ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -95
41-ఐరిష్ సాహిత్య పునరుద్ధరణ చేసిన -విలియం బట్లర్ యేట్స్-2(చివరిభాగం )
కవిత్వాన్నే మాధ్యమంగా ఎంచుకొని విలువైన ,ముందు చూపున్న కవిత్వం రాశాడు .ముప్ఫై ఏళ్ళు వచ్చేసరికి ఆరు కవితా సంపుటాలు రాసి ప్రచురించాడు .పుస్తకాలు స్లిమ్ గా ఉన్న అందులోని కవితాసారం బలమైనది గా ఉంది .కొన్ని ప్రతీకలకు మాత్రమె పరిమితమైనాడు .’’sentimentality is deceiving one;s self ,rhetoric is deceiving other people ‘’అనేది యేట్స్ అభిప్రాయం .34వయసులో ‘’దివిండ్ అమాంగ్ ది రీద్స్ ‘’ప్రచురించాడు ఇందులోనూ ఏదో ‘’ట్రాన్స్ ‘’లో ఉండి రాసినట్లు అనిపిస్తుంది కవిత్వం .
‘’All things uncomely and broken ,all things worn out and old –the cry of a child by the road way ,the creeak of a lumbering cart –the heavy steps of the ploughman ,splashing the wintry mold –are wronging your image that blossoms a rose in the deeps of my heart ‘’
ఇంకా మానవాతీత శక్తి ప్రభావాన్నే వివరిస్తున్నాడు .తన జీవిత కధను ‘’ది సాంగ్ ఆఫ్ వాన్దరింగ్ ఏగ్నెస్ ‘’ అనే సంగీత నాటిక లో రాసుకున్నాడు .
‘’I went out to the hazel wood –because a fire was in my mind –and cut and peeled a hezel wand –and hooked a berry to a thread –and when white moths were on the wing –and moth like stars were flickering out –I dropped the berry in a stream –and caught a little silver trout ‘’
నలభైలలో ప్రచురించిన ‘’రేస్పాన్సి బిలిటీస్’’,’’ది వైల్డ్ స్వాన్ ఎట్ కూలే ‘’కవితల్లో మార్పు కొట్టొచ్చినట్లు కన్పించింది .ప్రభావ శీలమైన కవిత్వం జాలువారింది .విషయానికి పరిమితమై రాశాడు .ఈ మార్పును స్వయంగా ‘’లేబిరింత్ ఆఫ్ ఇమేజెస్ ‘’లో చెప్పుకొన్నాడు –
‘’I made my song a coat –coveredwith embroideries-out of old mythologies –from heel to throat ‘’అని యదార్ధం ఒప్పుకున్నాడు .మానసిక సత్యమేకాక ఆధ్యాత్మిక నమ్మకం కావాలనుకొన్నాడు .
దెయ్యాలు లేక శక్తులు లేక స్పిరిట్స్ ను ఆహ్వానించి వారినే ‘’కమ్మ్యూని కేటర్’’లుగా భావించి యేట్స్ భార్యా భర్తలు ఎన్నో రాయించారు.ఇవన్నీ కలిపి ‘’ది విజన్ ‘’పేర 52వ ఏట విడుదల చేశాడు .దీని రెండవ భాగం ప్రచురించే నాటికి యేట్స్ సమాజంలో మహా గౌరవనీయ వ్యక్తీ అయ్యాడు .ఐరిష్ ఫ్రీ స్టేట్ కు ఆరేళ్ళు సెనేటర్ గా సేవలందించాడు .ఆయన అనుసరిస్తున్న గోప్యత(ఈసోటేరిక్) వలన రాజకీయాలకు ,కవిత్వానికి ఏ ఇబ్బందీ కలగ లేదు .పైగా బాగా కలిసొచ్చింది కూడా .1923లో సాహిత్యం లో యేట్స్ నోబెల్ బహుమతి పొందాడు .ఆయన ఒక ప్రపంచానికి మాత్రమే పౌరుడు కాదు. రెండు ప్రపంచాల పౌరుడు .అవి ఒకటి కనిపించే ప్రపంచం ఒకటి మనకు కనిపించని ఆయనే చూడగలిగే మార్మిక ప్రపంచం .యాభై- అరవై మధ్య వయసులో రాసిన కవిత్వం అత్యంత విలువైనది అవసరమైనది మార్గ దర్శకమైనది గా ఉంది .అంతకు పూర్వం లేని సాధికారత కవిత్వం పై సాధించాడిప్పుడు .కనిపించని దయ్యాలు ఫైరీ టేల్స్ ,పుక్కిటి పురాణాలు వదిలేసి ప్రజలు తక్షణ సమస్యలపై స్పందించి రాశాడు .మొదట్లో ప్రీ రాఫల్డై ట్ గా ఉన్నప్పుడు తన ముఖాన్ని అంతులేని తారాసమూహం లో దాచుకొన్నాడు .ఇప్పుడు మానవ రక్త సంబంధం తో అమితానందం పొందుతున్నాడు .ఈ స్తితిని చెప్పుకొంటూ ‘’I am content to follow to its source every event in action or in thought ‘’.
‘’ఏ డైలాగ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ సోల్ ‘’కవితలో తన్ను తాను ఆవిష్కరించుకొన్నాడు –
‘’When such as I cast out remorse –so great a sweetness flows into the breast we must laugh and we must sing –we are blest by every thing –every thing we look uponis blest ‘’సాంస్కృతిక జాగృతిని తన మాతృదేశం ఐర్ లాండ్ కు ఇచ్చిన ఘనత యేట్స్ కవి ది .’’Romantic ireland’s dead and gone –it is with O’Leary in the grave ‘’అని చెప్పాడు .మర్యాద, మన్నన గౌరవం తన దేశం లో మంట గలిసి పోయినందుకు వ్యధ చెందాడు .కోపం ద్వేషం అసహనం అందలం ఎక్కినందుకు బాధ పడ్డాడు .అందుకే కవిత్వం లో హెచ్చరిక జారీచేశాడు –
‘’you thinkit horrible that lust and rage-should dance attendance upon my old age –they were not such a plague when I was young –what else have I to spur me into song ?అని ప్రశ్నించాడు .ఇప్పటిదాకా ఉన్న ఊహా ప్రపంచం కుప్ప కూలి పోయింది వాస్తవం బోధ పడింది .ఐర్లాండ్ కు దూరంగా రపల్లోఅనే చిన్న పట్నంఇటాలియన్ రివేరా లో ఉన్నాడు .ఇది దక్షిణ ఫ్రాన్స్ లో ఉంది .యూరప్ పర్యటన చేశాడు .అక్కడి విలువల పతనాన్ని సహించలేక పోయాడు .’’things fall apart –centre can not hold ‘’అని ఆవేదన చెందాడు .మెరుపులతో ‘’సెకండ్ కమింగ్ ‘’రాసి విభ్రాంతి కలిగించాడు .
చనిపోయే దాకా యేట్స్ రాస్తూనే ఉన్నాడు .ఆయన చివరి ముఖ్య రచన ‘’బైజా౦టి యం’’.ఇందులో కవితా ప్రతిభ అంతా ప్రదర్శించాడు .కవిత్వార౦భంఎలా ఉండాలో మచ్చుకి చూపించాడు ఇమేజెస్ ఎలా వాడాలో అత్యద్భుతంగా వాడి చూపాడు .70వ ఏట శారీరకంగా బలహీనుడయ్యాడు శ్వాసపీల్చటం కష్టమయ్యేది .బాధలు ఎక్కువయ్యాయి. తానిక బతకటం కంటే చావటమే నయం అని భార్య కు చెప్పుకొన్నాడు .1938 చివర్లో చలి ఎక్కువగా లేక పోయినా చలికి తట్టుకోలేక పోయాడు .జనవరిలోతీవ్రంగా గుండె జబ్బు వచ్చింది .కోమాలో ఉన్నాడు .చివరికి గుండె ఆగి 28-1-1939న 74వ ఏట ఈ ఐరిష్ స్వాతంత్ర యోధుడు మహాకవి సెనేటర్ మరణించాడు .
యేట్స్ మరణానంతరం ఆయన జీవిత చరిత్రలు చాలా వచ్చాయి .ఆయన సింబాలిజం పై అనేక వ్యాఖ్యానాలు వెలువడ్డాయి .ప్రముఖ విమర్శకుల చేత రాయించిన ఇరవైనాలుగు వ్యాసాల ను ‘’దిపెర్మనెన్స్ ఆఫ్ యేట్స్ ‘’పేరిట వెలువడింది .జాన్ కరో రామ్సన్ ‘’యేట్స్ అండ్ హిస్ సింబల్స్ ‘’పుస్తకం రాశాడు .ఆయన కవిత్వం ఇంకా ప్రభావితం చేస్తూనే ఉంది .యువకవులపై యేట్స్ ప్రభావం అనంతం .సమకాలీన కవిత్వాన్ని తన స్వంత శైలి,గాఢత్వాలతో పరిపుష్టి చేశాడు .ఏది రాసినా మహోన్నత భావం తో చెప్పి మెప్పించిన కవి యేట్స్ .
నిప్పులు కురిపించే కవిత్వం రాసిన అమెరికన్ కవి ఎజ్రా పౌండ్ కు యేట్స్ సన్నిహితుడు .రవీంద్రుని ఆంగ్ల గీతాంజలికి యేట్స్ ముందుమాట రాశాడు .ఇంగ్లాండ్ కవులు స్పెన్సర్ షెల్లీ ప్రీ రాఫెలైట్స్ ల ప్రభావం ఉన్నవాడు . పోను పోను వాస్తవానికి చాలా దగ్గరగా భౌతిక పరంగా రాశాడు .
1899లో యేట్స్ దంపతులు మిత్ర బృందం తోకలిసి ‘’ఐరిష్ లిటరరీ దియేటర్ ‘’స్థాపించారు . “We hope to find in Ireland an uncorrupted & imaginative audience trained to listen by its passion for oratory … & that freedom to experiment which is not found in the theatres of England, & without which no new movement in art or literature can succeed.”[51]
అని దీని మేనిఫెస్టో రాశాడు యేట్స్ .రెండేళ్ళ తర్వాత ఇది మూతపడింది .1909లో లండన్ లో అమెరికన్ కవి ఎజ్రా పౌండ్ ను కలిశాడు అప్పటినుండి వారి స్నేహం చివరివరకు ఉంది .
నోబెల్ ప్రైజ్ ను స్వీకరిస్తూ యేట్స్ కవి “I consider that this honour has come to me less as an individual than as a representative of Irish literature, it is part of Europe’s welcome to the Free State.”[66] ‘’అని తన మనోభావాన్ని తెలియ జేశాడు .స్వతంత్ర ఐర్లాండ్ దేశం ఏర్పడిన తర్వాతమైనారిటి ప్రొటెస్టెంట్ లకు మెజారిటీ కేధలిక్కులకు మధ్య విద్వేషాలు పెరిగాయి. దీనికి సమాధానం గా సెనేట్ లోనూ బయటా యేట్స్ అద్భుత ప్రసంగాలు చేసి చారిత్రాత్మక ప్రాముఖ్యాన్ని సాధించాడు ఆయన మాటలలోనే –‘’ “quixotically impressive” ambitions of the government and clergy, likening their campaign tactics to those of “medieval Spain.”[71] “Marriage is not to us a Sacrament, but, upon the other hand, the love of a man and woman, and the inseparable physical desire, are sacred. This conviction has come to us through ancient philosophy and modern literature, and it seems to us a most sacrilegious thing to persuade two people who hate each other … to live together, and it is to us no remedy to permit them to part if neither can re-marry.”[71] ఇది ఆయన సాధించిన అద్భుత విజయం .
తన సమాధి మీద తన కిష్టమైన తన కవితా పంక్తులను చెక్కించే ఏర్పాటు చేశాడు
– Cast a cold Eye
On Life, on Death.
Horseman, pass by!.
ఇరవయ్యవ శతాబ్దపు ప్రముఖ కవులలో యేట్స్ అతి ముఖ్యకవి .’’సింబలిస్ట్ పోయేట్’’గా గుర్తింప బడ్డాడు .ప్రతి పదానికి పైకి కనిపించే అర్ధం కంటే లోపలి అంతరార్దా లను ఆవిష్కరిస్తూ కవిత్వం రాయటం యేట్స్ ప్రత్యేకత .ఫ్రీ వెర్స్ తో కదను తొక్కుతూ ఆధునిక కవులు ఉంటె సాంప్రదాయ బద్ధమైన కవిత్వం తో జిగేల్ మనిపించాడు .మొదట్లో ఐరిష్ మిత్ అండ్ ఫోక్ లోర్ ప్రభావం తో రాసినా తర్వాతజనం తో మమేకమై రాశాడు .కొందరు విమర్శకుల దృష్టిలో యేట్స్ 19 వ 20వ శతాబ్దాల కవిత్వ వారధి .హిందూ దియసాఫికల్ భావాలను మంత్రాలు తంత్రాలను నమ్మినవాడు ‘’డ్రీమర్ ఆఫ్ డ్రీమ్స్ .’’అంటారు ఆయనను .జార్జి మూర్ పై ప్రభావం చూపాడు .బెర్నార్డ్ షాను తన’’జాన్ బుల్ ‘’అనే నాటకానికి పని చేయించాడు .నాటక ప్రయోగాలతో మాంచెస్టర్ ప్లేయర్స్ ను ఆకర్షించాడు .అమెరికా ,యూరప్ లలో చిన్న దియేటర్ నిర్మాణానికి ప్రోత్సహించాడు. నాటక రంగానికి ఐరిష్ ఇంగ్లిష్ నటులు ప్రముఖులనే కాక ,ఆక్స్ ఫర్డ్ కేం బ్రిడ్జి , హార్వర్డ్ సోఫిస్టికేట్స్ ను కూడా వాడుకోవటం యేట్స్ ప్రత్యేకత .
మరో ప్రముఖునితో కలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-15-ఉయ్యూరు

