గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 4-శతకంఠరామాయణ కవి-పరశు రామ రాపంతుల అనంత రామ పండితుడు (1820)

నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4

4-శతకంఠరామాయణ కవి-పరశు  రామ రాపంతుల అనంత రామ పండితుడు (1820)

సీతారామాంజనేయ సంవాదం రాసిన పరశురామ పంతుల లింగ మూర్తి కి ఐదవ తరం వాడైన అనంత పండిత రాయలు 19 శతాబ్ది వాడు .వరంగల్ దగ్గర అంబాలా గ్రామ  నివాసి .వెంకా౦బికా ,రామ కృష్ణ సోమయాజుల పుత్రుడు .భారద్వాజ గోత్రం .అనత మంజరి టీకా- రాశాడు. ’’సీతా విజయ చంపు ‘’రాశాడు .దురదృష్ట వశాత్తు మూడవ స్తబకం లో ఆగిపోయింది .ఇందులో సీతాదేవి శత కంఠ రావణ వధ చేసిన కద ఉంది .రావణుడికి వంద తలకాయలున్నట్లు రాయటం వలన దీనికి ‘’శత కంఠ రామాయణం ‘’ అని కూడా అంటారు .దీనికి మూలం వసిష్ట రామాయణం .మొదట్లో లక్ష్మీనారాయణ ,సరస్వతి ఆంజనేయ విఘ్నేశ్వర దేవతలను ఇదే వరుసలో స్తుతి౦చాడుకవి .తర్వాత తన వంశ చరిత్ర చెప్పుకున్నాడు .పిమ్మట వ్యాస వాల్మీక కాళిదాస కవులను స్తుతింఛి కధలోకి ప్రవేశించాడు .శివుడు పార్వతికి చెప్పిన కధను వ్యాసమహర్షి నైమిశారణ్య ఋషులకు తెలియ జేశాడు .కొన్ని వచనాలతో సహా మొదటి స్తబకం లో 94శ్లోకాలున్నాయి .మొదటి ఇరవై శ్లోకాలలో పూర్వ రామాయణ కధను చెప్పాడు .రావణుడికి బంధువైన శత కంఠుడు రావణ సంహార వార్త విని మూడులోకాల పై దాడి చేసి చీకటిలో ముంచేస్తాడు .శ్రీమహా విష్ణువు సలహాపై ఇంద్రాది దేవతలు ఈ విషయాన్ని అయోధ్య రామునికి నివేదిస్తారు .శ్రీరాముడు వారికి అభయ మివ్వటం తో మొదటి స్తబకం పూర్తి అవుతుంది .ఇందులో శ్రీరాముని ధైర్య పరాక్రమాల వర్ణన శ్లోకం చూద్దాం

‘’ధైర్యే నమ్నీ కృతో మేరుర్జన్డ్యవాన్ తుహినా చలః –మంద రాద్రి రపి భ్రాంతం కదం స్యుర్యేన తేసమాః ‘’

రెండవ స్తబకం లో 68శ్లోకాలున్నాయి ..ఆరు ఋతువుల వర్ణన ఇందులో విస్తారంగా చేశాడు .సీతారాముల క్రీడలున్నాయి .పుష్పవనాలు జలదారలను వర్ణించాడు .ముక్త పద గ్రస్తం లో వసంతు ఋతు వర్ణన బాగుంటుంది .

‘’శ్రీమత్పల్లవ తల్లజ సముల్ల సత్ప్రసూన సాయక సముత్స ముచిత ,వాసంతికా లతో దవిసితమహామండప పటలీవిభాసమానం ,విభాస మాన స్వద్రుమన్మనోహర మరంద బిందు సముయదాస్వాదానంద తుందిల సమున్మత్త శీలాముఖం ,శీలా ముఖ ‘’ఇలా సాగిపోతుంది .వర్షతువులో  ఆరుద్ర పురుగు వర్ణన  కవితాబద్ధం చేశాడు కవి .

‘’తదేంద్ర గోషాః కాశ్యప్యాం కురు విందఇవా బభుః-మహేంద్రాయ బలిం దాతుం విన్యస్తా వర్ష హేతవే ‘’

మూడవ స్తబకం లో 67మాత్రమె ఉన్నాయి .ఇవన్నీ సీతారామ కామక్రీడా వర్ణనలే .సభ్యతా సరిహద్దు దాటి కూడా వర్ణించిన శ్లోకాలున్నాయి .ఉదయ సూర్య వర్ణన ముచ్చటగా ఉంది –

‘’చకాశ కౌముదీ కామం కౌముదం తన్వతీద్విజాన్ –ప్రాచీ దిక్కామినీ కాంత నాసా ముక్తా రుచిర్యదా ‘’

అనంత రామ పండితకవి ఛందో వైవిధ్యం బాగా చూపాడు ఇదే తర్వాత తెలుగు కవులకు మార్గదర్శన మైంది .చంపు బదులు చంబు అని వాడిన మొదటికవి ఈయనే .

5-ఆసూరి అనంతా చార్య (1930)

ఇరవయ్యవ శతాబ్ది చివరికవి ,మహోన్నత పండితుడు ఆసూరి అనంతాచార్య .తెలంగాణా వాడు .జమీ౦దారులతో ఎన్నో సన్మానాలు అందుకోన్నవాడు .నాల్గొండ జిల్లా బేతవోలు ,కృష్ణా జిల్లా మునగాల జమీందార్లు చేసిన సత్కారం చిరస్మరణీయం .’’చంపూ రాఘవం ‘’1863లో  రచించాడు .ఇది 1929లో ప్రచురితమైంది .ఇది భోజుని చంపువు ను మించి ఉందని శిష్యుడుఆసూరి  వెంకట నృసింహా చార్య అన్నాడు .దీన్ని తెలుగు అక్షరాలలో ప్రింట్ చేశారు .కనుక మిగిలిన వారికి దీని సౌరభం తెలియటం కష్టమైంది .భోజుడిని అనుకరించటం లక్ష్యంకాదుకాని శ్రీ వైష్ణవ ప్రచారానికే ప్రాదాన్యమిచ్చాడు .గురువు నృసింహ సూరి ని స్తుతిస్తూ కావ్యం మొదలు పెట్టాడు .60విశిష్టాద్వైత మతాలను వివరించాడు .విశిష్టాద్వైతం లో పరమ శివుడు శ్రీమహా విష్ణువుకు పరమ భక్తుడు .

రావణుడు అష్ట దిక్పాలకులను బంధించి అష్ట కస్టాలు పెట్టె వర్ణ న చూడండి –‘’సోయం బిడౌజసం నిస్తేజసం తనూన పాతం ,సమవర్తినం శ్రమ వర్తినం ,నైక్రుతం భీరు రుతం ,ప్రచేతసం విచేతసం ,జగత్ప్రాణం గలత్ప్రాణం,ధననాధం ధన బాదం ,గార కంఠం కరు కుంఠం,ప్రభాకరం అభాకరం ,తారాపతిం కరాస్తితం  చ సతతం సంతనోతీతి ‘’

లక్ష్మణుడి శేషత్వం శ్రీ మత్వాలను రామునితో అడవికి వెళ్ళేటప్పుడు తెలియ జేశాడు .లంక లోని సీత తన ఇల్లాలు కావాలని రావణుడి కోరిక తెలిపే శ్లోకం –‘’పశ్య దోషా చరేశం మాం ,భవత్వంసహా ధర్మిణా-నైచే త్వమాహవ మేవాంతే ,వసన్నద్య నిపీడయే ‘’.ఈ కావ్యం 70సార్లు ముద్రణ పొందింది .కిష్కింద కాండలో ని వసంత ఋతువు వర్ణనలో లో ఆసూరికవి దీప్తి ఆ సూర్యుని లా భాసిస్తుంది .భోజ పోలికలేమీ లేకుండా సృజన పరాకాష్ట గా ఉంటుంది .రెండు శ్లోకాలు మచ్చుకి

‘’చకోరా జ్యోత్స్నా యాం త్రుప్యం చాతకా ఇవ వర్శతః –వవర్దురప్యకూపారా స్తభ కామ్క ఇవ వైణవః

స్ప్రుటంతీన్దీవరాస్తోమా ద్రుశో నృణాం నిమీలితాః-చరన్తి రాక్షసాస్సర్వే నశ్యంతి చ తమోగుణాః’’.రామ రావణ యుద్ధం లో కవి  శృంగార ,ఉత్సాహ ,కరుణ ,ఆశ్చర్య ,అతిహాస ,భయానక  భీభత్స రౌద్ర ,శాంత అనే తొమ్మిది రసాలను వర్ణించాడు .

సీతా రాముల జన రంజక పాలన తో చంపూ రాఘవం పూర్తవుతుంది .’’తారక సంకుల మాస మహీయం తారక మేవ భవాబ్ది గతానాం –కొరకితా ఋతుకాల మనాప్త ,సార మితి కిల సస్య జలాప్తా ‘’.చివరగా ఫల స్తుతి చెప్పాడు ‘’యోవా ఇమాం రామ కదా సుదామా దధాతిభూమౌ స సుపర్వరాజః –యధేహ సౌభాగ్య కళాది పూర్ణః స్తతః పదం శాశ్వతముల్లభేత ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-11-15-ఉయ్యూరు

‘’

 

 

 

 

 

 

 

‘’

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.