—
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
425-విశ్వవిద్యాలయం లో ‘’గీర్వాణ పాదు ‘’ను పెంచిపోషించి కాయించిన కులపతి కున్హన్ రాజా(1895-1963)
చిత్తే౦జూర్ కున్హన్ రాజా మద్రాస్ లోని అడయార్ లైబ్రరీ క్యూరేటర్ గా చాలా ఏళ్ళు పని చేశాడు .అడయార్ ఫిలసాఫికల్ సొసైటీ లో 1920లో చేరి అక్కడే ఉంటూ సంస్కృత భాషా సేవ చేశాడు .లైబ్రరీ అభివృద్ధి,గ్రంధ ప్రచురణయే ధ్యేయంగా పని చేశాడు . ప్రొఫెసర్ రాజా గొప్ప గ్రంధ కర్త .సంస్కృతభాషా వ్యాప్తికి భారతీయ సంస్కృతీ వ్యాప్తికి విశేష కృషి చేశాడు .ఎప్పటికైనా సంస్కృతభాష మాత్రమె భారతీయ ఐక్యతను సాధించగలదని ,ప్రపంచానికి పరమోత్తమమైన విలువలను బోధించేదని గాఢం గా నమ్మాడు .ఆయన కల ఇంకా సాకారం కాలేదు .ఇండియా రానురాను విభజనకు గురి అయిన్దేతప్ప ఐక్యత సాధించలేకపోయింది. సాంస్కృతిక విలువలు పతనమై పోయాయి .ఇండాలజీ పై కున్హన్ రాజా వెలువరించిన పత్రాలసంపుటికి గౌరవ ప్రదంగా అడయార్ లైబ్రరి ‘భారతీయ బ్రహ్మ విద్య ‘’అనే ఉద్గ్రంధాన్ని ఆయన శతజయంతి నాడు అంకితమిచ్చి1996లో ప్రచురించి గౌరవించింది .
శంకరాచార్య రాసిన బ్రహ్మ సూత్ర భాష్య’’చతుస్సూత్రి ‘’కి వాచస్పతి భామతి రాసిన దానిని ఫిలాసఫీ రీడర్ శ్రీ ఎస్ ఎస్ సూర్యనారాయణ శాస్త్రి మద్రాస్ యూనివర్సిటి సంస్క్రుతాచార్యులు శ్రీ కున్హన్ రాజ కలిసి ఆంగ్లం లోకి అనువదించారు .దీనికి ముందుమాట శ్రీ సర్వేపల్లి రాదా కృష్ణ రాశారు . ‘’some fundamental problems in Indian philosophy ‘’,’’some aspects of education in ancient India ,’’sankhya karikas of Isvara Krishna ,’’’’asya vamsya mantram ‘’’’survey of Sanskrit literature ‘’,మొదలైన ఆంగ్ల గ్రంధాలు రాశాడు .భారత ప్రశస్తి ,చంద్ర వాక్యాస్ ఆఫ్ వరరుచి ,కూడా ఆయనవే .
ఆంద్ర విశ్వవిద్యాలయం లో గీర్వాణ సేవ
1954 లో విశాఖపట్నం ఆంద్ర విశ్వ విద్యాలయం లో సంస్కృత శాఖ డాక్టర్ సి కున్హన్ రాజా ఆచార్యులుగా ప్రారంభమైంది .కాని నాలుగేళ్ల తరువాతనే సంస్కృతం లో ఏం ఏ ,.పి.హెచ్ డిల కు విద్యార్ధులను చేర్చుకోవటం ప్రారంభమైంది .లబ్ధ ప్రతిష్టులైన సంస్కృత పండితులెందరో డిపార్ట్ మెంట్ లో చేరి సేవలందించారు . ఆంద్ర విశ్వ విద్యాలయం లో సంస్కృత ప్రొఫెసర్ గా పని చేసినప్పుడు ‘’కాళిదాస ‘’గ్రంధాన్ని ‘’ది వేదాస్’’ను రచించి ప్రచురించాడు .సంస్కృత శాఖలో ‘’దర్శనాలపై పరిశోధన , సంస్కృతం లో స్త్రీల సాంఘిక అధ్యయనం ,తులనాత్మక సాహిత్య విమర్శ ‘’లకు ప్రాధాన్యమిచ్చారు .ఐ ఏ ఎస్ ఆఫీసర్లు కూడా సంస్కృతం లో అత్యుత్సాహం చూపి చేరి మాస్టర్స్ డిగ్రీ పొంది డిపార్ట్ మెంట్ కు గర్వకారణంగా నిలిచారు .అందులో చదివి ఉత్తీర్ణులైన వారు వివిధరంగాలలో ఉన్నత పదవులలో రాణించారు .ఇందులోని ఫాకల్టి సభ్యులు జర్మని ,ఆస్ట్రేలియా ,కెనడా ,తాయ్ లాండ్ వంటి ఇతర దేశాలు సందర్శించి అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు .సంస్కృత డిపార్ట్ మెంట్ వారిని యు జి సి ,ఎపి పిఎస్ సి ,యుపి ఎస్ సి వారు తరచుగా సంప్రదిస్తూ సలహాలను తీసుకొనేవారు .ఫాకల్టివారు జాతీయ ,అంతర్జాతీయ జర్నల్స్ ను ప్రచురించేవారు.సంస్కృత శాఖాభి వృద్ధికి కున్హన్ రాజా సేవలు నిరుపమానమైనవి .
‘’అస్య వామస్య సూక్త ‘’అనేది ఋగ్వేదం లో మొదటి మండలం లోని 164 వ సూక్తం .దీనికి సాయనుడు, స్వామి ఆత్మానంద వ్యాఖ్యానం రాశారు .దీన్ని ఇంగ్లీష్ లోకి విశాఖలోని ఆంద్ర విశ్వ విద్యాలయ సంస్కృత ప్రొఫెసర్ మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ కున్హన్ రాజా అనువదించాడు .ఇందులో ఎన్నో ప్రతీకలున్నాయి .వాటి వివరణ అంతా ఉంది .కాలచక్రగమనం గ్రహాలూ నక్షత్రాలు వాటి సంబంధం సప్తాశ్వాలు వాటి అర్ధం సూర్యుడు రశ్మి అన్నిటి వివరాలున్న సూక్తం ఇది .సూర్యుడే పరబ్రహ్మ అనేది ముఖ్య సిద్ధాంతం .
‘’God has no place in my philosophy ‘’అని కున్హన్ రాజా ‘’కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ ‘’లోఅంటాడు .
1868లో మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజిలో సంస్కృత శాఖ ప్రారంభమైంది .1872లో గుస్టేవ్ ఆపర్ట్ మొదటి సంస్కృత ప్రొఫెసర్ .1927 లో డాక్టర్ కున్హన్ రాజా సంస్కృత ఆచార్యుడయ్యాడు .ఆయనవద్ద ఇద్దరు స్కాలర్స్ పని చేసేవారు .డిపార్ట్ మెంట్ లో’’న్యు కేటలాగ్ కేటలాగం’’(N.C.C )విభాగం ప్రారంభమై రాఘవన్ ఆధ్వర్యం లో పనిచేసింది ఆయన నుండి రాజా బాధ్యతలు స్వీకరించాడు .డిపార్ట్ మెంట్ ను బోధనలోను, రిసెర్చ్ లోను అగ్రగామిగా నిలబెట్టాడు .ఆరు మహా గ్రంధాలను ప్రచురించే ఏర్పాటు చేశాడు .1980లో రాజా పదవీ విరమణ చేశాడు .యెన్ సి సి సేవలు నిరుపమానం .వ్రాత ప్రతులను సేకరించి భద్రపరచారు .మైసూర్ యూనివర్సిటి మొదలైన వాటికి విజిటింగ్ ప్రొఫెసర్ గా రాజా వెళ్లి ఉపన్యాసాలిచ్చేవాడు .
‘’మేకింగ్ ఆఫ్ వెస్ట్రన్ ఇండాలజీ ‘’హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ పొయేటిక్స్’’, ఇంపార్టన్స్ ఆఫ్ సాంస్క్రిట్,’’సర్వే ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్ ‘’కూడా రాశాడు . సంస్కృత ప్రాముఖ్యం పైన సంస్క్రతం లో’’సంస్క్రుతస్య మహాత్మ్యం ‘’ రాస్తూ ‘’భాషాసు ముఖ్య మధురా ప్రాచీనా విశ్వతో ముఖీ –భాతి సంస్కృత భాషేయం సర్వదా సర్వదాసతీ’’అన్నాడు మొదటి శ్లోకం లో.’’ఉన్నతేన స్తితిమతాహిమవద్భ్రూతా యధా-త్వన్గత్తరంగతా పుణ్య సరితా గంగయా యదా ‘’అన్నాడు .చివరి శ్లోకం –‘’అన్యోన్య భాషా న్వబోధ భీతేః-సంస్క్రుతిర్మాసు వ్యవహార వత్సు-దిగ్భ్యః సమేతేషు నరేషు తోషు –సౌవర్గ వర్గా స్వజనై రఛి న్హి’’
ఇంత గీర్వాణ సేవ చేసిన చిత్తేన్జూర్ కున్హన్ రాజా 1895లో జన్మించి 1963లో మరణించాడన్న ఒక్క విషయం తప్ప ఆయన జీవిత చరిత్రను ఎవరూ పొందు పరచకపోవటం దురదృష్టం .బౌద్ధ ”ధర్మపదం ”ఆంగ్లం లో రాశాడు .
మా శ్రీ మైనేని గోపాల కృష్ణగారు ఉదయం మెయిల్ రాస్తూ కున్హన్ రాజా తను 1955-58లో విశాఖ పట్నం ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఉండగా సంస్కృత విభాగానికి హెడ్ గా ,హాస్టల్ వార్డెన్ గా ఉన్నారని ,సంస్కృతం లో పేరుమోసిన పండితుడని ,హిందూ –బుద్ధిష్ట్ స్క్రిప్చర్స్ లో ఆరితేరిన వాజ్మయ సంపన్నుడు అని తాను ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’చదువుతున్నప్పుడల్లా గుర్తుకు వస్తున్నాడని ,ఆయనపై ఒక ప్రొఫైల్ రాస్తే సంతోషిస్తానని ‘’అన్నారు ‘’.వివరాలు రాయండి వ్యాస రూపం లో పెడతాను .రాయవలసిన ముఖ్యుడే ఆయన ‘’అన్నాను .’’అలాగే ప్రయత్నిస్తా’’ అన్నారు .అప్పటిదాకా ఆగటం ఎందుకని రాసే సీరియల్ కు కామా పెట్టి కున్హన్ రాజా పై నాకు దొరికిన సమాచారం అంతా సేకరించి రాసేదాకా మనసు నిలవ లేదు . ఇది సంగ్రమూ కాదు సంపూర్ణ మూ కాదు .ఇప్పటిదాకా రాయకపోయినా దానికి ప్రాయశ్చిత్తం గా రాసి౦ది మాత్రమే .ఇంకా ఏవైనా ఆయన గురించి తెలిస్తే తర్వాత కలుపుతాను .
కున్హన్ రాజా ఫోటో జతచేశాను చూడండి .
సశేషం
మరో ప్రముఖునితో కలుద్దాం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-15-ఉయ్యూరు

