ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -74
31-స్పష్టమైన వినిమయం కోసం నినదించిన అమెరికా ఆర్ధిక వేత్త –ధార్ స్టెయిన్ వెబ్లెన్-2(చివరిభాగం )
మిస్సోరి లో ఏమంత అభిమానం పొందలేకపోయిన వెబ్లెన్ న్యూయార్క్ చేరాడు .’’ది డయల్’’అనే లిబరల్ మాసపత్రిక ఎడిటర్ అయ్యాడు .బరువైన వ్యాసాలూ రాసినా పత్రిక నిలబడలేక పోయింది .యుద్ధ సమయం లో వాషింగ్ టన్ లో తాత్కాలిక చిన్న ఉద్యోగి అయ్యాడు .అతని భావాలు చాలా ముందు చూపుతో ఉండటం తో వదిలేయాల్సి వచ్చింది .సోషల్ రిసెర్చ్ కోసం న్యు స్కూల్లో లెక్చర్లు ఇచ్చాడు .భావోద్వేగం తో మాట్లాడటం తో ఎవర్నీ ఆకర్షించలేక పోయాడు .క్లాస్ రూమ్ లో కూడా ఆతను పారం చెబుతూంటే వినేవాడు ఒక్కడూ ఉండేవాడు కాదు .అతని ‘’ఎంక్వైరీ ఇంటు ది నేచర్ ఆఫ్ పీస్ ‘’ను చాలామంది తిరస్కరించారు .విధ్వంసకర విధానాలను ప్రచారం చేస్తున్నాడని అన్నారు .దీనితో ఏ పదవీ అతనిని వరించలేక పోయింది .డెబ్భై వ పడిలో ఉన్నాడు .శారీరక మానసిక ఆరోగ్యాలు కోల్పోయాడు .క్షయ కూడా సోకింది .కాలి ఫోర్నియాకు వెళ్ళాడు .అక్కడ అడవిలో కేబిన్ లో ఉన్నాడు .ఒంటరి జీవితము ,నిరాశా నిస్పృహ లతో శుష్కించిపోయి అక్కడే వెబ్లెన్ 3-8-1929న చనిపోయాడు .ఒక నోట్ లో నిస్పృహ తో ఉన్న మనిషి టెస్ట్ మెంట్ గా ఇలా రాశాడు చనిపోయే ముందు ‘’నాకు స్మ్రుతి చిహ్నం కాని శిల్పం కాని చిత్తరువుకాని ఏర్పాటు చేయద్దు .శిలాఫలకం కాని దానిమీద రాత కాని ఇప్పుడుకాని మరేప్పుడూ కాని ఏర్పాటు చేయద్దు .నాపై జీవిత చరిత్ర రాయద్దు .నేనురాసినవి నాకు ఎవరైనా రాసినవి ఉత్తరాలు ప్రింట్ చేయ వద్దు .ఇంకేరకంగానూ కాపీ చేయటం ప్రచారం చేయటం నాకు ఇష్టం లేదు ‘’అని అందులో స్పష్టంగా రాశాడు .
తాను తన విదానాల విషయం లో విఫలమయ్యానని భావించాడు .చెడునుఎదిరించటానికి మంచిని సమాయత్త పరచలేక పోయానని వ్యధ చెందాడు .తనకు తానూ సమీకృతం కాలేకపోయినందుకు బాధ పడ్డాడు .’’దిపోర్టబుల్ వెబ్లెన్ ‘’పేరుతొ మాక్స్ లేర్నేర్ రాసిన పుస్తకం లో వెబ్లెన్ వ్యతిరేకించింది వ్యవస్థలనే కాని వ్యక్తులను కాదు అన్నాడు .రూసో తత్వ వేత్త భావాలనే వెబ్లెన్ నమ్మాడు .ఈ విషయం లో కారల్ మార్క్స్ ను వ్యతిరేకించాడు .కేపిటలిజం యుద్ధం కలిసి నడుస్తాయి అనేదాన్ని కాదన్నాడు .సర్ప్లస్ వాల్యు ను ఒప్పుకోలేదు .కాపిటల్ కి లేబర్ కి మధ్య పోరాటాన్ని ఒప్పుకోలేదు .క్లాస్ వార్ ఉండదని ,లేబరే యజమానులౌతారని అన్నాడు .’’వెబ్లెన్ విప్లవం’’వస్తుందని ఊహించాడు .దీనితో కొత్త్తతెలివితేటలున్న మెకానిక్స్ ఉన్నత శ్రేణి టెక్నో క్రాట్స్ ,అరిస్టోక్రసీ ఇంజనీర్లు వస్తారన్నాడు .అసాధ్యాలు అనిపించినా అవి ఆహ్వానింప దగిన విషయాలే .
వెబ్లెన్ చనిపోయినప్పుడు అతన్ని తప్పుడు భావాల ప్రాఫెట్ అని ,క్షమించరాని ఆర్ధిక వేత్త అని అన్నారు చనిపోయినవాడికి చూపించాల్సిన కనీస మర్యాద కూడా చూప లేదు .రాడికల్ మార్పులను వెబ్లెన్ ఆహ్వానించక పోవటం లోపమైంది .కానీ అతనిని ‘’ఇన్ స్టిట్యూషనల్ ఎకనామిక్స్ ‘’ఉద్యమానికి నాయకుడుగా గుర్తించారు .వ్యవస్థలకు ,టెక్నాలజీ కి మధ్య ఉన్న అంతరానికి ‘వెబ్లెన్ డైకోటేమి’’అని పేరు పెట్టారు .అభి వృద్ధి యుగం లో ప్రోగ్రెసివ్ అని పించాడు .లాభాలకోసమే ఉత్పత్తి అనేదాన్ని వ్యతిరేకించాడు .అతని ‘’కాన్స్పిక్యుయస్ కన్సమ్షన్’’సిద్ధాంతం సోషలిస్ట్ నాయకులను బాగా ఆకర్షించింది .మార్కిస్ట్ వ్యతిరేక కేపిటలిజం ను కోరేవారందరికి వెబ్లెన్ ఆరాధ్య దైవమే అయ్యాడు .
వెబ్లెన్ ను ప్రభావితం చేసిన వారిలో ‘’జర్మన్ హిస్టారికల్ స్కూల్ ‘’ ఒకటి .చరిత్రలో మానవులందరూ ఒకే రకంగా ప్రవర్తిస్తారు అన్నది ఇద్దరి అభిప్రాయం .రెండవది డార్విన్ సిద్ధాంతం లోని కాజువాలిటిఅంటే యాదృచ్చిక సంఘటన .డార్విన్ సిద్ధాంతం ఆధారం చేసుకొని తన స్వంత ఆలోచనలను పెంచి వెబ్లెన్ ఆర్ధిక సిద్ధాంతాలను వ్యాప్తి చేశాడు .మూడవది ప్రాగ్మాటిజం అంటే స్వేచ్చా పూరితమనసు సంఘం అభివృద్ధిని కోరుతుందని చెప్పేదాన్ని నమ్మి తన ఆర్ధిక పరిణామ సిద్ధాంతాన్ని బలపరచుకొన్నాడు .నాల్గవది మార్క్సిజం .అందులో కూలీకి యజమానికి మధ్య ఉన్న పోరాటం ను కాదని కూలీలు యజమాని మనసుమార్చేయాలన్నాడు .టెక్నాలజీకి పెద్ద పాత్ర ఉందన్నాడు వెబ్లెన్ .
వెబ్లెన్ చెప్పిన ’కాన్స్పిక్యుయస్ కన్సమ్షన్’’సిద్ధాంతం అంటే డబ్బును అనవసరంగా వస్తువులవిలువకంటే ఎక్కువగా ఖర్చుపెట్టటం .ఇది రెండవ రెండవ పారిశ్రామిక విప్లవకాలం లో ఏర్పడింది .’’కాన్స్పిక్యువస్ లీజర్ ‘’సిద్ధాంతమూ చేశాడు వెబ్లెన్.ఐశ్వర్యాన్ని ,అధికారాన్ని ఉత్పత్తి పనిగా చూపించటంఅన్నమాట దీన్ని వ్యతిరేకించాడు .లీజర్ క్లాస్ ను చెప్పాడు .సూటిగా ఆర్ధిక భాగస్వామ్యం లేకుండా ఉన్నత స్థాయి గౌరవం పొందటం ఆక్షేప ణీయంఅని దీని సారాంశం .అది ఆర్ధిక గ్రంధాలు దాదాపు పాతిక వ్యాసాలూ రాసి ఆర్ధిక సిద్ధాంతాలకు పరి పుష్టి చేకూర్చాడు .
Quotes
Conspicuous consumption of valuable goods is a means of reputability to the gentleman of leisure.
Invention is the mother of necessity.
Born in iniquity and conceived in sin, the spirit of nationalism has never ceased to bend human institutions to the service of dissension and distress.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-15-ఉయ్యూరు

