గోపాలాస్టకం
1-శ్రీయుత మైనేని గోపాల కృష్ణ
తరగని మెరుగైన సాహితీ తృష్ణ
ఆత్మీయ ఆప్యాయతల నిండు కృష్ణ
మాటల్లో మాత్రం గలగలా పారే కృష్ణ
హృదయం అతి పవిత్ర పుష్కర కృష్ణ
సహృదయత, మానవతల పోటెత్తిన కృష్ణ
సహన సంస్కారాల మెండు నిండు కృష్ణ
ఆధ్యాత్మిక వలయాలకు ఆవలి కృష్ణ ‘
2-శ్రీ గోపాల కృష్ణ మైనేని
స్నేహానికి మత్తెక్కించే ఐరేని
అందరి శాంతి సౌఖ్యాలు కోరుకొనే శాంత మౌని
చిరు విషయాకే స్పందించే చైతన్య వని
హృదయం విజ్ఞానం నిండి ఉన్న గని
మస్తిష్కం నిండా పుస్తకాలున్న మణి
బాధిత పీడిత జనుల చింతామణి
మంచి కోసం మనిషికోసం నినదించే సువాణి .
౩-శ్రీ కృష్ణ మైనేని గోపాల
ఆర్తుల పాలిటి కృష్ణ గోపాల
బంధువుల కు గోపికా లోల
హిత సన్నిహితులకు కృష్ణ కుచేల
గురువులకు సాందీపాశ్రమశిష్య హేల
పెద్దల యెడ అత్యంత వినయ విలోల
శ్రీ రామ శ్రీ కృష్ణ భక్తిలో పరవశ లీల
మాతా పిత నిత్య సంస్మరణలో ధన్య లోల .
4-సరసభారతి కి శ్రీ గోపాల కృష్ణ తరగని గని
గురు పూజోత్సవ నిర్వహణ సౌజన్య శీలి
అర్ధాంగి శ్రీమతి సత్యవతికి ఆదర్శ పెనిమిటి
ఆఇద్దరి దాంపత్యం లోకానికి పెన్నిధి
అమెరికాలో ఉన్నా ఆకుటుంబం
అక్కడా ,ఇక్కడా అందరికీ ఆదర్శం .
ఇంతటి సంస్కార సౌజన్యాల కలయిక
పరిచయం ఉన్న మనందరికీ అష్ట సిద్ధుల వరం .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-6-15-ఉయ్యూరు
నమస్తే గోపాల్జీ -టాప్ లేపే లాప్ టాప్ తో జ్ఞాపికలతోపుష్పహారం ,నగదు బహుమతి లమీ దంపతుల అభిమాన వర్షం తో బాటు ,పూజ్యులు శ్రీ మీబావ గారి చేత ఈ డెబ్బై ఆరేళ్ళ కుర్రాడికి అభినందన ఆశీస్సుల కవితా వర్షం కురిపించి నన్ను పూర్తిగా కృతజ్ఞతా భావపు హర్షం తో తడిసి ముద్ద చేసేశారు . దీనికి ఏమిచ్చి నేను ఋణం తీర్చుకోగలను?శ్రీ శర్మగారి సౌజన్యానికి అభిమానానికి నా కృతజ్ఞతా నమస్సుమాలు. ఇది ఎన్నటికీ తీర లేని ఋణం ,అనుబంధం . అని పిస్తుంది .కాళి దాసు చెప్పిన ”జననాంతర సౌహృదయం ”గుర్తుకు వచ్చింది . ఏ పూర్వ రుణాను బంధమోఇది ? ఇంతకంటే మాటలు రావటం లేదు మాటల కంటే నిండు గుండె తో మౌనం గా ఉండటం మేలే కాని అది సభ్యత కాదు సంస్కార లోపం అవుతుందని ఈ నాలుగు మాటలు రాశాను .సదా మన అభిమాన ,అత్మీయతలు వర్ధిల్లాలని భావిస్తూ -మీ -దుర్గా ప్రసాద్

