ్ అదర్స్) అంటారు .దీనినే రోడిన్ ‘నోవాస్ ఆర్క్ ‘’అన్నాడు .కొందరు మాత్రం లాస్ట్ జడ్జి మెంట్ కు భయంకర రూపం అన్నారు .మరికొందరు మైకెలాంజిలో –మెడిసి కోసం డిజైన్ చేసి రూపొందించిన అసంపూర్తి సమాధులు అన్నారు .
త్యాగధనుల శిల్ప సృష్టి
యాభైలలో రోడిన్ కాలం బహు ఫలవంత మైన కాలం .పోర్ట్రైట్ ,కంచు విగ్రహాలు ,స్మృతి చిహ్నాలు తయారు చేయటానికి చాలా ఆర్డర్లు వచ్చాయి .నగరాలు అక్కడి హీరోల ,చారిత్రిక పురుషుల విగ్రహాలు తయారు చేసి వారికీర్తిని ఇనుమడింప చేయమని కోరాయి .అలాంటి వాటిలో నాన్సీ టౌన్ క్లాడ్ లోర్ర్రైన్ స్మృతి చిహ్నం ఒకటి .డాం విల్లర్స్ కోసం బాస్తిన్ లేపెజ్ విగ్రహం ,కలైస్ కోసం ‘’దిబర్గర్స్ ఆఫ్ కలైస్’’శిల్పించి అమోఘం అని పించుకొన్నాడు .వీళ్ళందరూ కూడా చారిత్రాత్మక మహా పురుషులే .వీరు పద్నాలుగో శతాబ్దం లో నగరం ఆకలి బారిన పడకుండా మూడవ ఎడ్వర్డ్ రాజుకు తమల్ని తాము బలి చేగా ఆత్మ త్యాగం చే సుకొన్న వీరులు ధీరులు దీరోదాత్తులు త్యాగ దనులు మహా పురుషులు .ఈ ఆరుగురిని ఒక బృందంగా ముందు శిల్పించి ఆ తర్వాత విడివిడిగా ప్రతి ఒక్కరినీ తీర్చి దిద్దాడు .వారి త్యాగాలను అజరామరం చేశాడు రోడిన్ .అందర్నీ ఒకే వరుసలో కాకుండా రెండు నాటకీయ వరుసలలో ఉంచి అందులో ప్రతి ఒక్కరూ ఒక గొప్ప ప్రదర్శనలో పాల్గొని తమ ప్రత్యేకతను ప్రదర్శిస్తూ సామూహిక౦ గా కదులుతున్నట్లు చేశాడు ఈ ప్రతిభకే అందరూ జేజేలు పలికారు .చిరస్మరణీయం చేశాడు వారి జీవితాలను రోడిన్ . శిల్ప విషయమై చెబుతూ రోడిన్ ‘’sculpture is the heart of hole and the lump .’’అన్నాడు ఈ హోల్ మరియు ల౦ప్ అనే పదాలను మొదటిసారిగా సృష్టించి,ప్రయోగాలు చేసి శాశ్వత కీర్తి పొందారు . శిల్పించి వాటి ప్రభావం ఎలాంటిదో చూపించాడు రోడిన్ .రోడిన్ సిజాన్నే లు అలౌకిక కాంతి నిర్మాణం లో అజరామరంయ్యారు .ఈ ఇద్దరు శిల్ప మేధావులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం అన్నారు విశ్లేషకులు .రాబిన్ ‘’క్యూబిక్ ట్రూత్ ‘’కు ప్రాధాన్యత నిచ్చాడు .ఇదే స్థల దేశాలకు గణిత పరమైన గౌరవం అత్యంత ఉత్కృష్టమైన సమతుల్యతః తెచ్చాయి .రోడిన్ గొప్పతనాన్ని ‘’he carved the air as well as the surface of the stone to bring out ‘’the latent heroic in every natural movement ‘’ అని గొప్పగా అభి వర్ణించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-15 -ఉయ్యూరు

