నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
39—పరవస్తు చిన్నయ సూరి (1806-1862)
పరవస్తు వెంకట రంగయ్య,శ్రీనివాసాంబ లకు చిన్నయ సూరి తమిళనాడు చెంగల్ పట్టు జిల్లా శ్రీ పెరంబదూర్ లో 1806లో జన్మించాడు .సంస్కృతానికి పాణిని ఎంతటి ఘనుడో తెలుగు వ్యాకరణానికి చిన్నయ సూరి అంతటి ఘనుడు .ఆయన రాసిన బాల వ్యాకరణం ఒక కరదీపిక .తెలుగు వ్యాకరణ వేత్తమాత్రమే కాదు సూరి అమోఘ వచన రచనా దురంధరుడు కూడా .ఆలంకారిక గ్రాంధిక శైలికి మార్గ దర్శి చిన్నయ సూరి .ఈ రెండు రంగాలలో ఆయన అద్వితీయుడనిపించాడు .తెలుగులోమొట్ట మొదటి నిఘంటు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన వాడు
సూరి తండ్రి మద్రాస్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి .సూరి మద్రాస్ లోతెలుగు తమిళం ,సంస్కృతం ప్రాకృత భాషలను .తండ్రివద్దనేర్చి తర్క ,అలంకార శాస్త్రాల ను కంచి రామానుజాచార్య వద్ద అభ్యసించాడు .1845-1848కాలం లో పచ్చయప్ప కాలేజిలో తెలుగు శాఖాదికారిగా పని చేశాడు .తర్వాత ప్రెసిడెన్సి కాలేజిలో సేవలందించాడు. సర్ సి పి బ్రౌన్ మొదలైన వారు సూరికి ముఖ్య స్నేహితులు. 56సంవత్సరాలు మాత్రమె జీవించి చిన్నయ సూరి 1862లో మరణించాడు
చిన్నయ సూరితెలుగు వ్యాకరణం బాల వ్యాకరం పాణిని సంస్కృత వ్యాకరణం అస్టాధ్యాయికి సమానం .సూరి గారి తెలుగు నీతి చంద్రిక సంస్కృతం లో బాణుని కాదంబరికి సరి సాటి .తెలుగువారికోసం సంస్కృతం లో సూరి 1-సూత్రాంధ్ర వ్యాకరణం2-ఆంద్ర శబ్డాను శాసనం రెండు వ్యాకరణాలు రాశాడు .రాసిన తెలుగు సంస్కృత రచనలలో సంస్కృత శ్లోకాలనూ చిన్నయ రాశాడు .ప్రముఖ దాత వితరణ శీలి పచ్చయప్ప పై ‘’పచ్చయప్ప యశో మండనం ‘’ను సంస్కృతం లో 1845లో రాశాడు .అందులోని కొన్ని రస గుళికలు –
‘’ఏకం కలాం భువనజాతి హితం ధన్యా స్సర్వజ్ఞతా౦ వద కదం లభతే గిరీశః
బహ్వీ కళా భువన జాత హితా దదానస్సర్వజ్న ఏష ఖలు పచ్చప మాన వేంద్రః
గుణస్య బాదికాం వృద్ధం కృతవాన్ పాణినిః పురా —అబాదిత గుణం వృద్ధి మకరోత్పచ్చప ప్రభుః
పశ్యాయా మహానయందు సరితః పురాదిశాశ్చాదయం స్తత్ర స్మద్విజవాజి దేనుత రవో మగ్నాః పునర్నేక్షితాః
ఏవం చార జనం బ్రువాణామమరస్వామీ హసన్వక్తి భో –మా భేషీ ర్ననుభ ద్రుంగవానయ మతిఃపచ్చపాకీర్తి ర్మహః ‘’
40-చొక్క నాధుడు (1660
నరసంబ తిప్పాధ్వరి కుమారుడు చొక్కనాధుడు ఆంధ్రుదడేకాని దక్షిణ భారతానికి వలస వెళ్ళాడు తంజావూర్ రాజు షాహాజీ మహా రాజు ఆశ్రయం లో ను ,కేరళకు చెందిన ఇక్కేరి రాజు బసప్ప నాయకుని ఆస్థానం లోను ప్రాభవం పొందాడు .కవి నీల కంఠునికి సన్నిహితుడు .మహా పండితుడు రామ భద్ర దీక్షితునికి గురువు .అతని అన్నలు నలుగురు కుప్పాధ్వరి ,తిరుమల ,స్వామి యాజీ ,సీతారామ,తమ్ముడు యజ్నేశ్వరుడు అందరూ అందరే .తిరువసనల్లూర్ అని పిలువబడిన షాహాజి రాజాపురం పరగానాలో ఉండేవాడు .చొక్కనాధుడు రస విలాసభాణం,సేవంతికా పరిణయం కాంతిమతి పరిణయం రాశాడు .ఈ చివరి దానికి ‘’కాంతిమతీ సహరాజీయం ‘’అనే పేరు కూడా ఉంది .మధ్యార్జున స్వామి తిరునాళ్ళలో దీన్ని ప్రదర్శించేవారు .-మొదటి శ్లోకం
‘’సా నంద౦ మణి మచ్చీ స్సీమాని వాసన్ వక్షోజ చేలామ్చలం –వ్యాక్రు ష్వాద సలజ్జ మశు వినతగ్రీవం క్రుతస్వస్తి కం ‘’
పరిదుడు కవిని గూర్చి నాయకుని గూర్చి తెలియ జేస్తాడు –
‘’నేతా శాహ మహేంద్రో నాటకమతి చిత్ర సంవిధాన పదం –ఏష సభ రసజ్న కవిరపి చాస్యేష చొక్కా నాద సుధీః
కవి రస విలాస భాణందీనికి మున్దేరాశాడని సూత్రదారుడికి పారిషదుడికి మధ్య జరిగే సంభాషణలలో కవి వివరాలన్నీ తెలియ జేస్తాడు .భరత వాక్యం లో –‘’సంవర్ధతామజస్ర౦ సరస ముదు గిరాం సత్కవీనాం వచాంసి –క్షోణీపాలః సమస్తాః సుకృత పద ముపాశ్రిత్య తిస్టంతు నిత్యం ‘’
సేవాన్తికా పరిణయం నాటకం సుబ్రహ్మణ్య అనే గ్రామం లో సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలలో ఆడేవారు .బసవరాజుకు మలబారు రాజు మిత్రవర్మ కూతురు సేవంతికకు జరిగే వివాహ కద..కొచ్చిన్ రాజు గోదావర్మనుయుద్ధం లో ఓడించి మిత్రవర్మ అతడిని ఉడిపి దగ్గరున్న మూకంబిక మందిరంలో బందీ గా ఉంచుతాడు . తర్వాత విడిపించటం ,పెళ్లి చేయటం .
చొక్కనాధుడు తన స్నేహితుడు నీల కంఠను గూర్చి చెప్పిన శ్లోకం –
‘’తిప్పాధ్వరీంద్ర తనయో నను చొక్క నాద నామా విపస్చిదదయ మద్భుత నాటకేన-సంతోష సద్గుణనిధిం బసవ క్షితీంద్ర లబ్దాదికాం స్వపురం ప్రయాత .ఇందులో చొక్కనాధుని తమ్ముదిగురించి చెప్పలేదు
కవికి శ్రీరామునిపై ఉన్న భక్తికి ని తెలియ జేసే శ్లోకం –
‘’క్రుపాకటాక్షేణ కృతః క్రుతార్దో రామేణదీనేక దయా పరేణ-కశ్చిన్ముముక్షుః సుజనా డింద్రరేణుః నామ్నా జగన్నాధ ఇతి ప్రతీతః ‘’.ప్రతి కాండం చివర కవి వంశాన్ని చెప్పాడు .చివరి శ్లోకం –
‘’అక్కా జగన్నాధ మసూత్ మాతాపితా చ నారాయణా దేవవిధం –తన్నిర్మితే జ్ఞాన విలాస కావ్యే సర్గే యయావస్టంఉత్తమత్వం .’’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-12-15-ఉయ్యూరు

