సఘాల్ మన్మోహిని జట్షి సంక్షేమ కార్యక్రమాలు – గబ్బిట దుర్గా ప్రసాద్
వివిధ సంక్షేమ కార్యక్రమాలలో సేవ చేసిన – సఘాల్ మన్మోహిని జట్షి
మూర్తీభవించిన మానవత్వంతో కార్మిక సంఘాలను నిర్వహించి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించిన సఘాల్ ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించి ,లాహోర్ లో ,పలుకుబడి ,అభ్యుదయ భావాలున్న నెహ్రూ కుటుంబ సభ్యురాలుగా పెరిగింది .ఆమె తండ్రి లాడ్లీ ప్రసాద్ జట్షి మోతీలాల్ నెహ్రూ కు మేనల్లుడు .ఆమె తల్లి ఫెమినిస్ట్ .మహిళా క్లబ్ లను నిర్వహిస్తూ దానధర్మాలలో ప్రసిద్ధి చెందింది .తల్లి లాహోర్ లోని య౦గ్ వుమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ .(వై .డబ్ల్యు .సి. ఏ.)లో సాయం తరగతులకు సైకిల్ మీద వెళ్ళేది .ఆ కాలంలో ఇండియాలో ఏ స్త్రీకూడా సైకిల్ తోక్కేదికాదు .ఈమెయే లాహోర్ లో ధైర్య సాహసాలతో సైకిల్ తొక్కిన మొట్టమొదటి భారతీయ మహిళ .తనకూతురు సఘాల్ ను కూడా సైకిల్ తొక్కటమే కాదు, గుర్రపు స్వారీ కూడా చేయమని ప్రోత్సహించేది .తన నలుగురు కుమార్తెలను ఉన్నత విద్య నేర్వమని హితవు చెప్పింది .సఘాల్ లాహోర్ లో హిస్టరీ లో 1929లో ఏం. ఏ. పాసైంది .
మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమ పిలుపు నివ్వగానే సఘాల్ బహిరంగ సభలలో మాట్లాడి జనాన్ని ఉత్తేజ పరచి ఉద్యమ భాగ స్వాములను చేసేది .తల్లి ఇద్దరుసోదరిలతో సహా 1930-32కాలం లో తీవ్రమైన ఉద్యమాలు నడిపి కాలనీ ప్రభుత్వం పై ప్రజాగ్రహాన్ని నిరూపించింది .ఆమె చేబట్టిన ఆందోళనలు ఎప్పుడూ అహింసా యుతంగానే శాంతియుతంగానే ఉండేవి .చట్ట ధిక్కారం ఉండేదికాదు .1935లో కాంగ్రెస్ కు చెందిన ఒక మహిళా విద్యాలయం ప్రిన్సిపాల్ గాబీహార్ రాష్ట్రం లో పని చేసింది .అక్కడ అనేక సంస్కరణలు అమలు పరచింది .వయసుమళ్ళినవిద్యార్ధినులకు ఫిజికల్ ఫిట్ నెస్ క్లాసులు నిర్వహించింది .దీన్నిఆడపిల్లల కుటుంబాలు వ్యతిరేకించాయి . .
సఘాల్ 1935లో వివాహం చేసుకొని బొంబాయ్ వెళ్లి అక్కడ మహిళా కార్యక్రమాలలో పాల్గొన్నది .1947లో భారత దేశం స్వాతంత్ర్యాన్ని పొందిన తొలి రోజుల్లో ఆహార కొరత తీవ్రంగా ఉండేది .అప్పుడామే అఖిలభారతమహిళా కేంద్ర ఆహార సంస్థ సభ్యురాలైంది .బియ్యం ,గోధుమలకు తీవ్ర కొరతగా ఉన్న ఆకాలం లో ఢిల్లీ లో ఒక కాంటీన్ నిర్వహించి గోధుమ బియ్యం లేకుండా మిగిలిన ఆహారపదార్ధాలతో ఆహారం అందజేసేది .భారత దేశ స్వాతంత్ర్యం తర్వాత ఇండియా పాకిస్తాన్ విభజన వలన పాకిస్తాన్ నుంచి వలసవచ్చిన వేలాది శరణార్ధులను ఆదుకొనే బృహత్తర కార్య క్రమం మీద వేసుకొంది.భారత ప్రభుత్వ పునరావాస శాఖలో నెలకు ఒకే ఒక్క రూపాయి జీత౦ మాత్రమే తీసుకొంటూ ఆదర్శం గా అందులో సేవలందించింది సఘాల్ .వచ్చిన మహిళలకు ,పిల్లలకు ఆశ్రయాలు నెలకొల్పి సహాయం అందించింది .
పాకిస్తాన్ నుండి ఉద్యోగాలు కోల్పోయి వచ్చిన శరణార్ధుల మనుగడకోసం వారికి అప్పులు ఇప్పించటం లోను ,వారికి ఆర్ధిక సాయం చేయటం లో చొరవ చూపింది . వారు స్టిరపడి ఏదో ఉద్యోగమో వ్యాపారమో చేసుకొని జీవి౦చేదాకా సహాయం కొనసాగించింది .తర్వాత ఇండియన్ వుమెన్స్ క్రాఫ్ట్ సొసైటీ ప్రెసిడెంట్ అయింది .మంత్రివర్గం నుండి 1954లో రాజీనామా చేసి మరింతగా సంక్షేమ కార్య క్రమాలలో పాల్గొన్నది .
1952ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయింది .ఇక శక్తి యుక్తులన్నిటి ని కార్మిక సంఘాల వ్యవస్థీకరణ కోసమే వినియోగించింది .ఉత్తర భారత రైల్వే ఉద్యోగ సంఘానికి చైర్ పర్సన్ అయింది .మత్స కారుల సంఘం ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడింది .రక్షణ మంత్రిత్వ శాఖ లోవర్ డివిజన్ క్లార్క్స్ యూనియన్ అధ్యక్షురాలుగా ఎన్నికైంది .కార్మికులు ఉండే ప్రదేశాలలో మంచి సౌకర్యాలను కలిగించటానికి ,అక్కడ పారిశుధ్యాన్ని మెరుగు పరచటానికి శక్తి యుక్తులు ధార పోసిన ధీర సేవా మహిళ సఘాల్ .వారి కాలనీలలో రక్షిత మంచి నీటి సరఫరా చేయించింది .అధిక రుణాలతో ఇబ్బందిపడే కార్మికులకు ఉదారం గా అప్పులు మంజూరు చేయించేది .సాంఘిక సంక్షేమ పునరావాస దైరెక్ట రేట్ కు గౌరవ డైరెక్టర్ గా నియమింప బడింది .ఈ పదవులన్నీ ఆమె చేసిన సేవలకు ప్రతిఫలాలుగా వచ్చినవే పైరవీలతో పొందినవికావు .
1973లో ఢిల్లీ ‘’నేషనల్ ఫెడరేషన్ఆఫ్ ఇండియన్ వుమెన్ ‘’ లో చేరి గృహ హి౦స లకు పాల్పడిన భార్యలను కావాలని అగ్నికి ఆహుతి చేయబడిన స్త్రీలను సంరక్షించే కార్యక్రమం లో చురుకుగా పాల్గొన్నది . భార్తలచే బహిష్కృతులైన భార్య పిల్లల పాలిటి ఆపద్బాందవి అయింది .వారు స్వయం ఉపాధి పై జీవించ టానికి సహాయ పడింది .ఆర్ధిక౦గా ఆసరా నిచ్చింది .’’ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ ‘’(భారత శిశు సంక్షేమ శాఖ )లోపనిచేసి ,వారి ఉన్నతవిద్యాభ్యాసానికి అన్నివిధాలా సహకరించింది .వారిని దత్తత తీసుకొని బాధ్యతగా పెంచుకొనే వారిని గుర్తించి అ ఆపిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది .వారికోసం1950లో ‘’ఆర్య అనాధాలయం ‘స్థాపించి పోషకురాలుగా ఉంది .అందులో 600 మందికి ఆశ్రయం కలిపించిన వదాన్యురాలు .
ఢిల్లీలోని కామన్ వెల్త్ వుమెన్స్ అసోసియేషన్ లో 45ఏళ్ళు వైవిధ్యమైన సేవలను అందించింది .ఢిల్లీ కుటుంబ నియంత్రణ అసోసియేషన్ కు అధ్యక్షురాలిగా తొమ్మిదేళ్ళు ఉన్నది .’’ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ‘’ప్రెసిడెంట్ గా సఘాల్ విశేష సేవలు అందజేసింది .1990లో ఢిల్లీ లో వర్కింగ్ మెన్ హాస్టల్ నిర్మాణ పర్య వేక్షణ చేసింది .బహువిధ సేవాకార్యక్రమాలలో జీవితాన్ని పరిపూర్ణం చేసుకొన్న సఘాల్ 85ఏళ్ళు జీవించి 1944 లో మరణించింది .
-గబ్బిట దుర్గాప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

