ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -59–ఫ్రీడ్రిక్ నీషె (Friedrich Nietzsche)

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -59–ఫ్రీడ్రిక్ నీషె (Friedrich Nietzsche)

26- సాంస్కృతిక విమర్శక శిఖామణి

 

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -59–ఫ్రీడ్రిక్ నీషె (Friedrich Nietzsche)

ఫిలాసఫర్ అని అందరూ ఆయన్ను అన్నా,నీషే విశ్వవ్యాప్త దార్శనికుడు .సామాన్య మానవుని అంతం దగ్గరపడిందని చెప్పినవాడు .సూపర్మాన్ ఆవిర్భావం తప్పదన్న వాడు ,పెద్ద  అరిస్టాక్రాటిక్ గా ప్రపంచాన్ని యేలినవాడు .జీవితం అంటే అంతా చెడ్డదే అని విషాదా౦తమని నమ్మినవాడు.ఏక్షణానికి ఆక్షణం  మనిషి  హీరోగా పాత్రపోషించాలనేవాడు

జర్మనీ దేశం లో ఫ్రీడ్రిక్ వీల్ హెల్మ్ నీషే .సంప్రదాయ మతాను సరణ మధ్య తరగతికుటుంబం లోరాకేన్ లో 15-10-1844 న రాజుగారి పుట్టిన రోజు న జన్మించాడు  ఇది పర్ష్యన్ భాగం లోని సాక్సనీలో ఉంది .తండ్రి లూధరన్ పాస్టర్ కు పెద్దకొడుకు .తండ్రి రాజుగారిపేరు ఫ్రీడ్రిక్ వీల్ హెల్మ్ ను కొడుక్కి పెట్టి ఆ రోజున పెద్ద ఉపన్యాసమిచ్చాడు .ఇతని చెల్లెలే నీషే జీవిత చరిత్ర రాసిన ఎలిసబెత్ .

పుట్టిన  అయిదేళ్లకే తండ్రి చనిపోగా  కుటుంబం నామ్బర్గ్ చేరింది .ఇక్కడ అతనిజీవితం  మంచి పవిత్రులైన తల్లి అమ్మమ్మ చెల్లెలు ఇద్దరు మైడేన్లు స్త్రీల మధ్య గడిచింది.ఇతనిపూర్వీకులు సాధారణ జీవితం గడిపినవారే .కాని తాను పోలిష్ నీషా అరిస్టాక్రాటిక్  వంశానికి చెందిన వాడిని అని చెప్పుకోనేవాడు .జర్మనీ తన మాత్రుదేశామని కారణం అందులో పోలిష్ రక్తం కలిసి ఉందని చెప్పేవాడు .మధ్యవయసులో పోలుల తో పోల్చుకోనేవాడు .వీరు కేధలిక్ దేశం లో ప్రోటేస్టంట్ లుగా   జీవించారని గర్వి౦చేవాడు .

బాలమేధావి అయిన నీషే నాలుగేళ్ళకే చదవటం ,అయిదుకు రాయటం ,ఆరేళ్ళకు బీతొవెన్ స్వరాలు పాడటం చేశాడు .పదేళ్లలోపే మత కవిత్వం రాశాడు .పియానోలతో సంగీత స్వరాలు కట్టాడు .వీధిబడిలో చదవ టానికి వెళ్ళినప్పుడు నీషెను తోటిపిల్లలు ‘’లిటిల్ పాస్టర్’’అనేవారు .బైబిల్ లోని కొన్ని అధ్యాలపై చర్చ చేసేటప్పుడు అక్కడి టీచర్లకు పన్నెండేళ్ళ జీసస్ లాగా అనిపించేవాడు .తోతటిపిల్లలు శుద్ద్ధ శుంఠలని తనకు సరిజోడు కాదని భావించి స్నేహం చేసేవాడుకాదు .అతని ప్రవర్తన అందరికి ఆశ్చర్యం వింత గొలిపాయి..పద్నాలుగేళ్ళ వయసులో ఫార్టా బోర్డింగ్ స్కూల్ లో చేరి ఫైలాలజి ,వాగ్నేర్ మ్యూజుక్ లమీద  ద్రుష్టి పెట్టాడు .ఈ రండు తనని అమితంగా ప్రభావితం చేశాయి .మత గ్రంధ రచానపై ఆసక్తి పెంచుకొన్నాడు .ఆరేళ్ళ తర్వాతా బాన్ యూనివర్సిటిలో చేరి కొద్దికాలం చదివి అక్కడి కుర్రకారు విలాస జీవితాన్ని చూసి దూరంగా ఉన్నాడు .తాగుడు సిగరెట్ లకు అలవాటుపడ్డాడు .ప్రేమలో పడ్డాడు వలచాడు వలపించాడు .వ్యభిచార గృహాలను పావనం చేశాడు .తిరుగుబోతు తాగుబోతు అనిపించుకొన్నాడు .ఒక వేశ్యా గృహానికి వెళ్ళినప్పుడు అతనికి శారీరక మానసిక వికాసం కలిగింది .ఇరవై అయిదు వయసులో సుఖ వ్యాధి అంటుకొని బాగ ఏడిపించింది .త్వరలోనే దీనినుండి విముక్తి పొందాడు .

మొదటినుంచి కంటి చూపు సరిగ్గా ఉండేదికాదు .కాంతి పదేదికాదు కళ్ళకు.సూర్యకాంతిలో మసకగా తలదిమ్ముగా ఉండేది .లేత చీకటిలో బాగా పని చేయగలిగే వాడు .ఏది చేసినా కళ్ళకు శ్రమ అనిపించేది .కనుక ఒక రుషి జీవితం అలవాటు చేసుకొన్నాడు .తాగుడు స్మోకింగ్ పూర్తిగా వదిలేశాడు .పుస్తకాల లో మునిగి తేలేవాడు .ఇది తలనెప్పి తెచ్చేది .ఇరవై ఒకటవ సంవత్సరం లో లీప్జిగ్ యూని వర్సిటి కి బదిలీ అయ్యాడు .కోపెన్ హార్ ను ఆవిష్కరించాడు ..’’ది వరల్డ్ యాజ్   ఐ విల్ అండ్ ఐడియా ‘’చదివాకపూర్తిగా మారిపోయాడు .దాన్ని పదే పడదే చదివాడు .జీర్ణించుకొన్నాడు .కోపెంహార్ తనకోసమే రాసినట్లు తనతో మాట్లాడుతూ చెప్పినట్లు అనిపించింది .అతన్ని స్వయం గా దర్శించిన అనుభూతి పొందాడు .జీవితం లో మొదటి స్వానుభవం అనేక భావాలకు దారితీస్తుంది అనుకొన్నాడు .పుస్తకం చదివి ఆనందం పట్టాలేక అరిచాడు కేకలు పెట్టాడు .మనసు మనిషిని ఉత్తానానికి తీసుకు వెడుతుంది .

ఇరవై నాలుగవ ఏట వాగ్నర్ ను కలుసుకొన్నాడు .అతనిలో కోపెంహార్ ను దర్శించాడు .అతనికలల ప్రతిరూపమే వాగ్నర్ అనిపించింది .అప్పటికే ముసలివాడైన వాగ్నర్ కు శిష్యుడైనాడు .ఇద్దరూకలిసి స్విట్జెర్లాండ్ లో తిరిగారు .1867లో బెసేల్ యూని వర్సిటి లో క్లాసికల్ భాషల కు అధిపతి అయ్యాడు .నీషే రాసిన మొదటి పుస్తకాన్ని గురువు వాగ్నర్ కు అంకితమిచ్చాడు .దీనిపేరు ‘’ది బర్త్ ఆఫ్ ట్రాజేడి ఫ్రం ది స్పిరిట్ ఆఫ్ మ్యూజిక్ ‘’.నీషే వేదాంతం బాగా ప్రాచుర్యం పొందాక దీనికి ‘’హేలినిజం అండ్ పెసిమిజం ‘’అని పేరు మార్చాడు .

కోపెంహార్ సిద్ధాంతాన్ని తన సిద్ధాంతం లో పోదివాడు .’’the more knowledge the more virtue ‘’అన్నది ఆయన సిద్ధాంతం .వాగ్నర్ సంగీత రూపకాలలో పురాతన గ్రీకు ట్రాజేడీలను చూశాడు .గ్రీకు దయోనేషియాస్ సింబాలిజం కంటే గొప్ప సింబాలిజం లేదన్నాడు .క్రిష్టి యానిటి  వలన నైతిక పతనం వచ్చింది అంటాడు .ఈ భావనలతో క్రైస్తవ పెద్దలు ఎదురు తిరిగి అతని ప్రొఫెసర్ పదవి మంగళం పాడించారు .ముప్ఫై వ ఏట నీషే వ్యక్తిగా గొప్ప మార్పు చెందాడు .మనిషిలోను మార్పు వచ్చింది .అతఃను ఏ విషయం పైనా చెప్పిన మాట చివరిది అంతిమ నిర్ణయమే అయి గౌరవం పొందింది 1970ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం లో నీషే ఆరోగ్యంబాగా దెబ్బతిన్నది .ఆమ్బులన్స్ డ్యూటీ చేసేవాడు .న్యుమోనియా వచ్చింది .మత్తుమందుకు బానిసయ్యాడు .సిఫిలిస్ తగ్గిన తర్వాత ఏదో ఒక జబ్బు వెంటాడింది ‘

యూని వర్సిటి నుంచి కొద్ది పెన్షన్ వచ్చేది .దానితోనే గడిపాడు ;తిరిగాడు రాశాడు .ఒక రష్యన్ ఫిన్నిష్ అమ్మాయి తో ప్రేమలో పడ్డాడు పెళ్లి చేసుకొందామనుకొన్నాడు కాని ఆమె కాదని అంది ‘కలిసిఉందాం అన్నాడు .తనను కాదన్న వారంటే అతనికి కోపం. భరించలేక పారి పోయిన్దామే .అలాగే వాగ్నర్ తో సంబంధమూ బెడిసింది .అతను చేసిన ‘’ది రింగ్ ఆఫ్ ది నీబెలా౦గ్ ‘’గొప్ప విజయం సాధించింది .వాగ్నర్ కొత్త సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నాడను కొన్నాడు .అతనిపై ద్వేషం పెరిగింది .దీన్ని ‘’ది కేస్ ఆఫ్ వాగ్నర్ ‘’,ది త్విలైట్ ఆఫ్ ది  గాడ్స్ ‘’నీషె కాంట్రా వాగ్నర్ ‘’రచనల్లో వెళ్ళ గ్రక్కాడు .

నలభై వ ఏట ‘’అన్ టైమిలీ థాట్స్’’,హ్యూమన్ ఆల్ టూహ్యూమన్ ‘’ది డాన్ ఆఫ్ ది డే’’,ది జాయ్ ఫుల్ సైన్స్ ‘’,దస్ స్పోక్  జొరాస్ట్ర’’గ్రంధాలు రాసి ప్రచురించాడు .ఇవిబాగా ప్రసిద్ధి చెందాయి .తర్వాత ‘’బియాండ్ గుడ్ అండ్ ఈవిల్ ‘’.’’ది జీనాలజి ఆఫ్ మోరల్స్ ‘’స్వీయ చరిత్రగా ‘ఈకే హోమో ‘’రాశాడు .చనిపోయాక ప్రచురితమైన గ్రంధం ‘’ది యాంటి క్రైస్ట్అండ్  ది విల్ టు పవర్’’. దీనికి ‘’హౌ టు ఫిలాసఫైజ్ విత్ హామర్’’  అని టాగ్ తగిలించాడు .వచ్చే రెండు శతాబ్దాల చరిత్ర రాయాలను కొన్నాడు .

నీషే కి నలభై అయిదవ ఏట అకస్మాత్తుగా జబ్బు వచ్చింది .వీధిలో కూలిపోయాడు .బెసేల్ హాస్పిటల్ లో చేర్చాడు .తర్వాత జేనాలో శరణాలయం లో చేర్చారు .మెదడు దెబ్బతిన్నా ఒక ఏడాది జీవించాడు .తల్లి చెల్లి వచ్చి కనిపెట్టుకొని ఉన్నారు .వాళ్ళ ముఖాలలో విచారం  చూసి ఏడవటం దేనికి సుఖంగా లేమా అని అడిగాడు .25-8-1900లో యాభై ఆరవ ఏట నీషే మరణించాడు .నీషే చెప్పిన విల్ టు పవర్ కు ప్రేరణ పొంది  హిట్లర్ రేడవ ప్రపంచ యుద్ధం ప్రారంభించాడు .ఈ యుద్ధంవస్తుంది అని నీషే ముందే ఊహించి చెప్పాడు .’’within fifty years the governments will clash in a gigantic war for the markets of the world .”’the blond beasts ,the race of conquerors and masters ,shall rise again from the ashes of men –they shall rise in mightier  more deadly form ‘’అని చెప్పిన దార్శనికుడు నీషే ‘

రచయితగా జర్మనీ లో ఉత్తమ సృజన కర్త న్నారు .కొందరు బ్రూటల్    గా పొగరుబోతు తనంగా రాశాడు అన్నారు ‘జొరాస్ట్ర పుస్తకానికి ‘’ఏ బుక్ ఫర్ ఎవిరి వాన్ అండ్ నో వన్’’అని ఉప శీర్షిక పెట్టాడు .జీవిత చివరిభాగం లో నీషే అదృష్టం వక్రించింది .కాని చనిపోయాక మళ్ళీ ప్రాభవం పొందాడు .క్రిస్టియానిటి లోని బానిస నైతికతను ఎదిరించాడు.’’blood is the spirit of man .Of all that is written ,I love only that which is written in blood ‘’అన్నాడు నీషే .ఆధునిక యాంత్రికత మనిషిని పశువును చేస్తుందని దానిపై నియంత్రణ ఉండదని కనుక తస్మాత్ జాగ్రత అని ముందే చెప్పాడు నీషే .

స్లేవ్ మొరాలిటి శూన్యవాదానికి దారితీస్తున్దన్నాడు నీషే.బానిసపై యజమాని పెత్తనాన్ని సమర్ధించాడు  .అతని గాడ్ ఈజ్ డేడ్ లో నిరీశ్వర వాదం ఉంది .పాసివ్ నిహిలిజం ను సమర్ధించాడు A nihilist is a man who judges that the real world ought not to be, and that the world as it ought to be does not exist. According to this view, our existence (action,suffering, willing, feeling) has no meaning: this ‘in vain’ is the nihilists’ pathos—an inconsistency on the part of the nihilists.

—Friedrich Nietzsche, KSA 12:9 [60], taken from The Will to Power, section 585, translated by Walter Kaufmann

For it was Nietzsche’s historic achievement to understand more clearly than any other philosopher…not only that what purported to be appeals of objectivity were in fact expressions of suCritique of mass culture[edit]

Friedrich Nietzsche held a pessimistic view on modern society and culture. His views stand against the concept of popular culture. He believed the press and mass culture led to conformity and brought about mediocrity. Nietzsche saw a lack of progression, leading to the decline of the human species. According to Nietzsche, individuals needed to overcome this form of mass culture. He believed some people were able to become superior individuals through the use of will power. By rising above mass culture, society would produce higher and healthier human beings.

bjective will, but also the nature of the problems that this posed for philosophy.[1

 Nietzsche187a.jpg   Image result for nietzscheFriedrich Nietzsche Signature.svg

 దాదాపు ఇరవై గ్రంధాలు రాశాడు నీషే . 

 

మరో ప్రముఖునితో కలుద్దాం

       సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-7-15 ఉయ్యూరు 

Image result for nietzsche

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.