ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -83
36-చిన్న కధకు ప్రాణం పోసిన రష్యన్ కధకుడు అంటోన్ చెకోవ్-3(చివరి భాగం )
కొత్త భావాలను మనసులో ఉంచుకొని వుడ్ డెమన్ ను ,అంకుల్ వాన్యా లను మార్చి రాశాడు చెకోవ్ .వాన్యా బాగా ఆదరణ పొందింది .నిజాలను స్పష్టంగా చూడగలిగాడు .అప్పటి నుండి దియేటర్ తో ఎక్కువ సంబంధాలను కొన సాగించాడు .మాస్కో ఆర్ట్ దియేటర్ లో సభ్యురాలైన ఒల్గానిప్పర్ ను ప్రేమించాడు ఆమె కూడా వలచింది .కాని పెళ్లి విషయం చెప్పటానికి సందేహించాడు .అనారోగ్యం వలన ప్రదేశాలు తిరుగుతూ ఉత్తరాల ద్వారానే ప్రేయసికి వలపు వార్తలు తెలియ జేసేవాడు .ఒక ఇంటిలో ఆతిధ్యం పొందుతూ తీవ్ర జబ్బు తో బాధ పడ్డాడు ఇక తన రోజులు దగ్గర పడ్డాయని తెలుసుకొన్నాడు .అయితే ఓల్గా అతనిని ఒంటరిగా బాధ పడకుండా కానీ పెట్టి ఉంది .అతాన్ని ఒప్పించటానికి రెండేళ్ళు తీవ్రంగా ప్రయత్నించింది .చివరికి 25-5-1901 న అతన్ని ప్రపోజ్ చేసింది ఇద్ద్దరూ పెళ్లి చేసుకున్నారు .పిరికితనం వదలక పెళ్లి విషయం రహస్యం గానే ఉంచాడు .టాల్ స్టాయ్ను ఇష్టపడే వారందరికీ చెకోవ్కూడా ఇష్టమే .కాని తనకు బయటి ప్రపంచానికి ఊహాత్మక అడ్డ గోడ ఒకటి నిర్మించుకొని లోపలే ఉండిపోయాడని చెకోవ్ మరణం తర్వాత భార్య చెప్పింది .
జీవిత చరమాంకానికి ఇక మూడు ఏళ్ళు మాత్రమె మిగిలాయి .రష్యన్ అకాడేమిలో సభ్యుడయాడు రెండేళ్ళ తర్వాత తన స్నేహితుడు మాక్సి గోర్కీ ని అకాడెమి కి ఎన్నిక చేశాడు . గోర్కీ రాజకీయ సిద్ధాంతాలకు అకాడెమి అభ్యంతరం చెప్పి అతని ఎన్నిక ను రద్దు చేసింది .దీనికి తీవ్రంగా స్పందించి గోర్కీ పక్షాన నిలిచి అకాడెమి సభ్యత్నానికి రాజీనామా చేశాడు.చెకోవ్ .మరో రెండు నాటకాలు దిత్రీసిస్టర్స్ ,ది చేర్రిఆర్చార్డ్ రాసి మహా పాప్యులర్ నాటక కర్త అనిపించాడు .శారీరక బాధ అంతకంతకు ఎక్కువైంది .రోజుకు కొన్ని పంక్తులు మాత్రమె రాయ గలిగే వాడు .వ్యంగ్యాత్మక హాస్యాన్ని కొత్త విలువలతో పాత పద్ధతిలో రాశాడు
చెర్రి ఆర్చర్డ్ తర్వాత చెకోవ్ పరిస్తితి విషమించింది .శారీరకం గా బలహీనుడైనా మానసికంగా మరింత ధృఢ౦ గా ఉన్నాడు .దేవుడు తనలో జీవాణువుపెట్టాడని అనేవాడు దిగజారిన ఆరోగ్యం వలన బెదేన్ వీలర్ శానిటోరియం లో చేర్చారు .డాక్టర్లు ఆయనకేమీ ఫర్వాలేదని ధైర్యం చెప్పేవారు .చెకోవ్ కూడా డాక్టరు కదా ఆయన్ను ఎవరూ మోసగించ లేరు .’’నేను చనిపోతున్నాను ‘’అని చెప్పి,2-7-1904 న 44ఏళ్ళకే ఇంకో ఆరు నెలలకు 45ఏళ్ళు వస్తాయనగా చెకోవ్ చనిపోయాడు . చెకోవ్ ఏక వ్యక్తీ సైన్యం లాగా క్రుత్రిమతపై తిరుగు బాటు చేశాడు .శైలీ నిర్మాణం తో నాటకాలను ,అందమైన కదానికలను రాసి అజరామరమైన కీర్తి సాధించాడు .అతని మొదటి ఆంగ్ల శిష్యురాలు కేధరీన్ మానస్ ఫీల్డ్ చిన్నకధకు వన్నె తెచ్చాడని అంది .అటు అమెరికాలోను చెకోవ్ కధలకు బ్రహ్మ రధం పట్టారు .ఎన్నో కధానికా పోటీలలో ఆయన కధలు బహుమతులు పొందాయి .ఏది రాసినా దాన్ని మధ్యలోనే చెప్పటం వదిలేస్తాడు .పాఠకుడి ఊహకే కద సమాప్తాన్ని వదిలేయటం చెకోవ్ ప్రత్యేకత .నటన ,క్రుత్రిమత్వాలను ఏవ గించాడు .కధలను ‘’it does not matter ‘’అని ,’’if we could know ‘’అని కాని చెప్పి ముగిస్తాడు .’’His was the genius of a style ,the biography of the mood ,the slice of life which gave rise to a new and enlarging literature of sensibility ‘’అని విశ్లేషకుల భావన .
చనిపోవటానికి కొన్ని నెలలముందు తన రచనలను జనం మరో ఏడేళ్ళు చదువుతారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.అ తర్వాత ఆరున్నర ఏళ్ళు జీవించాడు . ఆయన అంచనాలు తారుమారయ్యాయి .మరణానంతరం పాప్యులారిటీ బాగా పెరిగింది .ఆయన చెర్రీ ఆర్చర్డ్ నాటకం తో టాల్ స్టాయ్ కి తరువాతివాడిగా ప్రజలు భావిన్చేట్లు చేసింది .చెకోవ్ కధలను ఫస్ట్ ,సెకండ్ థర్డ్ గ్రేడ్ లుగా విభజించారు .ఇంగ్లీష్ లోకి అనువాదం పొందాక ఆంగ్ల పాఠకులు చెకోవ్ పై వీరాభిమానం చూపారు .జేమ్స్ జాయిస్ వర్జీనియా ఉల్ఫ్ కేధరీన్ మానస్ ఫీల్డ్ వంటి ప్రముఖులు ఆయన్ను మెచ్చుకొన్నారు .ముఖ్యంగా బెర్నార్డ్ షా ప్రశంసలు పొందాడు చెకోవ్ .అయన చిన్నకధలు నాటకాలను డామినేట్ చేశాయి వాటికే విపరీతమైన క్రేజ్ వచ్చింది .చెకోవ్ ప్రభావం అమెరికా రచయిత హెమింగ్ వే మీద బాగా ఉంది .చెకోవ్ కద ’’ది లేడీ విత్ ది డాగ్ ‘’చాలా గొప్పకద అని హెమింగ్వే అభిప్రాయ పడ్డాడు .వర్జీనియా ఉల్ఫ్ కు ‘’ది కామన్ రీడర్ ‘’కద బాగా నచ్చింది .
‘’Chekhov is comic in avery special paradoxical way .His plays depend as comedy does on the vitality of the actors to make pleasurable what would other wise be painfully awkward –inappropriyate speeches ,missed connections ,faux pas stumbles childishnesss –but as part of deeper pathos ,the stumbles are not pratfalls but an energized graceful dissolution of purpose ‘’అని విశ్లేషించాడు ఒక ప్రొఫెసర్ .భూ ప్రపంచం మీద రెండవ గొప్ప రచయిత చెకోవ్ అన్నది యదార్ధం .జపాన్ నాటక రచయిలు షిమూజి కునో ,యోజి సకాటే ,ఐ నాగాయ్ లపై చెకోవ్ ప్రభావం ఎక్కువ .చిన్న కధకు వన్నె చిన్నెలు దిద్ది కళాకృతి గ మార్చిన మహా కదా కధన శిల్పి చెకోవ్
s
మరో ప్రముఖునితో కలుద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-15-ఉయ్యూరు

