కృష్ణ గీత – నిషేధం- క్రిష్ణ వేణి

కృష్ణ గీత – నిషేధం- క్రిష్ణ వేణి

సినిమాలు, పుస్తకాలు, పాటలూ..అన్నిటిమీదా బ్యానే.
మహారాష్ట్రాలో బీఫ్ నుంచీ, గుజరాత్లో బ్యాన్ చేయబడిన ‘ఫనా’, ‘ఫిరాక్’ మరియు ‘పర్జానియా’ వంటి సినిమాలేకాక ‘ద విన్సీ కోడ్’, ‘ద బ్లాక్ ఫ్రైడే, ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ వంటి సినిమాలనుంచీ సాతానిక్ వెర్సస్ లాంటి పుస్తకాలవరకూ మన దేశంలో ఏవి బ్యానుకి అనర్హం కాలేదు కిందటి రెండు సంవత్సరాలలో? .

‘ముహమ్మద్-దేవుని దూత’ అన్న ఇరానియన్ సినిమా పట్ల అభ్యంతరం తెలుపుతూ, ఆ ప్రోజెక్టులో జోక్యం ఉన్నవాళ్ళందరి మీదా- ముంబైకి చెందిన ర‌జా అకాడ‌మీ (సున్నీ ముస్లిం సంస్థ) ఫత్వా జారీ చేసింది. ఫత్వా జారీ చేయబడినవారిలో, మ్యూజిక్ కంపోసర్ ఏ ఆర్ రహ్మాన్ మరియు ఆ సినిమా తీసిన మజిదీ కూడా ఉన్నారు. “నేను పాశ్చాత్యదేశాల్లోనూ తూర్పు దేశాల్లోనూ కూడా ఉంటాను. ఎవరినీ తీర్పు తీర్చకుండా అందరినీ ప్రేమించడానికి ప్రయత్నిస్తాను.” అని చెప్తూ, తను “ఏ హానీ కలిగించే ఉద్దేశ్యంతో మ్యూజిక్ కంపోస్ చేయలేదని” ఆస్కార్ విజేత రహ్మాన్ తన ఫేస్‌బుక్ పేజీ మీద రాశారు.
ఫత్వా జారీ చేయడానికి ఒక ప్రక్రియ అంటూ ఉంటుంది. ఎవరికి పడితే వారికి ఫత్వా జారీ చేసే హక్కుండదు. అది వేరే సంగతనుకోండి.

11111111111111111111

మన సినిమాలు కానీ, టివి సీరియళ్ళు కానీ, పాటలు కానీ- స్టీరియో టైపులో ఉన్నంతకాలమూ ఏ బెంగా లేదు. కానీ ఏదైనా సున్నితమైన లేక గంభీరమైన అంశం గురించి ఎవరైనా మాట్లాడే ధైర్యం చేసిన క్షణం, అది మనకి మింగుడు పడదు. ఆ సినిమా లేక సీరియల్ని తీసిన వ్యక్తి ప్రమాదంలో పడకనూ మానడు.

‘సైనిక్ తులే నౌ హతియార్’ అన్న బెంగాలీ పాటని సలీల్ చౌదరీ All India Tripartite Land Reform Movement పర్యంతం కంపోస్ చేసి పాడారు. రైతులు తమ ఆయుధాలని చేబట్టి తమ భూమిని తిరిగి చేజిక్కించుకొమ్మంటూ ప్రేరేపిస్తుందా పాట. అప్పుడు స్వాతంత్ర్య పోరాటంలో, ఆ ఆల్బమ్నే బ్యాన్ చేసేరు.

ఢిల్లీ గాంగ్ రేప్‌లో నిందితుడైన ముకేష్ సింగ్ ఆలోచనాధోరణిని చూపించిన లెస్లీ ఉడ్విన్ తయారు చేసిన డాక్యుమెంటరీ “ఇండియాస్ డాటర్‌” ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. పోలీసుల పర్యవేక్షణ ఉంటే తప్ప పార్టీలకి ఫారెన్ ఇన్వైటీస్ రావడాన్ని కర్నాటకా ప్రభుత్వం బ్యాన్ చేసింది.

ప్రపంచంలో అధిక పట్టణాలు సైకిల్ తొక్కమని ప్రోత్సహిస్తుంటే, కొలకత్తాలో 62 వీధుల్లో సైకిళ్ళు నడపకూడదు.
ప్యూగో కార్ అడ్వర్టైసుమెంటుని ప్రభుత్వం బ్యాన్ చేసింది. వీడియో చూడండి.

బ్యాన్ చేశిన ‘చాంద్ బుఝ్ గయా’( చంద్రుడు మరుగయేడు) అన్న ఫాయెజ్ అన్వర్ ఫిల్మ్‌- ఒక హిందూ యువకుడూ మరియు ఒక ముస్లిమ్ యువతికీ మధ్య ఉన్న ప్రేమ కథ గురించినది. గుజరాత్ అల్లర్లలో వారి జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయి. ఆ సినిమాలో వయొలెన్సూ, కొన్ని అమానవీయమైన సీన్లూ ఉన్నాయి. అంతేకాక కొన్ని కారెక్టర్లు నిజజీవితపు కొంతమంది మనుష్యులని పోలి ఉండాలి.

“ఆంధీ” మరియు ‘కిస్సా కుర్సీకా” అన్న సినిమాలు ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తీసినవన్న అనుమానంతో అప్పుడు వాటిని బ్యాన్ చేశారు. ఈ సినిమాల లిస్ట్ సమగ్రమైనది కాదు కానీ ఇది tip of an iceberg మాత్రమే. ఇప్పుడు “లెస్బియన్” అన్న మాట మీదా బ్యానే.

2014 మార్చ్‌లో ‘గుర్బాణీ’ అనే ఒక సీరియల్ ప్రారంభం అయింది. ‘గుర్బాణీ’ అన్న మాటకి ఒక సిక్కు జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉంటుందనీ, ఆ మాటని కేవలం సిక్కు గురూల భక్తిగీతాల కోసం మాత్రమే ఉపయోగించాలని శిరోమణీ గురుద్వారా ప్రబంధక్ కమిటీ అభ్యంతరం తెలిపింది. అప్పుడు ఆ సీరియల్ పేరు మార్చి ‘బాణీ’ అని పెట్టేరు.

మనం ప్రజాస్వామిక సమాజంలో జీవిస్తున్నాం. దేన్ని పడితే దాన్ని బ్యాన్ చేయడం కుదరదు. ఎప్పుడైతే ఏదైనా బ్యాన్ చేయబడుతుందో, జనులు దాన్ని చట్టవిరుద్ధంగా –అడ్డదారుల్లో, పొందాలనుకుంటారు.
ఏ బ్యానైనా పౌరుల స్వేచ్ఛని ఎంతో కొంత ఆరి కడుతుంది.
సమాజాలకి కొన్ని విలువలు ఉంటాయి. స్వేచ్ఛ వాటిల్లో ఒకటి.

బ్యాన్ చేయడంలో భారతదేశం అగ్రగామి అవుతున్నట్టుంది. పాశ్చాత్య దేశాల ప్రభావం నుంచి భారతదేశాన్ని రక్షించడానికి మన ప్రభుత్వం చాలా పాటు పడుతున్నట్టుంది.

బ్యాన్ల మీద కేంద్రీకరించే బదులు దేశం ఎదురుకుటున్న ఇతర సామాజిక/ఆర్థిక అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెడితే, మరిన్ని ఫలితాలు కనిపిస్తాయేమో! ప్రజాస్వామ్యం మరియు స్వేచ్చానుసార చిత్తం అన్న అభిప్రాయాలు మన మనస్సుల్లో ఇంకి ఉన్నాయి. కానీ ఈ బ్యాన్లు మన చర్యలనీ, మన ఆలోచనలనీ నిర్బంధిస్తున్నాయి.

పబ్లిక్లో యూరినేట్ చేయడం నిషేదం కాదు. పార్న్ మీద బ్యాన్ లేదు.
బ్యాన్ చేయాలంటే, బాల్య వివాహాలూ, రేప్ చేయడాలూ, గృహహింసా, చైల్డ్ లేబర్ –ఇలాంటివన్నీ కనబడవెందుకో మన ప్రభుత్వానికి!

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మరియు ఎక్ప్రెషన్ అన్నది తన్ని తాను స్వేచ్ఛగా- నోటి మాట ద్వారాకానీ, లిటరేచర్ ద్వారా కానీ కళ ద్వారా కానీ లేక సమాచార ప్రసారం యొక్క ఇంకే ఇతర మాధ్యమం ద్వారానైనా వ్యక్తపరచగలగడం అన్న భావం.
I disapprove of what you say but I will defend to the death your right to say it- Voltaire

– క్రిష్ణ వేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

1 Response to కృష్ణ గీత – నిషేధం- క్రిష్ణ వేణి

  1. Krishna Veni Chari's avatar Krishna Veni Chari says:

    నా కాలమ్‍ షేర్‍ చేసుకున్నందుకు కృతజ్ఞతలు.

    Like

Leave a reply to Krishna Veni Chari Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.