నాలుగవ గీర్వాణం
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
46-దేవాయార్య దీక్షితులు
శ్రీపతి దీక్షితులకుమారుడే దేవాయార్య దీక్షితులు .హరితస గోత్రం .కాలాదులు తెలియవు .’’ప్రసన్న రామాయణం ‘’రాశాడు ఇందులో 22 సర్గలున్నాయి..మొదటిశ్లోకం –నిత్యాను ష౦గ దివి చిన్తయ దామ్నో యస్యామ్బుజా వాసుముఖాఃసురేంద్రాః—విభాంతివహ్నే రివవిస్ఫులింగా స్తస్మై నమస్యాం ‘’’వాల్మీకి ని స్తుతిస్తూ రాసిన శ్లోకం –‘’సారస్వతాంబు సర ప్రవృద్ధ శాఖాశతాదిస్టితదివ్య మూర్తిం –ఆలింగితంరామకధా లతాభి వాల్మీకి కల్ప ద్రుమ మాశ్రయం ‘’.తనను గురించి తన పుస్తకాన్ని గూర్చి –
‘’శ్రీ కాళిదాసాది కవీన్ ప్రణమ్య శ్రీ మత్పదాంకం సరాసాను బంధం –కావ్యం కరిష్యే కవి దేవయార్యః ప్రసన్న రామాయణ మదేయం ‘’
చివరగా –ఇతి శ్రీ దేవ యార్యేణ కృతే శ్రీపతి సూనునా –ప్రసన్న రామే కావ్యే స్మిన్ ద్వివిమ్శాయీరీతి ‘’
ఈ దేవయార్యుడు ప్రౌఢ దేవరాయల ఆస్థానం లో ఉంది ‘’స్మ్రుతి చంద్రిక ‘’రాసిన దేవన భట్టో కాదో తెలియదు .అలాగే 15,16శతాబ్దం వాడిన సంగీత ముక్తావళి రాసిన దేవనా చార్య యో కూడా తెలియటం లేదు .
47-వారణాసి ధర్మ సూరి
యల్లమామ్బా ,పార్వతేశ్వర సూరి కుమారుడైన ధర్మ సూరి వెలనాటి బ్రాహ్మణుడు .హరితస గోత్రీకుడు .వారణాసి కులం కవి చంద్రుడు . కవి.కృష్ణా జిల్లా పెదపులివర్రు లో జన్మించాడు .పరమ శ్రీరామ భక్తుడు .చివర్లో సన్యాసం తీసుకొని ‘’గోవిందా నంద సరస్వతి ‘’అయ్యాడు .మల్లినాద సూరికి జూనియర్ ..సాహిత్య రత్నాకరం రాశాడు .అందులో తన గురించి తనవాళ్ళ గురించి చెప్పాడు –‘’గోత్రే చ తస్య సమభూ దభి జాత వంశో వారనాసీత్యుపపదేనభువి ప్రసిద్ధః –తత్ర భవన్ బుధవారాస్త్రిపురా రి సోమ యజ్వాదయ శ్శుభ తప శ్రుతా శీలవృత్తాః’’
గొప్ప పండితకవి వంశం లో పుట్టానని చెప్పాడు .ధర్మ భూపాలుడు నారాయణ పండితుని సత్కరించాడని రాశాడు .ధర్మ సూరి చాలా రాసినా మూడు గ్రంధాలే లభ్యం .అందులో ముఖ్యమైనది ‘’సాహిత్య రత్నాకరం ‘’.పది తరంగాలున్న గ్రంధం ..అలంకార శాస్త్ర గ్రంధం ఉదాహరణలన్నీ రాముని తో సంబందాం ఉన్న స్వకవితలే .దీనిపై చర్ల వెంకటశాస్త్రి ‘’నౌక ‘’,మల్లాది లక్ష్మణ సూరి ‘’మంద్ర ‘’,మధుసూదన మిశ్ర శర్మ ‘’నౌక ‘’అనే వ్యాఖ్యానాలు రాశారు .
రెండవ గ్రంధం ‘’రత్న ప్రభ ‘’.మూడవది నరకాసుర విజయ వ్యాయోగం ..ధర్మ సూరి కవిత్వం లో లాజిక్ తో బాటు కవితా మాజిక్ కూడా ఉంటుంది –
‘’తర్క కార్కశతాం గతాపి నితరం వాగ్వైఖరీ సత్కవేః మాధుర్య ప్రకటీకరోతి కవితా కాలేషు కిమవదాద్భుతం ‘’
పశ్యత్యంత కఠోర తాముపగతా గ్రీష్మే మయూఖా వలిః –కిం నావిష్కురుతేనవామృత భరం భాసం నిదోః ప్రావ్రుషి ‘’
కవికి అనేక విషయాలలో మంచి ప్రవేశం ఉన్నట్లు చెప్పాడు –
‘’భామత్యుల్లలిసితా రాతా వివరణే తంత్రే నిరూఢిం గతాః-సచ్చిన్తామణయః సముజ్వల యశో లీలావతీ వల్లభాః
ధర్మ సూరి రాసిన ఇతరగ్రందాలు అలభ్యం ..కవిరాసిన ‘’కృష్ణ స్తుతి ‘’కృష్ణా నది గురించే ..వ్రుత్యనుప్రాసలో ఉన్న ఒక శ్లోకం –
‘’కృష్ణా మ్రుష్నాతిసిష్నాస్వభి జనవ్రుజినాన్యశు –వర శౌరాది దారా రుచిర రుచిర హీ భేనాచ్చపేన
శుభ్రా శుభ్రా భ్యదూర్మిభ్ర మకర మకర గ్రామణీగ్రామనీడా –గద్యా గద్యారారేదో వివర భువి వల్లద్వీ వరాదా వరోదా ‘’
10౦ శ్లోకాల సూర్య శతకం రాశాడు .నాగ బంధం లో సూర్య బింబాన్ని వర్ణించాడు –
‘’బింబం ధ్వాంత వ్యాదాడం కనక ఘరా శిర రశ్చారి శోణాద్భుదాప్తం –పంచాది ప్రేమ సోమ క్షత దమురుముదః కర్త్రు కావ్యూహ హారి ‘’
బాలభాగవతం ,హంస సందేశం ,కంస వధ నాటకం భాష్య రత్న ప్రభ రచించాడు .’’బ్రహ్మ సూత్రా విషయ వాక్య వ్రుత్తి ‘’కూడా రాశాడు ‘
సశేషం
మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -18-12-15-ఉయ్యూరు

