గీర్వాణకవుల కవితా గీర్వాణం-3
పశ్చిమ గోదావరి జిల్లా –స్వాతంత్ర్యానంతర సంస్కృత సాహిత్య
రచన డాక్టర్ .శ్రీ చిలకమర్తి దుర్గా ప్రసాద రావు
450-డా.శ్రీ ధూళిపాళ అర్క సోమయాజి
వేదగణితం లో డాక్టరేట్ పొందిన శ్రీ ధూళిపాళ అర్క సోమయాజి సంస్క్రుతకావ్యాలెన్నో రాసి విద్వత్తు కు తగ్గ ప్రశంసలు పొందారు .ఆయన శిష్యులనేకులు పేరుపొందారు .’’సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్య’’ ఇంగ్లీష్ గ్రంధం రాశారు .’’ఏ క్రిటికల్ స్టేడి ఆ ఫ యెన్సేంట్ ఆస్ట్రానమి ‘’,’’సం జెమ్స్ ఇన్ ది ఓషన్ ఆఫ్ సాంస్క్రిట్,’’తోబాతుపిల్లలకు ఎన్నో గ్రంధాలూ రాశారు .సంస్కృతం లో లఘు కావ్యం ‘’కోహం ‘’రచించారు .ఒకటి రెండు శ్లోకాలు చూద్దాం –‘’కుతో దేశ గర్భాత్ అహం సంప్రజాతః –గమిష్యామి కుత్రేతివాహం న జానే ‘’చివరి శ్లోకం –నరత్వేన జాతో మహాదేవదేవ –త్వదీయ దయా దదౌ జన్మతాద్రిక్ ‘’
‘’ శ్రీమత్ ప్రసన్నాంజనేయ,నామ హనుమత్సందేశం ,మందా క్రాంత సప్తశతి , బ్రహ్మాన్జలినామ పరమేశ్వరార్పిత శ్లోకమాలిక ,జ్యొతిర్జీవనమ్ ‘’,మొదలైన సంస్కృత రచనలు చేశారు .
451-ఆస్థానకవి శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి (1866-1960)
ఆంధ్రప్రదేశ్ ప్రధమ ఆస్థానకవి శ్రీ శ్రీపాదక్రిష్ణ మూర్తి శాస్త్రి రామాయణ భారత భాగవతాలతో బాటు వందకు పైగా ఉద్ర్గ్రందాలు రాశారు సంస్కృతం లో తన జీవిత చరిత్ర ‘’శ్రీ కృష్ణ స్వీయ చరితం ‘’రాసుకొన్నారు .
452- శ్రీ దోర్బల ప్రభాకర శర్మ
సంస్కృతాంధ్రాలలో నిష్ణాతులైన శ్రీ దోర్బల ప్రభాకర శర్మ కొవ్వూరు గీర్వాణ కళాశాల ప్రిన్సిపాల్ చేసిరిటైర్ అయ్యారు .అనేక సంస్క్రుతనాటకాలు పాటలు రాశారు .’’వివేకానంద ‘’గ్రంధం రాస్తే ఇంటర్ కు బోధనాంశం చేశారు.
453-శ్రీ వేలూరి సుబ్బారావు
సంస్కృత విద్వాంసులైన సుబ్బారాగారు ‘’సుందరి మేఘ సందేశం ‘’’’దాక్షిణాత్య మేఘ సందేశం ‘’అనే సంస్క్రుతకావ్యాలు రాశారు .ఇందులో కద –కొత్తగా పెళ్లి అయిన కవిగారిని ప్రభుత్వ౦ దూరానికి బదిలీ చేసింది. మంగళూరు వెళ్లి సంస్కృతం బోధించమన్నది .భీమవరం లో భార్యను ఉంచి వెళ్ళాడు .భార్యా వియోగం పెళ్లి అయిన కొద్దిరోజులకే జరగటం తో మతి భ్రమించి ఆశాఢ మాసపు తొలి మేఘం తో తన గోడు వెల్ల బోసుకొన్నాడు
454-డా జి ఎస్ ఆర్ కృష్ణ మూర్తి –
ప గో జి లో అరాగవరం కు చెందిన ఈయన సంస్కృతంలో గొప్పకవి.యువకుడిగా ఉన్నప్పుడే ‘’వానకి ‘’,సువర్ణ స్వచ్చలితం ‘’రాశాడు .ఉత్తర ప్రదేశ్ సంస్కృత అకాడెమి ఈయన ప్రతిభను గుర్తించి గౌరవించి సత్కరించింది .’’నవ రూపకం ‘’అనే ఏకాంకికలు రాశారు .ప్రస్తుతం తిరుపతి సంస్కృత విద్యా పీఠం లో ప్రొఫెసర్ గా ఉన్నారు .
455- వీరితో బాటు కొందరు రాసిన వాటిని చూద్దాం –నరసాపురానికి చెందిన శ్రీ అత్తిలి గోపాల కృష్ణమాచార్య సంస్కృత లఘుకావ్యాలు చాలా రాశారు .రేలంగికి చెందిన శ్రీ సోమంచి కృష్ణ శాస్త్రి ‘’విదుర నీతులు ‘’పై భాష్యం రాశారు .శ్రీ కాకరపర్తి కృష్ణ మూర్తి శాస్త్రి ‘’వ్యాజ వ్యవహారం ,అహల్యా సౌశీల్యం ,సదాముక్తి సుదార్నవం రాయగా ,పాలకొల్లు వారైన శ్రీ మానేపల్లి కుమారస్వామి ‘’సుస్వరాలు ‘’ఖండకావ్యం రాశారు .శ్రీ ఆచంట వెంకట సీతా రామ మూర్తి ‘’కుమారవిజయం ‘’రాస్తే ,శ్రీ భారతం శ్రీమన్నారాయణ ‘’గాయత్రి సుప్రభాతం’’,నరసాపురానికి చెందిన శ్రీ పెద్ద్దింటి సూర్య నారాయణ భాగవతార్అనే దీక్షిత దాసు గారు సంస్కృతం లో ఎన్నో హరికధలు రాసి గానం చేసి ప్రసిద్ధి పొందారు .శ్రీ చిర్రావూరి శివ రామ కృష్ణ శర్మ న్యాయ వేదాంత వ్యాకరణాలలో దిట్ట .సంస్కృతం లో చాలా రచనలు చేశారు .బందరు జాతీయ కళాశాలలో పని చేసి రిటైర్ అయ్యారు .శ్రీ ధూళిపాల వెంకట సత్య నారాయణ గీర్వాణ ‘’రామాయణం ‘’రచించారు .ఎందరో మహా కవులు అందరికి వందనాలు .
వీరితో ప.గో.జి.కవులు సమాప్తం . ‘ఇక తూ గో జి లో ప్రవేశిద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -’ ‘’25-9-15-ఉయ్యూరు ,
‘’

