![]()
అమ్మ భాషను బ్రతికించుకుందాం —
ఆంధ్రోద్యమం నాటి నుండీ వింటున్న మాట ఇది —
ఎందరో నాయకులు తమ జీవన లక్ష్యమిదేనని చప్పట్లు కొట్టించుకున్నారు —
మరెందరో వినాయకులు సన్మానాలు బిరుదులు అందుకున్నారు —
అమ్మా నాన్నలు మమ్మీ డాడీలయ్యారు —
పాలకులం మనమే పాలితులం మనమే —
మృత భాషల ఊసులలో వున్న మన భాష —
బ్రతికి బట్టకట్టేదెపుడు —
మన తెలుగుకు పట్టం కట్టేదెపుడు —
తమిళ నాడులో తెలుగుకు తిరుక్షవరం —
కన్నడనాడులో కంటికగుపడదు కళాశాలలో —-
తెలంగాణాలో ఉర్దూ ఛాయలో తెలుగు —
ఆంధ్రలో ఆంగ్లం నీడలో తెలుగు —-
పధ్దెనిమిదికోట్ల తెలుగులంట పర భాషోప జీవులంటా —
సింగపూర్ ,జపాన్ ,చైనా, రష్యా భాషలన్నీ నేర్టుకోవాలంటా —
కర్ణుని మరణానికి కారణాలు ఎన్నోనట —
తెలుగు తల్లి కన్నీటిలిపికి అక్షర రూపం ఇదేనంటా —
ఇదే ఈ కాల వేదం — ఈ బందా నాదం!!?

