శ్రీ .ఏ.సి.పి.శాస్త్రి గారి ‘’The mind of God ‘’కు నా స్వేచ్చానువాదం దైవ చిత్తం -1

దైవ చిత్తం -1

శ్రీ .ఏ.సి.పి.శాస్త్రి గారి ‘’The mind of God ‘’కు నా స్వేచ్చానువాదం

‘’పురాణాలను శాస్త్రీయంగా విశ్లేషించి వివరింఛి ,జన సామాన్యం లోకి వ్యాప్తి చేయాలన్న    కోరిక చాలా కాలంగా నాలో ఉండి పోయింది .అందుకనే చాలా వినయంగా నాకు సాధ్యమైన రీతిలో  దీన్ని ముద్రిస్తున్నాను .దయచేసి చదవండి .నచ్చక పొతే పక్కన పారేయండి .మనసుకు నచ్చితే కొన సాగించండి ‘’అని  శాస్త్రిగారు చదువరులకు మనవి చేశారు .ఈ పుస్తకం నిన్న సాయత్రం నాకు వారి మిగిలిన పుస్తకాలతో బాటు అందజేశారు .దీని  లోని ముఖ్య విషయాలు తల స్పర్శగా మాకు తెలియ జేశారు .పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని ‘’దీన్ని నేను తెలుగు లోకి అనువదించి  సాహితీ బంధువులకు అంద జేస్తాను’’అని  అనగానే శాస్త్రి గారు రెండు చేతులు జోడించి’’ మహద్భాగ్యం’’ అన్నారు . అందుకే ఉదయం వారి గురించి ‘’చిన పున్నయ్యే కాని పెద్ద పూర్ణ ప్రజ్ఞ శాస్త్రి ‘’’వ్యాసం రాసి వారి బహుముఖీన ప్రతిభా పా౦డిత్యాల గురించి వివరించాను .ఇప్పుడీ అనువాదాన్ని అందజేస్తున్నాను .ఇదీ ‘’దైవ చిత్తం ‘’కు నేపధ్యం .వారికి మన సరస భారతి గ్రంధాలను బహూకరించాను .

దైవ చిత్తం

కొన్నేళ్ళ క్రితం ప్రపచ ప్రసిద్ధ శాస్త్ర వేత్త స్టీఫెన్ హాక్ రాసిన  ‘’ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’’పుస్తకం చూసి చదివాను .అయ్యో ఒక దశాబ్దం ఆలస్యంగా దీన్ని చదివానే అని బాధ పడ్డాను .దీన్ని  బాంటాం ప్రచురణ సంస్థ 1988లో ప్రచురించింది .సహజంగా నేను సైన్సు వాడిని కాను .సైన్స్ లో యే శాఖలోనూ ప్రవేశం ఉన్నవాడినీ కాదు .మీ చేతులో ఉన్న ఈ చిన్న పొత్తంలో ముఖ్యంగా  కాస్మాలజి పై చర్చ ఉంటుంది .దీనికి  గణితం ,భౌతిక,  ,రసాయన శాస్త్రాలు సహకరిస్తున్నాయి .క్లాసికల్ సైన్స్ లలో శిక్షణ పొంది పండిపోయిన వారు చేయాల్సిన పని ఇది .నా బోటి శిక్షణ లేని వారు చేబట్టాల్సిన దికాదు .దీనిని  రాస్తూ పోతుంటే సుమారు 45 ఏళ్ళ క్రితం డిగ్రీలో చదివిన సామాన్య శాస్త్ర విషయాలన్నీ గుర్తుకొచ్చాయి .

భారతీయ పరంపరాగత   వేదసాహిత్యం లోని  విజ్ఞానం, పురాణాలలోని  లోని కీలక భావనలను,  ‘’బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం ‘’లోని నిర్ణయాలను సమన్వయ౦ చేసి  ఈ పుస్తకాన్ని రాస్తున్నాను .వీటిలోని పోలికలు ,సమన్వయము ,విరుద్ధ భావనలను దృష్టికి తెస్తున్నాను . వేద విజ్ఞానం లోను ,బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం లోను బాగా కొట్తోచ్చేట్లుకనిపించే  ప్రతీకలలో  ఉన్న పోలికలను సూచిస్తున్నాను .సైన్స్ లో ఆవిష్కరింప బడిన మహా సిద్ధాంతాలు కూడా తప్పకుండా పునశ్చరణకు  లోను కావాల్సిందేనని మన అనుభవాలు తెలియ జేస్తున్నాయి .మానవుడు నిరంతరం తార్కిక ,శాస్త్రీయ ఆలోచనా శీలి అని ఇదే అభివృద్ధికి చిహ్నం –అని మనం భావించాలి .ఈ పుస్తకం లోని  కొన్ని సిద్ధాంతాలనుఆ తర్వాత  అవసరాన్ని బట్టి మార్చాల్సి వచ్చింది . చర్చ సగుణాత్మకమై  వేద భావన లను పోలి ఉంటేనే ఈ మార్పు చేశాను .అనుమానాలకు తావు లేకుండా సైన్సు సిద్ధాంతాలు స్థాపింప బడే  వరకు భారతీయులు వేద దృక్పధమే సరైనదని భావింఛి నమ్మే వారు .సైన్సు కూడా ఇవాళ కాకపోతే రేపైనా ఇవే నిర్ణ యాలు చేస్తుందని వారి ప్రగాఢ విశ్వాసం .సైన్స్ రంగం లో ని సిద్ధాంత విలువల  పై ఈ పుస్తకం అపార గౌరవ భావాన్ని కలిగి ఉంది .

ఈ సందర్భం గా ఒక విన్నపం .నాకు కనిపించిన పోలికలు బహుళ ప్రచారం లో ఉన్నవే .ప్రతి బారతీయుడికీ తెలిసినవే .సైన్సు పరిశోధనా ఫలితాలను హిందూ వేద విజ్ఞానానికి అంట గట్టి సైన్స్ ను చులకన గా చూస్తున్నానని కొందరికి అనిపించ  వచ్చు .ఏదైనా సత్యానికి దూరం కాదు కదా .వేద భావనలు  అతి సహజంగా సరళం గా ఈ  నాడు కనిపిస్తున్నాయి .ఇవి ఎంతోకాలం క్రితమే  ఈ నమ్మకాలు మన సమాజం లోవిలువ కలిగి  మెదడులలో ఉండిపోయిన విషయం మనకు జ్ఞాపక మొస్తుంది .అందుకనే అవి సహజాతాలు అని పిస్తున్నాయి ,ఇది కాంతిలో ఏడు రంగులున్నట్లుగా  కనుగొన్నట్లే అనిపించే టట్లు,అదొక కొత్త విషయమే కాదన్నట్లుగా ఉంటుంది .ఈ విషయాన్నికానీ పెట్టి కొన్ని శతాబ్దాలు అయిపోయి ,మానవ మనసులలో నిలిచిపోయి అదేదో అద్భుత విషయం కాదని అతి సామాన్యమైనదేనని అనిపిస్తుంది .అంత మాత్రం చేత ఆ ఆవిష్కరణ ను తక్కువ చేయటంగా భావించినట్లా ?పూర్వ కాలం లో చదువులు వ్రుత్తి పరమైనవి గా (ప్రొఫెషనల్ )గా ఉండేవి .ఈ వృత్తికి చెందని వారికి సంస్కృతం తో పరిచయం ఉండేదికాదు .వీరికి వీటి విషయమై అవగాహన కల్పించటం కోసం ,రాయటానికి భద్రపరచటానికి  తగిన సౌకర్యాలు లేని కాలం లో ఈ కీలక భావనలను మత  సంబంధమైన కార్యాలలో,ఉత్సవాలలో పూజాదికాలలో  నిక్షిప్తం చేసి పరం పరాగతం గా  తర తరాలకు అంద జేయటం జరిగింది  .చదువుకొన్న వారికే గ్రంధాల లోని విషయాలు తెలిసేవి .ఈ రోజుల్లో మనం గ్రంధాలయాలకు వెళ్లి తెలియని విషయాలను అవగాహన చేసు కొంటున్నట్లే ఆనాడు చదువు రానివారు పండితుల వద్దకు వెళ్లి సార్వకాలిక సత్యాలను తెలుసుకొనే వారు .అచ్చు యంత్రం కని పెట్టేంత  వరకు అన్ని దేశాలలో అన్ని నాగరకతలలో ఇదే విధానం అమలులో ఉండేది .కనుక దయచేసి నేను  పోలికలపై చేసిన వ్యాఖ్యలను మొదటి సారి పుస్తకం చదివినట్లు శ్రద్ధగా చదవ వలసినదిగా మనవి చేస్తున్నాను .అవి బాగా పరిచయమైనవే అయినా తిరస్కరింప బడాల్సినవి కావని గ్రహించండి .మొదట అధ్యాయాల వారీగా విషయాన్ని వివరిస్తున్నాను .ముందు అందులోని అంశాలను తెలియ జేసి తర్వాత నా వ్యాఖ్యానం రాస్తున్నాను .ఇది అందరికి సుబోధకం గా ఉంటుందని నా నమ్మిక .’’

ఎ.సి .పి . శాస్త్రి –కేశవ నగర్ కాలని –హైదరాబాద్

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దర్గా ప్రసాద్ -21-12-15-కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.