ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -90

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -90

39–కాళ్ళీడ్చు కుంటూ నడిచే సామాన్యుడిని కారెక్కించిన –హెన్రీ ఫోర్డ్ –2

 

అంత అందం ,ఆకర్షణా లేకపోయినా టిలిజ్ కారు టఫ్అండ్ రఫ్ గా ఉండేది .దీని నుండి ఇంకా కొంచెం   సున్నితమైననాలుగు సిలిండర్ల,మరింత ఆధునికతతో స్లైడింగ్ గేర్ తో ఆకర్షణీయమైన  ’’  మోడల్ ఏ ‘’వచ్చింది .ఉత్పత్తి వేగం పెంచారు .ఫోర్డ్ జీవితకాలం లోనే 30మిలియన్ పైనే కార్లు ఉత్పత్తి అయ్యాయి .నిమిషానికోకకారు ఉత్పత్తి అయింది .ఇవికాక జీపులు ట్యాంక్ విధ్వంసకాలు బాంబర్లు ,షిప్పులు ,బ్రెన్ గం కారియర్లు ,మొదలైన యుద్ధ వాహనాలు తయారు చేశాడు .ఏది నిర్మించినా సామర్ధ్యం ను దైవంగా భావించి చేశాడు . ,తక్కువకాలం లో  తక్కువ లేబర్ తో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు .మనిషి మెషీన్ దేవుడికి   సేవ చేసే విధం చూపాడు .స్వయం కృషికి విశేష ప్రాదాన్యమిచ్చాడు .సృజనకు విశేష విజయం చేకూర్చాడు .సాదారణ ప్రజలే ఫోర్డ్ దృష్టిలో ఎప్పుడూ ఉండేవారు .వారి సంక్షేమమే ధ్యేయంగా పని చేసేవాడు. వారికి పిత్రు ప్రేమను అందించాడు .వారు సౌకర్యాలు కలిపిస్తే మరింత సామర్ధ్యం తో పని చేస్తారని నమ్మాడు ఆ సౌకర్యాలు కల్పించి రుజువు చేసుకొన్నాడు .

పని చేసేవారి ఇంటి పరిస్తితులను తెలుసుకోనేవాడు వారికి దురభ్యాసాలేమైనా ఉన్నాయేమో నని వేగుల ద్వారా విచారించేవాడు .సిగరెట్ తాగటాన్ని నిషేధించాడు తాగుతూ కనిపిస్తే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేవాడు .ఇదంతా ఒక కుటుంబం లో తండ్రికున్న బాధ్యతగా భావించేవాడు .ఫోర్డ్ సామ్రాజ్యం ఒక నియంత ప్రభుత్వం లాగా ,ఒక పోలీస్ రాజ్యంగా ,స్పై స్టేట్ గా అనిపించేది .స్వయం రక్షక భటులు ,ఇన్ఫార్మర్లు ,బలీయమైన ఆర్మేడ్ గార్డ్ లతో జెర్మనీ వాళ్ళ’’ గెస్టపో ‘’ను పోలి ఉండేది .ఫోర్డ్ ఫాక్ట రీలనుంది ఫోర్డ్ సామ్రాజ్యమేర్పడింది .రోగ్ రివర్ వద్ద వెయ్యి ఎకరాలలో విస్తరించి ,లక్షమంది ఉద్యోగులతో విలసిల్లింది .బొగ్గు ,ఇనుపగనులను ,టింబర్ లాండ్ ,బ్రెజిల్ లోని ఆరుమిలియన్ల ఎకరాల రబ్బర్ ప్లాంటేషన్ను గ్లాస్ ఫాక్టరీలను ,చిన్న పరిశ్రమలను స్వాధీనం చేసుకొన్నది .యూరప్ దక్షిణ అమెరికాలలో ప్రతి చోటా అనుబంధ కంపెనీలను ఏర్పరచింది .1923నాటికి ఒక్క అమెరికాలోనే ఫోర్డ్ ఉద్యోగుల సంఖ్య 2లక్షలకు పైనే ఉండేది .దీనితో నిరంతర ఉత్పత్తి సాధ్యమైంది .రోగ్ రివర్ ఫాక్టరీకి ఓడలలో దగ్గరున్న నౌకాశ్రయాలకు ఇనుము చేరేది .దాన్ని ఫాక్టరీలో కరగింఛి ఉక్కుగా మార్చేవారు .తర్వాత విడిభాగాలు తయారు చేసేవారు .వీటిని అసెంబుల్ చేసి ఆటో మొబైల్స్ ను నాలుగు రోజుల్లో తయారు చేసి  షిప్పింగ్ చేసి అమ్మేవారు.ఫోర్డ్ పట్టినది అంతా బంగారమే అయ్యేది.పాడై పోయిన ఒక రైల్ రోడ్ ను కొని ,కొన్నేళ్ళ తర్వాత దాన్ని 9మిలియన్ల డాలర్ల లాభానికి  అమ్మేశాడు  .1940లో ఫోర్డ్ ను సంపాదించిన సంపదను లెక్కపెట్టట సాధ్యం కాలేనంత పెరిగి పోయింది .కానిఆ ఏడాది   అది 60౦ మిలియన్ డాలర్లు పైగా  ఉంటుంది అని అంచనా వేశారని ఫోర్డ్ జీవితంపై ‘’దిలాస్ట్ బిలియనీర్ ‘’పేరసి రిచార్డ్స్ రాసిన పుస్తకం లో ఉంది .

ఫోర్డ్ లో చిన్న చిన్న విపరీత ధోరణులు ,పెద్దపెద్ద అసూయలు ఉండేవి .విశ్వ సమస్యలపై ఆలోచించేవాడు .వైరుధ్యాలపై ఆధారపడి ,అవేసాకులుగా చూపి అకస్మాత్తుగా దూరం పెట్టె అలవాటుండేది .లేబర్ యూనియన్ లతో చాలా కఠినంగా వ్యవహరించేవాడు .పరిస్తితి అర్ధం చేసుకోన్నాక అడిగినదానికంటే ఎక్కువే ఇచ్చేవాడు .పొగాకు తాగటం మంచిది కాదనే ప్రచారం చేస్తూ ‘’నేరం చేసిన ప్రతి వాడికీ సిగరెట్ దురభ్యాసంతప్పకుండా  ఉంటుంది  ‘’అని చెప్పేవాడు .అమెరికన్ టొబాకో కంపెనీ కొన్నతర్వాత సిగరెట్ పై చెప్పిన మాటే మర్చిపోయాడు .

కళా సాంస్కృతిక రంగాల గురించి ఆయనేమీ పట్టించుకోలేదు  పుస్తకం చదివే అలవాటు కూడా లేదాయనకు . . ఫిలాసఫీ కూడా తెలియదు .ఎమర్సన్ చెప్పిన ‘’an institution is the lengthened shadow of one man ‘’పై నమ్మకమున్న వాడు .మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో ఫోర్డ్ అకస్మాత్తుగా ‘’ప్రపంచ రక్షకుడు ‘’గా శాంతి పరిరక్షకుడు గా అవతారం ఎత్తాడు .ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొన్న(చార్టర్డ్ ) షిప్ లో  వందమంది సానుభూతి పరులతో యూరప్ వెళ్లి  యుద్ధ ఉన్మాదం లో ఉన్న రెండు వైపులా వారి మధ్య సయోధ్య కుదర్చాలని అనుకొన్నాడు ‘’’’సైనికులను క్రిస్మస్ నాటికి ట్రెంచ్ లలోంచి  బయటికి తీసుకోచ్చేయండి ‘’అనేది ఫోర్డ్ స్లోగన్ .,స్లో –గన్ కూడా  .కాని అక్కడి పరిస్తితులను అర్ధం చేసు కొని గమ్మున ఉండి పోయాడు .నౌక నార్వే తీరం చేరగానే ఫోర్డ్ తిరుగు ప్రయాణపు షిప్ ఎక్కి తిరిగొచ్చాడు .

యుద్ధం అయిపోయాక ఒక ఏడాది తర్వాత మరొక తక్కువ స్థాయి ప్రయత్నం  తల పెట్టాడు .యూదులమీద యుద్ధం ప్రకటించాడు .బుడాపెస్ట్ జ్యూస్ రోజికా  స్క్విమ్మర్ తో జరిగిన దురదృష్ట సంఘటనలతో అతనిలో యాంటి సేమిస్ట్ భావాలు తీవ్రమైనాయి .’’డియర్ బార్న్ ఇండిపెండెంట్‘’’’అనే మేగజైన్   ను ఫోర్డ్ ఫోర్డ్ ప్రచురించాడు .ఏడేళ్ళు జాతి విద్వేషాన్నిఅందులో  వెళ్ళ గక్కాడు..నీచమైన డాక్యుమెంట్లను సేకరించి అందులో ప్రచురించాడు .ప్రపంచ ప్రభుత్వాల,కళా సంస్క్రుతుల ఆర్ధిక రంగాలలో  లో  తప్పిదాలన్నీ జ్యూస్ వల్లనే జరిగాయని వాళ్ళే బాధ్యులని  ఆరోపించాడు . కల్తీ మద్యం ,సంగీతం ,బేస్ బాల్.ఆడవాళ్ళ లిప్ స్టిక్ లన్నీ యూదుల సృష్టి అన్నాడు .చికాగో అటార్నీయారన్ ,కో ఆపరేటివ్ నిర్వాహకుడు సాపిరో  ఫోర్డ్ పై మిలియన్ డాలర్ల కు పరువు నష్టం దావా వేశాడు .గురూగారు ఒక్క సారిగా వెనక్కి తగ్గాడు .పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పి లెంప లేసుకొన్నాడు .ఈ తప్పు అంతా తన కింద పని చేసే వాళ్ళదే అని వాళ్ళే బాధ్యులని నేరం వారిపై తెలివిగా నెట్టేశాడు ఫోర్డ్ సామ్రాజ్యాధిపతి విలియం ఫోర్డ్ .’’జియాన్ ప్రోటోకాల్స్ ‘’అన్నీ తప్పుడు వని  సంజాయిషీ ఇచ్చ్చాడు .తన పత్రిక’’ఇండిపెండెంట్ ‘’లో రాయబడినదంతా తాను  బిజీగా ఉండటం వలన చదవ లేకపోయానని  తాను  చదవ కుండానే అచ్చై పోయిందని తప్పించుకొన్నాడు .వెంటనే ప్రచురణ ఆపేయి౦చేశాడు కూడా .

Inline image 1   Inline image 2సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-11-15-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.