’నవ్యాంధ్ర నవ నిర్మాణం’’ –కవి సమ్మేళనం -1
48వ గ్రంధాలయ వారోత్సవాల సందర్భం గా
‘’నవ్యాంధ్ర నవ నిర్మాణం’’ –కవి సమ్మేళనం -1
వేదిక –టాగూర్ గ్రంధాలయం –విజయవాడ
తేది ,సమయం -18-11-15-బుధవారం –సాయంత్రం -6గం లకు
నిర్వహణ –రమ్యభారతి ,సరసభారతి, మల్లెతీగ సాహితీ సంస్థలు
కవితలు
1-ఐతే ఒకే –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్
సింగపూర్ సి౦గారమైనా
చైనా చైతన్యమైనా
జపాన్ నాణ్యమైనా
మలేసియా మహా భాగ్యమైనా
దేన్ని అనుసరించి ,అనుకరించి నిర్మించినా
మనభాష ,మన సంస్కృతీ సంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా
బడుగు జీవుల బతుకులతో చెలగాటమాడకుండా
రైతన్న ,నేతన్న ల నడుం విరవ కుండా
నవ్యాంధ్ర నవ నిర్మాణం సాగిస్తామని నమ్మకం కలిగిస్తారా
ఐతే ఒకే .
2-నవ్యాంధ్ర నిర్మాణం –శ్రీమతి కోపూరి పుష్పాదేవి
అద్భుత రాజ దాని అమరావతి
ఆంధ్రుల ఆశ శ్వాస అమరావతి
అయిన వారికి ఆకులు వదిలి
కాని వారికి క౦చాల౦ది స్తోంది అమరావతి
పచ్చని చేలను ఫలహారం చేసి
బంగారు గుడ్లు పెడతానంటోంది
అరచేతిలో వైకు౦ఠాలు మా కొద్దు
ఆకాశానికి నిచ్చెనలసలే వద్దు
అంకితభావం ఏంతో ముద్దు
కృషి తైలం పోసి
శ్రమ జ్యోతులు వెలిగిద్దాం
అపూర్వ అమరావతిని సాధిద్దాం
ఆంధ్రుల పోరాట పటిమే కాక
నిర్మాణ సౌభాగ్యాన్నీ
ప్రపంచానికి చాటి చెబుదాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-15

