నమస్తే చక్రధర్ గారు -ముందుగా మీకు,మీ కుటుంబానికి దీపావళి శుభా కాంక్షలు మీరు ఏంతో ఆప్యాయంగా నన్ను చదవమని మా రమణ తో అందజేసిన”అక్కినేని వ్యక్తిత్వ వికాసం ” పుస్తకం ఈ నెల రెండవ తేదీ న మొదలు పెట్టి పదకొండవ తేదీ అంటే ఈవేళ, తొమ్మిది రోజుల్లో నాకు వీలు దొరికినప్పుడు చదు వుతూ పూర్తీ చేశాను .చాలా గొప్ప పరిశ్రమ చేశారు మీరు .నాకూ అక్కినేని అభిమానం ఉంది . ఎన్నో విలువైన ఫోటోలు సేకరించారు ఎంతోమంది అభిప్రాయాలను సేకరించి రాశారు .బాగు0ది . మంచి రీడబిలిటి ఉన్న పుస్తకం అందరు చదివి జీవిత వికసనాన్ని పొందాల్సిన పుస్తకం . యువతకు గొప్ప ఆదర్శ గ్రంధమే.వ్యక్తిత్వ వికాసానికి అన్నిరకాలా దోహద పడే ఉపయుక్త గ్రంధం . నాకు ముఖ్యం గా ఆదుర్తి రాసిన ”దొంగ ”ఆత్రేయ రాసిన ”ఆప్తుడు ”చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి మిగిలినవి మెహర్బానీకి మొహమాటాలకు చెప్పినట్లున్నాయి .ఇండస్ట్రిలో ఇవి తప్పవు అనుకొంటా ..వీలు చూసుకొని నా పూర్ర్తి సమీక్ష రాస్తాను –దుర్గాప్రసాద్ సాహితీ బంధువులకు -శుభ కామనలు
శ్రీ గోవిందరాజు చక్రధర్ గారు ఉయ్యూరు వాసి హైదరాబాద్ లో మొట్టమొదటి జర్నలిజం కాలేజ్ పెట్టి ఎందరినో తీర్చి దిద్దుతున్న వారు .వారి తలిదండ్రులు ఉయ్యూరులోనే ఉన్నారు వీరుకూడా నెలకోసారి అయినా వచ్చి వారిని చూసి వెడతారు నాకు మిత్రులు మా అబ్బాయి రమణ కు ఆప్తుడు గురువు దైవం మార్గ దర్షి .మా వాడి ద్వారానే ద్వారానె ఆ పుస్తకం”అక్కినేని వ్యక్తిత్వ వికాసం ” నాకు అందజేశారు .సరసభారతికి ఆత్మీయులు జర్నలిజమ్ పైనా, వ్యక్తిత్వ వికాసం పైనా చాలా పుస్తకాలు రచించారు .ఇప్పుదు ”అక్కినేని వ్యక్తిత్వ వికాసం ”ఆరునెలలు కఠోర శ్రమ చేసి విషయ సేకరణ ఫోటో సేకరణ చేసి చాలా గొప్పగా రాసిన పుస్తకం .విద్యార్ధులకే కాదు యువతకు ,అందరికీ మార్గ దర్శనమే ఈ పుస్తకం . 600పేజీలతో అందమైన ముఖ చిత్రాలతో లోపల అక్కినేని చిన్నప్పటి నుండి మనల నందర్నీ వదిలి పోయేముందు నటించిన ”మనం ”వరకు ఫోటోలున్నాయి ..ఎంద రెందరో ప్రముఖుల వ్యాసాలూ మనోభావాలు ,హీరో ల హీరోయిన్ ల మనసులోని మాటలు వారి వారి మాటలలోనే చక్కగా గుది గుచ్చి తెచ్చిన పుస్తకం .బాగా వేగం గా చదివించే గొప్ప లక్షణం ఉన్న పుస్తకం .ఒకరక0 గా వ్యక్తిత్వ వికాసానికి కరదీపిక…ఇది ”విజేతా కాంపి టీషన్స్ ”’వారి పుస్తకం శ్రీ బండ్ల సాయిబాబు సమర్పణ ..శ్రీ గోవింద రాజు చక్రధర్ రచన. .ఖరీదు 300 రూపాయలు ..కొని చదివి జాగ్రత్తగా దాచుకోవాల్సిన పుస్తకం మాత్రమె కాదు జీవితాలను తీర్చి దిద్దుకోవటానికి కావలసిన అన్నిరకాల విషయాలు ఉన్నాయి .ఈ పుస్తకాన్ని దేశ విదేశాలలో ఉన్న అక్కినేని అభిమానులకు –ఆయన భాషలో ”ప్రేక్షక దేవుళ్ళకు ”అంకిత మివ్వటం ఎంతో సముచితం గా ఉంది ..పట్టుదల, క్రమశిక్షణ, దీక్ష ,శ్రమ అక్కినేని విజయ రహస్యాలు ఆవి అందరి విజయ రహస్యాలు అవ్వాలన్న తపన తో తెచ్చిన పుస్తకం .ఇన్దులొ అక్కినేని తన నిర్మాతలు, దర్శకులు,నటీ నటులు టెక్నీషియన్లు ,రాజకీయ నాయకులు ,రచయితల గురించి చెప్పిన అభిప్రాయాలను పొందు పరచారు ..వారూ ఈయనపై వెలి బుచ్చిన భావాలనూ చేర్చారు. చివరలో అక్కినేనితొ శ్రీ పురాణం వెంకట రమణ చేసిన వాకింగ్ ఇంటర్వ్యు హై లైట్ .అక్కినెని నవ్వు తో ఉన్న రెండు ముఖ చిత్రాలు అద్భుతః అందులోచివరి ముఖ చిత్రం ఇక ఈ జీవిత నాటక చిత్రానికి ”టాటా ,వీడుకోలు గుడ్ బై ,ఇంక సెలవు ”అంటున్నట్లు రెండు చేతులూ పైకెత్తి నమస్కారం చేస్స్తున్న భంగిమ, ముఖం లోచెదరని, చెరగని చిరునవ్వు పరమాద్భుతః ,–కొనండి చదవండి ,దాచుకోండి ,వ్యక్తిత్వం పెంచుకోండి . -మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ ,
ముఖ చిత్రాల ఫోటోలు జత చేశాను చూడండి
.. పుస్తక ప్రాప్తి స్థానం
Bandla Publications pvt limited
MIG /Plot no .13.Bathakamma Kunta
Shivam road ,Bagh Amberpet -Hyderabad -500013
phone -040-2742 9494 ,,27406336,,
Mobile -99632 93399

