ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -97
42-టైం మెషీన్ వంటి సైన్స్ ఫిక్షన్ రాసిన –హెచ్ .జి .వెల్స్ -2
గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే హాల్ట్ అకాడెమీలో కొంతకాలం బోధించాడు .బయాలజీ టెక్స్ట్ బుక్ రాశాడు .ఈ తీవ్రమైన పని ఒత్తిడిలో ఆరోగ్యం దెబ్బ తింది..గోరు చుట్టుపై రోకటి పోటు అన్నట్లు గ్రౌండ్ లో ఆడుతుంటే ఒక కిడ్నీ నలిగిపోయింది .తనకు టి బి వచ్చిందేమోనని భావించాడు .రక్తం కక్కుకోనేవాడు అదృష్ట వశాత్తు తేరుకొన్నాడు .ఇలా అనారోగ్యానికి గురౌతున్నా ‘’సరిపడా ఆరోగ్యం నాకు ఉండేది ‘’అన్నాడు .జబ్బు నుంచి తేరుకొంటూ ఉన్న సమయం లో ఫిక్షన్ రాయటం ప్రారంభించాడు అప్పటికే సైంటిఫిక్, అకాడెమిక్ పేపర్లు రాయటం లో సిద్ధ హస్తుడైనాడు .తను రాసినవి ప్రింట్ లో చూసుకోవాలనే కోరిక కలిగింది .1888లో రాసిన రెండు నవలలు నచ్చక తగల బెట్టేశాడు . రీములకొద్దీ రాసిన కవిత్వాన్ని చి౦చి పారేశాడు .ఇందులో ఎక్కువ భాగం కామిక్ కు చెందినవే .వచన రచనలు పత్రికలకు పంపితే తిరిగి వచ్చిన జాడే లేదు .ఒక చిన్న కధకు ఒక పౌండ్ డబ్బులోచ్చాయి అదే ప్రాఫిట్ అనుకొన్నాడు జర్నలిజానికి సంబంధించిన ఆర్టికల్స్ రాసి డబ్బు సంపాదించి జీవితం లాగించేవాడు .
వెల్ల్స్ మొదటి పుస్తకం ‘’సెలెక్ట్ కాన్వేర్సే షన్స్విత్ యాన్ అంకుల్ ‘’ప్రచురితమైంది .తర్వాత ‘’ది టైం ట్రావెలర్ ‘’ను సీరియల్ గా రాశాడు .ఇది క్లిక్ అయి మొదటిసారిగా వంద పౌండ్లు వచ్చాయి .ఇదే తర్వాత ‘’ది టైం మెషీన్ ‘’పేరిట పుస్తకం గా వచ్చింది .ఇదే మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ రచనగా చరిత్ర సృష్టించింది .రచనపై డబ్బు బాగా వస్తూ ఉండటం తో టీచింగ్ కు స్వస్తిపలికాడు .
అప్పటికే భావోద్రేకాల సుడిగుండం లో పడి కొట్టుకొంటున్నాడు.25వయసులో కజిన్ ఇసాబెల్ మేరీ ను పెళ్లి చేసుకొన్నాడు. .లండన్ లో స్టూడెంట్ గా ఉన్నదగ్గర్నించీ ఆమెను ప్రేమించాడు .ఆమె చాలా సౌమ్యంగా నెమ్మదిగా అందంగా ,సానుభూతి పరురాలుగా,మౌనంగా ఉండేది .ఆమె మౌనాన్ని తనతో ఏదీచెప్పటానికి లేక పోవటం అని ,ఆమె సానుభూతి ఏ విషయ౦ పై ఆమెకు అవగాహన లేక పోవటం వలన అని వెల్ల్స్ అర్ధం చేసుకొన్నాడు .శృంగారం అంటే ఆమెక౦తగా ఇష్టం ఉండేదికాదు .కనుక తన మగతనాన్ని వేరే చోట ప్రదర్శించాలనుకొన్నాడు .ఆరుసార్లు ఎంగేజ్ మెంట్లు అయినా ప్రేమ ఎందుకో సఫలం కాలేదు .
వివాహేతర సంబంధాలో వెల్ల్స్ కు మించిన వారు చాలా అరుదుగా ఉంటారు .వీటిని స్నేహితులు తెలిసినవారు తెగ చెప్పుకొనేవారు . తానూ బజాయించి చెప్పేవాడు వెల్ల్స్ .పెళ్లి అయిన రెండేళ్లకే భార్యాతో విడిపోయాడు .యామీ కేధరిన్ రాబిన్స్ అనే ఆమెకు దగ్గరయ్యాడు .ఆమెలో శారీరక మానసిక పరి పక్వత ఉందని అనుకొన్నాడు .కాని ఈయన్ను ఆమె భరించ లేక పోయేది .జేన్ అని ముద్దుగా పిలి చేవాడు అదే ఆమె కు సార్ధక నామం అయింది .వెల్ల్స్ గోడచాటు వ్యవహారాలను భరిస్తూ సర్దుకు పోయేది .వేల్స్ ను ‘’ప్రాఫెట్ ఆఫ్ అవర్ డే’’అని’’ ఫేబియన్ కాస బియాంకా’’ అనీ పిలిచేవారు .భర్త దొంగ చాటు శృంగారాలన్నీ ఆమెకు తెలుసు కాని వీటికోసం వివాహ బంధాన్ని తెంపు కోరాదని సర్దుకు పోయేది .
నడి వయసులో లావుగా తయారయ్యాడు వేల్స్ .నిరంతర రచన సాగిస్తున్నాడు .’’ది ఇన్విజిబుల్ మాన్ ,’’ది వార్ ఆఫ్ ది వరల్డ్స్ ,వెన్ దిస్లీపర్ వేక్స్ ,దిటేల్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైం.వగైరాలు బాగా క్లిక్ అయ్యాయి .నలభైలలో ‘’కీప్స్ అండ్ టోనో బాంగే’’అనే అతని రచనల్లో ఉత్క్రుస్టమైనదాన్ని రాశాడు .ఆత్మకధలాంటి నవలలూ రాశాడు .అందులో యవ్వనం లో తాను పడ్డ కస్టాలు బాధలూ రాశాడు .జోన్ అండ్ పీటర్ అనే మానవ సంబంధాల గురించి చర్చించాడు .మొదటి ప్రపంచ యుద్దానికిముందే యుద్ధాలలో టాంక్ ల వాడకాన్ని ఊహింఛి చెప్పిన మేధావి వెల్స్ .యుద్ధం లో విమానాలు చేసే విధ్వంసాన్నీ ఊహించి రాశాడు .పదమూడేళ్ళ ముందే జర్మనీతో యుద్ధం వస్తుందని చెప్పాడు .హీరో షీమా పై బాంబుదాడి జరగటానికి 31ఏళ్ళకు ముందే అలాంటి ఉపద్రవం జరగా బోతోందని ‘’ది వరల్డ్ సెట్ ఫ్రీ ‘’లో రాసిన క్రాంత దర్శి .’’ది అవుట్ లైన్ ఆఫ్ హిస్టరీ ‘’సూక్షం లో మోక్షం .స్ప్రుశినచని అంశమే లేదు .ఇంగ్లీష్ లో ఇది రెండు మిలియన్ కాపీలు అమ్ముడు అయి రికార్డ్ సృష్టించింది .దీనితర్వాత అంతే సక్సెస్ సాధించింది’’ది సైన్స్ ఆఫ్ లైఫ్ ‘’.దీన్ని కొడుకు జూలియస్ హక్స్లీ తో కలిసి రాశాడు .మూడు పుస్తకాలను ఏక కాలం లో రాసిన ఘనత వెల్స్ ది.ఒకటి ప్రచురణకు సిద్ధంగా ,ఒకటి గాలేరీ ప్రూఫ్ లో ,ఒకటి రాస్తూ ఉండేదిగా కనిపించేది .ఏ సబ్జెక్ట్ అయినా విస్తుతమైనదో ,అతి చిన్నదో అనిపించేదికాదు ఆయనకు .చిన్నదైనా పెద్దదైన అదే ఉత్సాహం తో రాసేవాడు .నీరస నిస్పృహలను దూరం చేయటం మానవాళిని జాగ్రుత పరచటమే ఆయన ధ్యేయం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-15-ఉయ్యూరు

