నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
37-చిన బొమ్మ భూపాలుడు (1549
నలబొమ్మ భూపాలునికొడుకు చిన బొమ్మ భూపాలుడు వెల్లూరు ప్రాంతాన్ని 1549నుండి 1579వరకు పాలించాడు .అప్పయ్య దీక్షితులవంటి మహా కవిపండితులను పోషించటమేకాక స్వయాన సంస్కృతాంధ్రాలలో కవికూడా .ఆరుసర్గలలో ‘’సంగీత రాఘవం ‘’రాశాడు .ఆరుకా౦డల రామాయణాన్ని ఇందులో చెప్పాడు .జయదేవుని గీత గోవిందం లాగా ఇదంతా వివిధ రాగ ,తాళ గీత మయమే .రాజుసంగీతం లో నిధి .మొదటి శ్లోకం –
‘’భాగ్యే నైవ భాగీరదాదివ ప్రాచేత సదాగాతా –యా కాండే రది గత్య సప్తభిరీవ సోతోభి రూర్వితలం ‘’
సౌరాష్ట్ర రాగం లో ఆట తాళం లో ఒక గేయం రాశాడు .ఇందులో దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి రావణ బాధలను విన్న వి౦చు కొని రామావతారం దాల్చి రావణ సంహారం చేయమని ప్రార్ధిస్తారు .
‘’శ్రీ రమణ పురాణ పురుష పరుషేణ దారుణారభస తరేణ శరేణ-కారుణీక విభో న చిరేణ’’//ద్రువపదం//
జహి జహి దశవదనం హి స్వామిన్ పశ్య గుణోమహితానస్య రణే విజితాన్ –వష్యమవస్యా మనం తసమస్తం తష్య న చేద్వితనో షి నిరస్తం —-‘’
మొదటికాండలో సీతారాముల వివాహం దాకా కద నడుస్తుంది .రెండవదానిలో భరతుడు పాదుకల స్వీకారం వరకు మూడులో రామలక్ష్మణులు పంపాసరోవరం చేరటం వరకు నాలుగులో ,సుగ్రీవాజ్నతో కపి సమూహాలు సీతాన్వేషణకు బయల్దేరటం దక్షిణ దిక్కుకు హనుమదాదులు వెళ్ళటం ,అయిదులో హనుమ లంకలో సీతా దేవిని చూసి రామునికి వచ్చి నివేదించటం ఆరవకాండ లో లంకనుండి రాక శ్రీరామ పట్టాభిషేకం కదచెప్పాడు .
శూర్పణఖ అన్న రావణుడిని సీతను బలాత్కారించమని చెప్పే ఘట్టం –
‘’నారీ కచిన్నస్య వీరస్య విదు –ద్వోరీ ఘాతుః సృష్టి రాద్యానవద్యా –సా చేన్నీతా సుందరీ నేష త్తస్మాదన్యస్త ద్వదేన ప్రకారః ‘’
సుగ్రీవుడు సీత పైనుండి జారవిడిచిన నగలను రాముడికి చూపిస్తూ చూసి దుఖాన్ని ఆపుకోలేక పోయిన సందర్భంగా గీతం –
‘’ఇయమపి జనక భువో మణి రశన ఆహామివ పరిహృత కటి తటకలనా //ద్రువపదం//
సాదు విదే సాదు కృతం వ్యయ యసి హరహర కియా దియమాం –హంసక శంసకదం త్వామితోసి హా విదితం నను మమ హి సఖాసి ‘’లంకనుంచి అయోధ్యకు వస్తూ సీతా దేవికి యుద్ధ రంగం లో తన వీరవిక్రమాన్ని ప్రదర్శించిన చోట్లను చూపుతూ వర్ణించిన గీతాలు బాగుంటాయి .ప్రతి కాండం చివరా ఒకే రకమైన –‘’ఇతి శ్రీ మత్పాద జకుల కళా శోదధీ పూర్ణ సుధా కరస్య నల బొమ్మా భూపాల తనూజస్య చినబొమ్మ భూపాల కస్య కృతౌ సంగీత రాఘవాఖ్యే మహా కావ్యే షస్టః సర్గః ‘’అనే రాశాడు .చివరి రెండు శ్లోకాలలో తాను చొక్కా నాద భూపాలుని సామంత రాజునని చెప్పుకొన్నాడు –
‘’ఇతి చొక్కనాద నరనాధ పరిపాలితో బొమ్మ నరపతి రాకురుదేదం—రఘురమణ విరహ వచనో పరచనకావన ముప శ్రుణుత పఠత మహా మోదం ‘’అని చెప్పాడు చొక్కనాధుడు విజయనగర సామ్రాజ్యం పై తిరుగుబాటు చేసిన మధుర రాజు కావచ్చునని చరిత్రకారుల భావన .
38-దామెర చిన వెంకట రాయలు(19-20శతాబ్దం౦)
తూర్పుగోదావరిజిల్లా జగ్గం పేటజమీన్దార్ దామెర చిన వెంకట రాయలు 19-20శతాబ్దాలకు చెందినవాడు .తెలుగు సంస్కృతాలలో గొప్పకవి .తండ్రి పెద వేంకటరాయలు వేంకటాచల మహాత్మ్యం రాశాడు .తాత లాగా కవుల ,పండితుల విద్వాంసుల మధ్య చినవెంకన కాలక్షేపం చేశాడు .గుల్మ శూల నొప్పితో చివరి రోజుల్లో బాధ పడేవాడు .ఈ బాదోప శమనం కోసం సూర్యనుగ్రహం పొందటానికి ‘’సూర్య సప్తతి ‘’రాశాడు .దీన్ని 11-6-1905న పూర్తీ చేశాడు
‘’అభ్యక్షి దిగ్జగ్లో సంఖ్యా ఠ చే శాలివాహనస్య శకే-విశ్వావసు శుక్రసిత శ్రీ విష్ణు దినే ర్కసప్తతి రచితా ‘’అన్నాడు
ఈకావ్యం అంతా శ్లేష యమకాలతో నడిపాడు .దీనికిజనసామాన్యానికి తెలిసేట్లు వ్యాఖ్య రాయమని కాకరపర్రువాసి ద్వివేది రామ శాస్త్రిని కోరాడు . ఈ రాజు సత్య దేవ శతకం కూడా రాశాడు .తన బాధను నివారించమని సూర్యుని ప్రార్ధించిన శ్లోకం –
‘’గుల్మాఖ్యో రోగోష్వతి జల్మోమాం బాధనేమ్బర మణోత్వం– నిర్మూలయ తద్వ్యాది నిర్మల మనసా తనోమి నతికర్మ ‘’
దాదాపు ప్రతిశ్లోకం లో శబ్దాలంకారాలను శ్లేషను ప్రయోగించాడు ‘
ఆలోకాలోక నగంస్వలోకస్య కలలోకస్తే –హి లోక మిత్ర తత్తన్ననీకానీక కర్మకుర్వంటి .
కవిప్రయోగించిన ప్రక్రుతాప్రకృత శ్లేషాల౦కారానికి ఉదాహరణ –
‘’వర వర్ణ దటిత సుపదాద్భుత బహులస్యే చ్చాగీత సుశ్లోకః –ఘన సుకుమార ప్రణయీ,తపన మయూరో వితోధిక క్లేశాత్ ‘’
తన పేరున్న శ్లోకం –‘’
‘’శ్రీ దామెర చిన వేంకటరాయ కృతా సూర్య సప్తతి ర్జయతు – సంతు బహావోపి దోషా క్షన్తవ్యా కరుణయా సాధ్విః’’
శ్రీ సత్యనారాయణ స్వామిపై చెప్పిన సత్య నారాయణాస్టకం నుండి ఒక ఉదాహరణ
‘’అత్యాత్పాప త్తీర్నాసత్యాహ్వాయ దేవతవ కృపయా –నిత్యం జనా జయంతి ప్రత్యక్షం సత్యమేవ తత్కరుణాత్
ఇందులోనూ చివరిశ్లోకం లో తన పేరు చెప్పుకొన్నాడు చిన వెంకట భూపతి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-12-15-ఉయ్యూరు

