చిన పున్నయ్యే అయినా పెద్ద పూర్ణ ప్రజ్న శాస్త్రి

చిన పున్నయ్యే అయినా పెద్ద పూర్ణ ప్రజ్న శాస్త్రి

72ఏళ్ళ వయసులో కంచు  ఘంట లాంటి స్వరం తో వేదం నుంచి వేమన దాకా మాట్లాడగల నేర్పూ ,శాస్త్రం నుంచి శాస్త్రీయ దృక్పధాన్ని పిండగల ఓర్పూ ,సంగీతాంబోధిని తరచి అనర్ఘ రత్నాలను వెలికి తీసే పరిశీలనా ,ఏది చెప్పినా ,మాట్లాడినా రుషిప్రోక్తంగా భాసి౦పజేసే వాక్కు ,నాటక రచనలో సిద్ధ హస్తం ,భువన విజయ’’ భట్టు మూర్తిమత్వం ‘’వ్రుత్తి రిజర్వ్ బాంక్ ఉద్యోగమేకాని ప్రవ్రుత్తి సాహిత్య సంగీత ర(రా )సమయం గా సార్ధకం గా జీవిస్తున్న పెద్దలు శ్రీ అందుకూరి చిన పున్నయ్య శాస్త్రి గారు .ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం ఫోన్ లో వారితో పరిచయమవ్వటం వారి సౌజన్యానికి ముగ్ధుడ నవటం ,వారూ నేను కలుసుకోవాలనుకోవటం ,20-12-15 ఆదివారం సాయంత్రం బాచుపల్లి నుంచి బయల్దేరి  4గంటలకు పంజా గుట్టలోని వారి స్వగృహం లో నేనూ మా అబ్బాయిలు శాస్త్రి ,శర్మ లతో కలిసి వెళ్లిదర్శించిటం వారు అన్నట్లు పరిచయమైన36గంటలలోనే ఆయనను కలిసిన మొదటి వ్యక్తిగా నేను రికార్డ్ సృష్టించటం తమాషాగా ఉంది .వారి ఫోన్ నంబర్ నాకు ఇచ్చి మాట్లాడమని  శుక్రవారం సాయంత్రం నాకు ఫోన్ చేసి   చెప్పి ప్రోత్సహించిన పొన్నూరు సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్  శ్రీ తూము లూరు శ్రీ దక్షిణా మూర్తిశాస్త్రి గారి అమృత హృదయానికి ఎన్ని  కృతజ్ఞతలు చెప్పినా చాలదు . శ్రీ పున్నయ్య శాస్త్రి   బహుముఖ ప్రజ్ఞను సాహితీ బంధువులకు తెలియ జేయాలనే సంకల్పమే  ఈ వ్యాసం .

శ్రీ అందుకూరి చిన పున్నయ్య శాస్త్రి గారు అంటే ఎవరికీ తెలియదు .కాని ఏ.సి.పి.పిశాస్త్రి గారు అంటే అందరికీ తెలుస్తుంది. అదీ వారి పేరులోని మహత్తు .19-1-1944నశ్రీ అందుకూరి వెంకట సుబ్బయ్య ,శ్రీమతి అచ్చమాంబ దంపతులకు జన్మించారు . బి. యే.డిగ్రీ పొంది  రిజర్వ్ బాక్ లో ఉద్యోగించి అంచ లంచలులంచలుగా  ఎదిగి అసిస్టంట్ మేనేజర్ గా 2020 03సెప్టెంబర్ లో పదవీ విరమణ చేశారు .

సంగీతం లో విశేష అభిమానం ఉన్న శాస్త్రిగారు హైదరాబాద్ రాం కోఠి ఠిప్రభుత్వ కళాశాలలో 19668లో చేరి కర్నాటక సంగీతం నేర్చి ‘’సంగీత విభూషణ్ ‘’అయ్యారు  .తను నేర్చిన సంగీతాన్నిసార్ధకం చేస్తూ హైదరాబాద్ ఆకాశ వాణి కేద్రం వారు ప్రారంభించిన యువవాణి సగీత కార్యక్రమాలకు తన ప్రతిభా సామర్ధ్యం తో సార్ధకత చేకూర్చారు అనేక సభలలో ,దూర దర్శన్ లో సంగీత గేయాలకు స్వర రచన చేశారు ‘’నాం ఏక్ హై’’అనే హిందీ గేయ నాటికకు స౦గీత రచన చేశారు తెలుగు కూచిపూడి గేయ నాటిక ‘’మహా శ్వేత ‘’కు అనేక సంవత్సరాలు సంగీత రచన చేసి నాటిక విజయానికి ఎంతగానో  తోడ్పడ్డారు .దీనిరచయిత కీ శే.పి.వి.విరోహిణీకుమార్ ,.నృత్య దర్శకులు సరళాకుమారి .ఈ త్రయం మహా శ్వేతను సాహిత్య సంగీత నృత్య త్రివేణీ సంగమం చేసింది .1998 8లో ‘’అష్ట లక్ష్మీ వైభవం ‘’కు రచనా ,సంగీతం సమకూర్చి వైభవం తెచ్చారు .ఇది హైదరాబాద్ దూర దర్శని కేంద్రం నుండి దీపావళి ప్రత్యేక కార్యక్రమంగా ప్రసార మైంది దీనికి నిర్దేశకులు ప్రముఖ నృత్య దర్శకురాలు  డా .శ్రీమతి జొన్నల గడ్డ అనూరాధ .శాస్త్రి గారి ‘’సర్వమత గేయ నాటిక ‘’కొత్త గూడెం రేడియో స్టేషన్ నుండి ప్రసారమైంది .హైదరాబాద్ కేంద్రం శాస్త్రిగారి రచన ‘’సగీత కళానిధి భట్టు మూర్తి ‘’ని 2004 04లో ప్రసారం చేసి భట్టుమూర్తికవి లోని సంగీతజ్ఞతను శ్రోతలకు అందజేసింది .

శాస్త్రి గారి  రచనలు  చాలా భాగం ‘’రుషి పీఠం ‘’,మూసీ పత్రికలలో ప్రచురితాలు .వైదిక సాహిత్య విషయాలపై శాస్త్రిగారు ఎన్నో విజ్ఞాన దాయక వ్యాసాలూ రచించి అందులోని నిగూఢ భావాలను తేట తెల్లం గా జనసామాన్యానికి తెలియ జేశారు ,చేస్తున్నారు .’’కచ -దేవ’ యాని’’కధ ను ‘’విద్యా మహిమ ‘పేరుతో రచించారు .సీతా కల్యాణం గేయ నాటిక రాశారు .భువన విజయం లో శాస్త్రి గారు  దాదాపు పాతిక ఏళ్ళుగా ‘’భట్టు మూర్తి కవి ‘’పాత్రను రస రమ్యంగా పోషిస్తూ ప్రేక్షకాభి మానాన్ని సంగీత రసజ్ఞుల మెప్పును పొందుతున్నారు .శాస్త్రిగారి ‘’మిత్ర లాభం ‘’పద్య కావ్యం అముద్రితం .

శాస్త్రిగారు ఆకాశవాణి కి అనేక రేడియో నాటకాలు సంతరించి ఘన యశస్సు నార్జిచారు .అదులో ముఖ్యమైఅవి కాళి దాసు ను గురించి ‘’ప్రాణి ప్రధానం ‘’,బిల్హణ కవి జీవితం పై ‘’బిల్హణీయం ‘’,పులకేశి అనే చారిత్రిక నాటకం ,గరుత్మంతుని కధను ‘’సత్య నిష్ట’’గా ,మను చరిత్ర ,నల చరిత్ర  ,రఘు వంశ కధ ను ‘’కుముద్వతీ పరిణయం ‘’గా ,విప్రనారాయణ చరితం ను  ‘’వైజయింతీ విలాసం ‘’గా ,విడాకుల పై ‘’ఇయం సీతా మమ సుతా ‘అనే  సాంఘిక నాటకాన్ని ,దండి దశకుమార చరిత్ర ను  ‘’అవంతీ సుందరీ పరిణయం ‘’నాటికలుగా మలచారు .ఇవన్నీ రేడియో లో ప్రసారమై బహుళ జామోదం పొందాయి .శాస్త్రి గారి నల చరిత్ర నాటకాన్నిధర్మ పూరి సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్  కీ శే.కోరిడే రాజన్న శాస్త్రి గారు  సంస్కృతం లోకి అనువదించగా ‘’సురభారతి ‘’సంస్థ ప్రచురిచింది .మహా మహోపాధ్యాయ స్వర్గీయ  శ్రీ పుల్లెల శ్రీరామ చంద్రుడుగారు తమ అమృత హస్తాలతో ఆవిష్కరిచి సార్ధకత కల్పించారు .ఇది పాఠ్య గ్ర౦ధంగా చేయబడి నాటక గౌరవాన్ని ఇనుమడింప జేసింది .శాస్త్రిగారు ఆంగ్లం లో ‘’ది మైండ్ ఆఫ్ గాడ్ ‘’అనే ఆలోచనాత్మక రచన చేశారు .ఆంగ్ల పత్రికలలో శాస్త్రి గారి వ్యాసాలూ దర్శన మిస్తాయి .

శాస్త్రి గారు గొప్ప స్టేజి నటులు కూడా .1970వరకు చాలా నాటకాలలో వివిధ పాత్రలు ధరించి మెప్పించారు .1977లో లిటిల్ దియేటర్ వారి ‘’విరజాజి ‘’నాటకం తో హీరో  పాత్ర ధరించి రంగస్థల నటనకు స్వస్తి పలికారు .ఇన్ని రకాలుగా విభిన్న రంగాలలో తమ శేముషీ వైభవాన్ని ప్రదర్శిస్తున్నారు .ఒక రకం గా పూర్ణ ప్రజ్ఞులు ,ప్రాజ్ఞులు శాస్త్రిగారు .శాస్త్రి గారితో మాట్లాడటమే ‘’ఒక ఎడ్యు కేషన్ ‘’.

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12 -15-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.