నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
34-నడిమింటి గోపాలశాస్త్రి (1853-1920)
నడిమింటి భాగవత పతంజలి శాస్త్రి ,కామాక్షీ దంపతుల పుత్రుడు గోపాల శాస్త్రి .1853లో జన్మించి 1920లో మరణించాడు .అభినవ కాళిదాసు నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రిగారి మనవడు .తండ్రీ తాతలవలేనే శ్రీ విద్యోపాసకుడు .శివ గౌరీ పరిణయం ,శ్రీ రామాభ్య్దయం కావ్యాలు రాశాడు .చిన్నతమ్ముడు నరసింహ శాస్త్రి ఈ అన్నగురించి చెప్పిన శ్లోకం తప్ప ఏమీ లభించలేదు –
‘’శ్రీ మంగళేశ్వరస్య పాత్రో గోపాల పండితః -పతంజలి కవేః పుత్రో కృతవాన్ గ్రంధ యుగ్మకం
శ్రీ రామాభ్యుదయం చైవ గౌరీ పరిణయం తదా –క్రుతవానాతిభక్త్యా తు శ్రీ విద్యోపాసకో త్తమః
శ్రీ మద్విభవ పౌర్ణాభ్యాంశ్రవణేగురువాసరే –అర్ధ రాత్యాం జహో ప్రాణాన్ ధ్యాయన్ శివ ముమాపతిం ‘’
35-శేష గోవింద
గోదావరి జిల్లా నందపురి లో శేష యజ్ఞేశ్వర ,భీమా౦బలకు జన్మించిన గోవింద తారవాత వారణాసి వెళ్లి పోయాడు .తాత అనంతుడు 17వ శతాబ్దం వాడు .గోవింద ‘’ప్రచండ గరుడ వ్యాయోగంలేక వినతానందం , గూడార్ధ పద వ్యాఖ్య ,గోపాల లీలార్నవ భాణఅమరు శతక వ్యాఖ్యా రాశాడు .
వ్యాయోగం – గరుత్మంతుడు తల్లి వినతా దేవి కోరికపై స్వర్గం వెళ్లి అమృత కలశం తెచ్చి తల్లికి ఆనందం కల్గించటం కద.వారణాసి బిందుమాధవ ఉత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .
‘’దర్పాహం పూర్వ భాగ్య వ్యతికర కుపితాన్యోన్య ఫూత్కారకారీ –స్ఫాయత్క ర్ణావ సద్విరస న ధామాని భాస్త్రికాద్మా తతీద్రే
సూత్రధారుని చేత ఈ వ్యాయోగం ఎక్కడ ఎప్పుడు ఆడిండీ వివరాలు చెప్పించాడు
కవి రాసిన రెండవ కావ్య౦ గూడార్ధ పద దీపిక అంతా వేదా౦తమే .మొదటి శ్లోకం లో కవి గురించి కొంత తెలుస్తుంది .
;;యత్ప్రసాదదీన సిద్ధి పురుషార్ధ చతుష్టయం –సారస్వత్యావతారం తమ్ తమ్ వందే శ్రీ మధుసూదనం ‘’
గోవిందకవి మధుసూదనుని శిష్యుడు అని తెలుస్తోంది ,మధుసూదన సరస్వతి ?తండ్రి శేష పండితుడని చెప్పాడు .
36-కుందుర్తి గోవింద మంత్రి
శాండిల్య గోత్రీకుడైన కుందుర్తి గోవింద మంత్రి కొండవీడు ప్రభువుల పోషణలోని వాడు .23కాండాల’’హరి వంశ సార చరిత్ర ‘’రాశాడు .దీనికి అప్పయ దీక్షితులు వ్యాఖ్య రాశాడు .అయినా కవి వివరాలు తెలియ రాలేదు కుప్పాంబిక శ్రీ దల్లి మంత్రి ల కుమారుడు .భారతీ పరిణయం రాసిన గోవిన్దమంత్రీ ఈయన ఒకరే కావచ్చునని బిరుదరాజు వారి అభిప్రాయం. వేంకటపతి రాయల ఆస్థానకవి .ఈతని మనవడు,రామయ మంత్రి కొడుకు కుందుర్తి వెంకటాచలకవి తెలుగులో మిత్ర విందా పరిణయ కావ్యం రాశాడు .హరి వంశ సారచరిత్ర నుండి ఒకటి రెండు శ్లోకాలు –
‘’అస్తీందు రింద్రానుజా చిత్త శుక్తి ముక్తామణిర్మూల దనం సురాణాం-ఆమ్లాన ముక్తం సముమాస సవస్త్య పురావిదః పుష్ప మపాం యమాహుః
చివరి శ్లోకం
‘’యదుస్తతో జాయత దేవా యాన్యాం యశోధనానాం ప్రధమాభి దేయః –వంశో యదీయే వరదః పురాణోగోప్త్రుం జనత్ శ్రీ హరి రావిశాతీత్ ‘’
సశేషం
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -5-12-15-ఉయ్యూరు
