ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -96
42-టైం మెషీన్ వంటి సైన్స్ ఫిక్షన్ రాసిన –హెచ్ .జి .వెల్స్
నిష్కపట యదార్ధ వాది,నిష్కర్షక విమర్శకుడు అనే రెండే రెండు మాటలతో హెచ్ జి వేల్స్ ను ఆవిష్కరించవచ్చు .1936లో 70వ ఏట ఆయన ‘’The Late H ..G. Wells’’ పేరిట రాసుకొన్న ఆయన జీవితచరిత్రను లివింగ్ ఏజ్ ప్రచురించింది .అప్పటికి ఆయన ఎంతో ఆరోగ్యంగా జీవించే ఉన్నాడు .తన చరిత్ర ‘’పోస్ట్ మార్టెం ఎస్టిమేట్ ‘’అని చెప్పుకొన్నాడు .అందులో మొదటి పేరా లో ‘’నిన్నమధ్యాహ్నమే గుండె జబ్బుతో97వ ఏట చనిపోయిన హెచ్ జి వెల్స్ పేరు ,యువత తో సాన్నిహిత్యం కలిగి ఉంటుంది .మధ్య వయస్కుల జ్ఞాపకాలు ఈ శతాబ్దపు ప్రారంభాన్ని ,ఆయన రాసిన పుస్తకాలను వాటి పేర్లను గుర్తుంచుకొంటారు .అతని రచనలను మననం చేసు కొంటారు . చాలా పుస్తకాలు రాశాడు .విలువైన విమర్శ గ్రంధాలు రాశాడు .తనపై గ్రందాలెన్నో వచ్చాయి సాహిత్యాకాశం లో మిలమిల మెరిసే తార .తనను తాను రోజర్ బేకన్ తో పోల్చుకోవటం భేషజమే .అతని మూలాలు సాధారణమైనవే .తండ్రి ఒక తోటమాలి .తర్వాత చిన్న దుకాణానికి యజమాని మాత్రమేకాక క్రికెట్ ప్లేయర్ .అతని తల్లి ఒక ఇన్ కీపర్ కూతురు .పెళ్ళికాక ముందు సర్వెంట్ మెయిడ్ .వెల్స్ లు ఎప్పుడూ ఈ సాంఘిక నిమ్నతను గురించి ఆలోచి౦చలేదు .కొత్తప్రపంచం లో స్వేచ్చా పౌరుడు .అతను లిబరల్ డెమొక్రాట్ .ఆలోచించే,విమర్శించే ,చర్చించే అనంత స్వేచ్చ హక్కూ ఉన్నవాడు .సోషలిస్ట్ .వర్గ జాతీయతలఆధిపత్యానికి వ్యతిరేకి ‘’ అని రాసుకొన్నాడు వెల్స్.ఇదీ అతని ప్రత్యేకత .
ముగ్గురుసోదరులలోచిన్నవాడైన హెర్బర్ట్ జార్జి వెల్ల్స్21-11-1866లో కెంట్ లోని బ్రామ్లీ లో పుట్టాడు .తన పుట్టుక లోని నిమ్నాస్తాయిని గూర్చి ఆలోచించలేదు అంతే కాదు కింది మధ్యతరగతి జనం విషయం కూడా ఆయనకు పట్టేదికాదు.పుట్టుకతో వచ్చిన’’ కాక్నీ ఉచ్చారణ ‘’మాత్రం మర్చి పోలేదు .చనిపోయే ముందు ‘’I may be scientific aristocrat ,but I am no gentleman ‘’అని నిర్భయం గా చెప్పాడు .’’బార్టీ’’అనే ముద్దు పేరున్న వెల్స్ ప్రాధమిక విద్య పెద్దగా లేదు .అతి పేదకుటుంబం కనుక చదువుకొనే స్తోమత లేదు ఇది అతన్ని జీవితాంతం బాధించింది .తండ్రి దుకాణం లో సహాయం చేస్తూ ఉండచ్చునను కొన్నాడు .కాని విధి వశాత్తు ఎనిమిదో ఏట కాలు విరిగింది .విశ్రాంతి తీసుకొంటూ ఆరోగ్యాన్ని చక్క బరుచు కొంటూ దొరికిన పుస్తకాలన్నీఆబగా చదివాడు .డికెన్స్ ,వాషింగ్టన్ ఇర్వింగ్ ,రచనలు ఆపోసన పట్టాడు .కాని స్కాట్ నవలలు బోర్ కొట్టించాయి. అయినా ష్కాట్ నవలలు ‘’మర్మియాన్ ‘,ది లేడీ ఆఫ్ ది లేక్’’మొత్తం కంఠస్తం చేశాడు .గడగడా అప్ప చెప్పేవాడు .
చదివే అలవాటే తనకు గొప్ప రక్షణ నిచ్చిన్దన్నాడు .13వ ఏట ఒక కెమిస్ట్ దగ్గర సహాయకుడిగా చేరాడు .కొంతకాలం బట్టల కొట్లో ఉన్నాడు .పనులు చేస్తూ ఖాళీ సమయాలలో క్లాసులకు వెడుతూ 15వ ఏట మిడ్ హర్స్ట్ గ్రామర్ స్కూల్ లో’’ డోర్ కీపర్;;గా చేస్తూ చదువు కొన సాగించాడు .18వ ఏట లండన్ లోని సౌత్ కేన్నిన్ టన్ లోఉన్న కాలేజ్ ఆఫ్ సైన్స్ లో చేరటానికి స్కాలర్షిప్ ఆఫర్ పొందాడు .అక్కడ ప్రపంచ ప్రసిద్ధ బయాలజిస్ట్ థామస్ హుక్స్లీ వద్ద నిద్య నేర్చాడు .ఖాళీ సమయాలలో వెనక బడిన విద్యార్ధుల అసైన్ మెంట్లు చేసి డబ్బు సంపాదించేవాడు .టీచర్ గా పని చేయటానికి సిద్ధ పడ్డాడు .21వయసులో లండన్ యూని వర్సిటి నుంచి డిగ్రీ చేతికొచ్చింది .అండర్ గ్రాడ్యుయేట్ గా ఉన్నంతకాలం ఎప్పుడూ ఆకలితో అలమటిస్తూ ఉండేవాడు .చాలినంత తినటం అసలు ఉండేదేకాదు .గుంటకళ్ళు ,పాలిపోయిన ముఖం ఎముకల పోగుగా అప్పుడు ఉండేవాడు వెల్స్.తర్వాత మనం చూసే వెల్స్ ఫోటోలకు ఆనాటి వెల్స్ ఫోటోలకు హస్తి మశకాంతర భేదం ఉంటుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-12-15-ఉయ్యూరు

