ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -136
55- సర్వ శాస్త్ర పారంగతుడైన బ్రిటిష్ మేధావితత్వ వేత్త ,అమెరికా పౌరుడు నోబెల్ లారియట్ –బెర్ట్రాండ్ రసెల్ -2
ప్యూరిటన్ల రూపు రేఖలు మరో రెండేళ్లలో మారిపోతున్నాయి .బీట్రిస్ వెబ్ మాటల్లో ‘’రసెల్ తనలోకాని ఇంకెవరి లోనైనా కానీ చిన్న తప్పును కూడా సహించేవాడు కాదు .మనుషుల స్థాయిని బట్టి తప్పులు ఉంటాయనేవాడు ‘’.సంపూర్ణతలో ఏ లోపమున్నా సహించేవాడు కాదు .భార్య అయినా లోకమైనా అదే పద్ధతిలో ఉండేవాడు . మానవ అభ్యుదయానికి ఆధారం సైన్స్ అని నమ్మాడు..’’సెలక్క్టేడ్ పేపర్స్ ‘’కు ముందుమాట రాస్తూ ‘’యవ్వన వాంఛ నన్ను మానవ సమాజ శ్రేయస్సును ఆలోచింప జేసింది ..గణితం నుండి సైన్స్ కు చేరి ఒంటరిగా పగటికలలతో గడిపాను .గలీలియో ,డేస్కార్తెస్ లు కూడా వారి యవ్వనం లో ఇలాగే ఉండేవారేమో .ప్యూర్ మాదమేటిక్స్ లో రాణించాలంటే సైన్స్ లోనూ ప్రతిభ సాధించాలని పించింది .కనుక సైన్స్ నాకు బాగా దగ్గరైంది .ఇదే సమయం లో నాబుద్ధి ఫిలాసఫీ వైపు పరిగెత్తింది .నైతికతకో వేదాన్తానికో కాదు ‘’by the wish to discover whether we possess anything that can be called knowledge ‘’.
కనుక జ్ఞాన సముపార్జన కోసమే రసెల్ గవేషణ సాగించాడు .తరువాత తుఫాను మధ్య ఉన్న భావన కలిగించాడు .దేనితో రాజ్యానికి శత్రువై ,అనైతికుల లో ఒకడు అనిపించుకొన్నాడు చివరికి అధికారిక దార్శనికుడు అయ్యాడుకాని పిడి వాదిఅని పించుకోలేదు .24వ ఏట మొదటిపుస్తకం ‘’జర్మని సాంఘిక ప్రజాస్వామ్యం ‘’పై విశ్లేషణాత్మక రచన చేసి ప్రచురించాడు .తరువాత రేఖాగణితం ,లీబ్నిజ్ ఫిలాసఫీలపైనా గణితం ,తర్కం ఒకటే అనే సిద్ధాంత వ్యాసం రచించాడు .38వయసులో ఏ.యెన్ వైట్ హెడ్ తో కలిసి ‘’ప్రిన్సిపియా మాధమేటికా ‘’వ్రాత ప్రతి తయారు చేశాడు .ఇరవై ఏళ్ళుగా తనను బాధిస్తున్న సమస్యకు ఇది పరిష్కారం అన్నాడు దీన్ని .అయితే అతని అసలు సమస్య కు ఇంకా పరిష్కారం లభించలేదు .అయితేనేం ఫిలాసఫీ లో కొత్త విధానం గణితం లో నూతన శాఖ లను కని పెట్టగలిగానని సంతృప్తి చెందాడు .ఇది అంతగా కొత్తదికాకున్నా సత్యాన్ని ఆవిష్కరించటానికి మరోమార్గమేర్పడింది . . పరిశీలన ,పరీక్ష ,విశ్లేషణ ల వలన జ్ఞానం అనుభవ మౌతుంది .కాని లెక్కలు లాజిక్ ఇంకా దూరం వెళ్ళగలవు .వీటిద్వారా ఇప్పటి వరకు ఉన్న జ్ఞాన పరిధి విస్తరింప జేశారు .అనుభవ జ్ఞానం కాదనలేము అన్నాడు .వేదాంతం లో నే కాదు దాని వివరణలో అవసరమైన భాషలోనూ మార్పులు తెచ్చాడు .ఏదైనా రుజువైన తరువాతనే నమ్మగలం .అందులోని ప్రతి పద సముదాయం ,వాస్తవం లకు కూడా ఇదే వర్తిస్తుంది .మనకు తెల్సింది అనుకొన్న ప్రతి విషయాన్నీ అనుమానించాలి ,జాగ్రత్తగా గమనించాల్సిందే అంటాడు రసెల్ .
41 వయసులో ప్రిన్సిపియా చివరి మూడవ భాగం అచ్చు అయింది .అమెరికా వెళ్లి హార్వర్డ్ లో ‘’లోవెల్ లెక్చర్స్ ‘’ఇచ్చి మొదటి ప్రపంచ యుద్ధ చివరికాలం లో ఇంగ్లాండ్ కు తిరిగొచ్చాడు .రసెల్ లోని ఫాసిజం ,మానసిక శక్తి ఒక్కసారిగా షాక్ తిన్నాయి –కారణం లిబరల్స్ ‘’యుద్ధానికి యుద్ధమే ‘’అన్న నినాదం విని .జంకు గొంకు లేకుండా యుద్ధ భీభత్సాన్ని గూర్చి తీవ్రంగా ప్రచారం చేశాడు .ఒక పాతికళ్ళ తర్వాత ‘’యుద్ధం నాలోని మేధస్సుకు వ్యతిరేకం .యుద్ధ ప్రేమికులు గొర్రెల్లా మందలో కలిసి పోయారు .మేధావులకు సంఘం పై ప్రేమా బాధ్యతా ఉంటె ఈ మానవ మారణ కాండకు ఊపిరులు ఊదరు ‘’అని రాశాడు .’’most intellectuals have no belief in the intellect ,except in quiet times ‘’అని చురక అంటించాడు .యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న ప్రచారాన్ని ,కరపత్రాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి జరిమానా విధించి చివరికి ట్రినిటి కాలేజీ లెక్చరర్ ఉద్యోగాన్ని పీకేసింది .కొద్దికాలం తర్వాత రాసిన ఆర్టికల్స్ మిత్ర కూటమికి వ్యతిరేకం గా భావించి అరెస్ట్ చేసి ఆరునెలలు జైల్లో పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం .జైలు జీవితం రసెల్ కు వరమై తాను టెక్స్ట్ బుక్ అని పిల్చుకొన్న ‘’ఇంట్ర డక్షన్ టు మాధమాటికల్ ఫిలాసఫీ ‘’పుస్తకం రాసి ప్రచురించాడు .దీని పై హెచ్ జి వెల్స్ ‘’ప్రతిపేజీ ని జైలు గవర్నర్ కు పంపి చదివి౦పజేసి ఆమోదం పొందాకే పబ్లిషర్ దగ్గరకు చేరేది .జైలు గవర్నర్ ప్రతి రాత పేజీని చదవలేక అర్ధమూకాక తలకాయ నెప్పి వచ్చి బాధ పడ్డాడు ‘’అని రాశాడు .రిటైర్డ్ అకెడేమీషియన్ అని రసెల్ ను అందరూ మర్చే పోయారు .ఇప్పుడు పబ్లిక్ పర్సన్ అయ్యాడు .దేశ ద్రోహిగానో .అమరవీరుడిగానో ప్రజల మనస్సులో ఉండిపోయాడు ..ప్రముఖ నవలాకారుడు రచయిత డి హెచ్ లారెన్స్ తో కలిసి అమెరికా వెళ్లి అక్కడ ‘’పసిఫిక్ ఉటోపియన్ కాలనీ ‘’స్థాపించాలనే ఆలోచనలో ఉన్నాడు .కాని యుద్ధం పూర్తి అయ్యేదాకా ఇంగ్లాండ్ లోనే ఉండటం మంచిదని నిర్ణయించుకొన్నాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-16 –ఉయ్యూరు

