నాలుగవ గీర్వాణం
గీర్వానకవుల కవితా గీర్వాణం-4
44-త్రిపురాంతకకవి (18వ శతాబ్దం )
యాచ ప్రబంధం అనే చారిత్రాత్మక కావ్యం రాసిన త్రిపురాంతక కవి కౌండిన్య గోత్రీకుడు భట్టపాదుని కుమారుడు .వెలుగోడు ,వెంకట గిరి రాజ్య స్థాపకుడు యాచమనాయకుని ఆశ్రితుడు .ఈ కావ్యం లో యాచమనాయక వంశ వర్ణన చేశాడు –
‘’సక్రుదానతిరర్చనాయ భూయ ,దుభయోరిత్యనుక౦ప యాల సనం –అవిలంబిత విగ్రహేక భావం శివయోః శ్రీ సమవాయ మాశ్రయం ‘’బంగారు యాచుని గురించి ఉన్దికనుక కవి 18వ శతాబ్దం వాడని విద్వత్ కుమారా యాచఆస్థానం లో ఉంది ఉండాలని భావిస్తారు.
‘’బ్రహ్మాండే రోత్వరావతి పరం కేశవే భక్తీ భాజః –క్రుత్యాక్రుత్యా గ్రహణ హరేణోశిక్షితా యేన సోయం ‘’
చివరి శ్లోకం-
‘’యాచ ప్రభోతావక దాన పత్ర స్వరూప మాయాతిన చెన్న రూపం –దినేషు గత్సత్సు చ పంచషేషు భూయో హమాయాని భవత్సకాశం .
45-విఠల దక్షిణా మూర్తి పండితుడు (19వ శతాబ్దం )
విఠల రాజేశ్వర దీక్షితులు ,పరంబ ల కుమారుడు దక్షిణామూర్తి పండితుడు .ఈవిద్వత్ కవి 19శతాబ్ది మధ్యకాలం వాడు .మెదక్ జిల్లా సిద్ధిపేట తాలూకా చెప్పేల గ్రామ వాసి .మీమాంసా ధర్మ శాస్త్రాలలో అఖండ పండితుడు .కల్ప సూత్రాలపై ‘’యాజ్నికా భరణం ‘’రాశాడు మంచికవికూడా .ఎన్నో లఘుకావ్యాలు రాశాడు .వీటిలో మనో నైర్మల్య పంచకం ,జ్ఞాన తారావళి ,పంచ రత్నావళి ,బ్రహ్మానంద పంచకం ,కార్య సిద్ద్యాస్టకం ,జీవంముక్తాస్టకంమొదలైన 11రచనలున్నాయి
యిదే శ్లోకాలలో మనో నైర్మల్య పంచకం ఉంది –‘’ప్రతిక్షణ విశోధనా ద్రిపురిదంబహిర్నిల్మలం –న చేదితమహర్నిశం స్రవతి దుస్టగంధాన్ మలాన్ ‘’
జనన తారావళి 27శ్లోకాలున్నాయి –‘’సాక్షాత్క్రుతి బ్రహ్మాణి సావ దానే సురూప దేశాను భవాగామేశ్చ-ఏకాగ్ర చిత్తః తదను క్రమేణనిరుద్ధ భూమౌ విహారే రావిదాన్ ‘’
వ్యక్తీ పరబ్రహ్మ స్వరూపం అని తెలియ జెప్పే శ్లోకాలున్నది ‘’పంచ రత్నావళి ‘-హ్రుత్పున్దరీకే పరమధ్య సంస్తే దాహ్రాభిదే చిద్గాగనేయ ఆస్తే –సోయం చిదానందమయ స్సుఖస్య దుః ర్వస్య సాక్షీ పరమేశ్వరోస్మి ‘’
బ్రహ్మానంద పంచకమూ ఇదే ధోరణిలో ఉంది .కార్య సిద్ధి అష్టకం లో 8శ్లోకాలున్నాయి పది శ్లోకాలది ప్రదోష స్తవం .చిత్కలా భుజంగం 20శ్లోకాలు లక్ష్మీ కటాక్ష పంచకం లక్ష్మీదేవి స్తోత్రం శ్యామలా పంచ రత్న మాలిక శ్యామలాదేవి గురించి చెప్పినది –‘’ఇష్ట కామ్య ఫలసిద్ధిడా సకలలోక వశ్య కర మూలికా –ద్వాదశాబ్ద వయసి స్థితా మృదుల నీల వస్త్ర పరిదానికా
కాళికా గలిత చూలికా వికచ మల్లికా కుసుమ మాలికా –శ్యామలా మమ వరప్రదా భవతు చిత్కలా నవర్జస్వలా ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-12-15-ఉయ్యూరు

